May threee YSRCP main leader shift to TDP

May threee ysrcp main leader shift to tdp

YSRCP, Jagan, YSRCP Party, Vijayanagaram, TDP, AP

YSRCP party facing so many problems. At this time main leaders joining into YSRCP.

వైసీపీ నుండి మరో 3 వికెట్లు డౌన్..?!

Posted: 04/15/2016 03:00 PM IST
May threee ysrcp main leader shift to tdp

గతకొంత కాలంగా వైసీపీ పార్టీకి ఏపిలో గట్టి దెబ్బ తాకుతోంది. పార్టీకి చెందిన నాయకులు ఒక్కొక్కరుగా పార్టీని వీడి సైకిల్ పార్టీలోకి చేరిపోతున్నారు. ఏపిలో ఫ్యాన్ హవా అంతకంతకు తగ్గుతోందని కూడా చాలా మంది విశ్లేషిస్తున్నారు. కాగా తాజాగా విజయనగరంలో వైఎస్ఆర్ పార్టీ ఖాళీ అయ్యే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. వైసీపీకి విజయనగరం జిల్లాలో అసలు పార్టీ నేతలే కరువయ్యే పరిస్ధితి నెలకొంది. జిల్లాలోని పది ఎమ్మెల్యే స్థానాలలో ....గెలిచిన మూడు స్ధానాల్లోని ఎమ్మెల్యేలు కూడా వైసీపీని వీడి టీడీపీ తీర్ధం పుచ్చుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నారు.

Also Read: నల్ల కుబేరుల జాబితాలో చంద్రబాబు నాయుడు

జిల్లాకు చెందిన సుజయకృష్ట పార్టీ వీడేందుకు ఇప్పటికే రంగం సిద్దం చేసుకున్న సంగతి తెలిసిందే. అదే బాటలో మరో ఇద్దరు నేతలు క్యూలో ఉన్నారు.  సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర కూడా పార్టీ మారే అవకాశాలున్నాయని వార్తలు గట్టింగా వినిపిస్తున్నాయి. బుజ్జగించేందుకు విజయసాయి రెడ్డి వెళ్లినా పార్టీ వీడేదే పక్కా అని రాజన్నదొర తెగేసి చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వెన్నంటి ఉంటున్న కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి కూడా టీడీపీలో చేరుతున్నట్లు వార్తలు జోరందుకున్నాయి. పుష్ప శ్రీవాణి టీడీపీలో చేరిపోతే... ఉత్తరాంధ్రలో కీలక జిల్లా అయిన విజయనగరంలో వైసీపీకి అసలు ప్రాతినిధ్యం గల్లంతయ్యే ప్రమాదం లేకపోలేదు.

-Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : YSRCP  Jagan  YSRCP Party  Vijayanagaram  TDP  AP  

Other Articles