దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఓ పిరికి పంద, పెద్ద సైకో అంటూ పరుషంగా తన ఆఫీస్ పై సీబీఐ దాడులు జరిగిన సమయంలో డిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్విటాడు. అక్కడే అరవిందుడి మానసిక స్థితి బయటపడిపోయింది. అయితే ఆ సాయంత్రానికి నేరాన్ని అరుణ్ జైట్లీ పైకి నెట్టేస్తూ టాపిక్ ను పక్కదారిపట్టించే ప్రయత్నం చేశాడు. అంత సులువుగా మరిచిపోతామా? కట్ చేస్తే కొన్ని నెలల తర్వాత తన రాజకీయ జీవితంలో పెను సవాలునే ఎదుర్కొవాల్సిన పరిస్థితి ఇప్పుడీ ఏకే 47కు వచ్చింది.
రాజ్యాంగాన్ని ఉల్లంఘించి 21 మంది ఎమ్మెల్యేలు లాభదాయక పదవుల్ని చేపట్టారని, వారిపై అనర్హత వేటేయాలని అభ్యర్థనలు దాఖలయ్యాయి. దీని నుంచి వారిని తప్పించే క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘పార్లమెంటరీ సెక్రటరీ’ చట్ట సవరణ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి తిరస్కారం ఎదురైంది. దీంతో అసహనానికి లోనై కేజ్రీవాల్ ఓవైపు మోదీని తిడుతూనే పరోక్షంగా ప్రణబ్ పైనా విమర్శలు చేశాడు. నిజానికి రాజకీయ కురువృద్ధుడైన ప్రణబ్ పై ఎవరూ ఇంతవరకు విమర్శలు చేసింది లేదు. అలాంటిది ప్రస్తుతం సోషల్ మీడియాలో రాష్ట్రపతిని అవమానించిన క్రేజీవాల్ అంటూ తీవ్ర దుమారమే రేగుతోంది.
మొదటి నుంచి మోదీపై తిట్ల దండకం వల్లవేయటం మాట అటు ఉంచి, రాష్ట్రపతిగా, దేశం మొత్తం గౌరవించే నేతగా ఉన్న ప్రణబ్ పై విమర్శలు చేయటమే చర్చగా మారింది. అది పక్కనపెడితే... ఇన్నాళ్లూ తాను మాత్రమే ప్రదానిపై విరుచుకుపడుతూ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆపనిని తన అనుచర గణం మద్ధతు కూడా కూడగడుతున్నాడు. ఎమ్మెల్యేలపై వ్యక్తిగతంగా ఆరోపణలు రావటం, అధికారులపై ఎమ్మెల్యేల దాడులు వంటి విషయాల్లోనే కాదు దేశంలో ఏ సమస్య తలెత్తిన చివరాఖరికి ఉడ్తా పంజాబ్ సినిమా వివాదంలోనూ మోదీని లాగి, తనతోపాటు తన ఎమ్మెల్యేల తలదూరిపించి మరీ విమర్శనాస్త్రాలు సంధించాడు. ఇన్ని చేస్తున్నా ఢిల్లీ ప్రజలు మాత్రం దీనంగా తమ సమస్యల మాటేంటీ అని ఓ చూపు చూస్తున్నారు.
మొదటిసారి అధికారంలోకి వచ్చాక చేసిన హడావుడి, రెండోసారి గ్రాండ్ విక్టరీ తర్వాత పాలన చేస్తున్న సమయంలో చూపలేకపోతున్నారాయన. దీనికి కారణం మొత్తం దృష్టంతా మోదీపై సారించడమేనని తెలిసిపోతుంది. దీంతో మాకంటే మీకు మోదీయే ఎక్కువయ్యారా అని ప్రజలు కేజ్రీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో తీవ్ర నీటి ఎద్దడి, చెత్త సమస్య ఎక్కువగా ఉంది. అవేం పట్టించుకోకుండా అస్తమానం మోదీపై పడి ఏడవటం, పక్క రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు కోసం పాకులాడటం చేస్తున్నాడు. ఇకనైనా అవన్నీ పక్కనబెట్టి హస్తినవాసుల గోడు పట్టించుకుంటే మంచిది. లేకుండా చివరకు రాజకీయ భంగపాటు తప్పదు.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more