తెలంగాణ కాంగ్రెస్ ఇప్పుడు తన పార్టీలోని నేతలను కదిలించాలంటేనే గడగడ లాడిపోతుంది. తమ నేతలు అధికార పార్టీలోకి మారతారంటూ రూమర్లు రావటం, ఆపై వారిని బుజ్జగించి నిలువరించేందుకు పెద్దలో, లేక అధిష్ఠానమో దిగటం లాంటివి జరిగేవి. కానీ, చర్చలు తుస్సుమంటూ ఆ మరుసటి రోజే వారు కండువా మార్చేసుకోవటం మనం చూశాం. దీంతో నేతల జోలికి వెళ్లేందుకు పార్టీ వణికిపోతుంది. ఈ క్రమంలో ఇప్పుడ మరో కీలక నేత పార్టీ మారతారనే వార్తలతో పార్టీ పెద్దల గుండెలు కలుక్కుమంటున్నాయి.
మెదక్ జిల్లా కీలక నేత, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి త్వరలో పార్టీ మారతారంటూ ఇప్పుడు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే గతంలోనే ఆమె పార్టీ మారతారని అనుకున్నప్పటికీ ఆ పని చచ్చినా చేయనని ఆమె ఖరాఖండిగా చెప్పారు. కానీ, ప్రస్తుతం నెలకొన్న పరస్థితులు, సన్నిహితుల ఒత్తిడితో ఖచ్ఛితంగా మారొచ్చనే అంటున్నారు. పైగా కొంత కాలంగా ఆమె కేసీఆర్ తో రహస్య మంతనాలు చేస్తున్నట్లు సమాచారం అందుతోంది.
భర్త వాకిటి లక్ష్మారెడ్డి మరణంతో అనూహ్యంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆమె సానుభూతితో 1999 సార్వత్రిక ఎన్నికలలో ఘన విజయం సాధించారు. ఆపై దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి వెన్నంటే ఉండి ఆమె నడిచారు. దీంతో అధికారంలోకి రాగానే ఆమెకు మంత్రి పదవి కట్టబెట్టారాయన. ఆపై వరుసగా 2004, 2009లలో నర్సాపూర్ నుంచి ఆమె ఎమ్మల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్ రెడ్డి మంత్రి వర్గంలో చురుకుగా ఆమె పనిచేశారు. అయితే 2014 ఎన్నికల్లో మాత్రం గులాబీ సెంటిమెంట్ ముందు ఆమె ఓడిపోయారు. అయినప్పటికీ జిల్లాలో పార్టీ బాగోగులు చూస్తూ వస్తున్నారు.
తెలంగాణలో పార్టీ ఇప్పుడప్పుడే బాగుపడే స్థితి లేకపోవటంతో రాజకీయ భవిష్యత్తు కోసం పార్టీ మారాల్సిందేనని ఆమె సన్నిహితులు ఒత్తిడి తెస్తున్నారంట. కీలకంగా, క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఆమె ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ కు హ్యండివ్వదని పార్టీ భావిస్తోంది. అయితే మెదక్ బైపోల్ సమయంలో తనకు టికెట్ ఇస్తారని ఆశించిన ఆమె పార్టీపై గుస్సాతో ఉందని తెలుస్తోంది. అంతేకాదు ఎంత చేస్తున్నా పార్టీ పట్టించుకోకపోవటం, ప్రస్తుతం మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో ఆమె ఊగిసలాటలోనే ఉన్నట్లు సంకేతాలు అందుతున్నాయి. కేసీఆర్ తో రహస్య మంతనాలపై ఆమె దాటవేయం దీనికి మరింత బలం చేకూరుస్తుంది. దీంతో ఆమె గులాబీ గూటికి చేరతారా అన్న గుబులు కాంగ్రెస్ లో నెలకొంది.
భాస్కర్
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more