ఆ ఫిగర్ వెనక అసలు కారణం | KCR behind 24 districts for telangana

Kcr lucky number fixed for new districts

KCR lucky number fixed for new districts, 24 districts of telangana, 24 .జిల్లాలతో తెలంగాణ, కేసీఆర్ లక్కీ నంబర్ కారణమా?, కొత్త జిల్లాల వెనుక కేసీఆర్ లక్కీ నంబర్, కేసీఆర్ లక్కీ నంబర్ తో కొత్త జిల్లాలు, తాజా వార్తలు, తెలంగాణ వార్తలు, తెలుగు వార్తలు, latest news, telangana news, KCR behind new districts

KCR lucky number fixed for new districts. KCR behind 24 districts for telangana. officials ready for submit file to CM, siricilla 24th district for telangana.

ఆ ఫిగర్ వెనక అసలు కారణం

Posted: 06/21/2016 11:27 AM IST
Kcr lucky number fixed for new districts

పాలనా సౌలభ్యం కోసం తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదనను ఏడాదిన్నర క్రితం నుంచే ప్రారంభించింది ప్రభుత్వం. కానీ, ఎన్ని మండలాలు, ఎన్ని జిల్లాలతో రూపొందించాలో ముఖ్యమంత్రి కేసీఆర్ కే స్పష్టత లేకపోయింది. అన్నింట్లో నిఖచ్ఛిగా విజన్ తో ఉండే ఆయనకి సాంకేతికపరమైన ఇబ్బందులు ఈ విషయంలో ఆటంకంగా మారాయి. అయితే  ఆ సంఖ్యపై ఓ స్ఫష్టత వచ్చినట్లు తెలుస్తోంది. 24 జిల్లాలతో కూడిన తెలంగాణ ఏర్పాటుకు ఆయన సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. 25 లేక 26 నుంచి అని చెప్పి చివరి నిమిషంలో సిరిసిల్లను చేర్చి మరీ సడన్ గా 24 అంటూ ఫిక్స్ చేశారు అధికారులు.

తెలంగాణ సీఎం కె చంద్రశేఖర్ రావుకు దైవ భక్తి, జాతకాలంటే ఎంత పట్టింపో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికారంలోకి వచ్చిన కొత్తలో క్యాంపు అఫీస్ విషయంలో కూడా వాస్తును పాటించి కొద్దిరోజులు మార్పులు చేశారు కూడా. అదే రీతిలో జాతకాలు, అదృష్ట సంఖ్యలను కూడా ఆయన బాగా నమ్ముతారు. ఇప్పు కొత్త జిల్లాల విషయంలో కూడా ఆయన ఇదే పద్ధతిని ఫాలో అయ్యారు. 25, 26 అంటూ స్పష్టత లేకుండా పోయిన ఈ వ్యవహారంలో చివరకు సిరిసిల్లతో కలిసి మొత్తం 24 జిల్లాల అంశాన్ని అధికారులు ఫైనల్ చేయగా, దీని వెనక కేసీఆర్ సెంటిమెంట్ ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఆయన లక్కీ నంబర్ 6 అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక కొత్తగా జిల్లాల విభజన జరగనున్న వేళ, ఈ సంఖ్యకు సంబంధం ఉండేలానే జిల్లాల పెంపు ఉండాలని అధికారులకు సూచించారంట.  నిజానికి ఇటీవలి కలెక్టర్ల సమావేశంలో ముసాయిదాలో 23 జిల్లాలను పేర్కొనగా, 2, 3 కలిపితే 5 వస్తుంది. సంఖ్యా శాస్త్రం ప్రకారం అది ఆయనకు కలిసిరాదు. దీంతో చివరి నిమిషంలో కేటీఆర్ నియోజకవర్గం సిరిసిల్లను ఓ జిల్లాగా కలుపుతూ 24 జిల్లాలుగా కొత్త రిపోర్టు తయారు చేశారు. జిల్లాల సంఖ్య 24గా ఉంచేందుకే కేసీఆర్ కూడా సుముఖత చూపుతున్నట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో 24 జిల్లాలకు సంబంధించి పాలనాపరమైన సన్నాహాలు ముమ్మరం చేయాలని సీఎస్ రాజీవ్‌శర్మ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. దసరా నాటికి కొత్త జిల్లా కేంద్రాల నుంచి పరిపాలన ప్రారంభించేందుకు వీలుగా ఏర్పాట్లు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana CM KCR  24 new districts  KCR lucky number  

Other Articles