ease of doing business case in resembling cash for vote case

Is ease of doing business case similar to that case

Telangana government, ap government, copy, application, ease of doing business, Government adviser parakala prabhakar, counter cases on telangana, telangana chief secratary, cash for vote case. revanth reddy, chandrababu, stephen son, muthaiah, satyanarayanpuram ps, KCR, KTR, telangana acb, nirmala sitaraman

As Telangana government allges that ap government has copied its application in ease of doing business, parakala entry and counter cases resembles cash for vote case.

ఆ కేసును తలపిస్తున్న ఈజ్ అఫ్ డూయింగ్

Posted: 07/08/2016 07:44 PM IST
Is ease of doing business case similar to that case

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆన్‌లైన్ అప్లికేష‌న్ వ్యవహారం అచ్చంగా అలాగే కనబడుతుంది. అలాగంటే ఎలా అంటారా..? సేమ్ టు సేమ్ ఓటుకు నోటు కేసు వ్యవహారం మాదిరిగానే ఇది కనబడుతుంది. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి.. టీఆర్ఎస్ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్ పట్టుబడ్డ తరువాత తెలంగాణ ప్రభుత్వం తమను కావాలనే టార్గెట్ చేసి.. తమపై సంబంధం లేని కేసులను బనాయిస్తుందని వాదించిన టీడీపీ..మరుసటి రోజు అయనకు సంబంధించిన విజువల్స్ బయటికి రావడం టీవీలలో ప్రత్యక్ష ప్రసారం కావడంతో.. ఔరా అంటూ నిశ్చేష్టురాలైంది. అచ్చంగా అంధ్రప్రదేశ్ తమ ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ విధానాన్ని కాపీ కొట్టారంటూ తెలంగాణ ప్రభుత్వం అరోపించినప్పుడు ఎలాగైతే రియాక్ట్ అయ్యిందో అలాగే.

ఇక ఈ కేసులో అసలు నిందితుడు టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబేనని అప్పట్లో టీఆర్ఎస్ నేతలు వాదించారు. ఆయనకు సంబంధించిన టేపులు కూడా తమ వద్ద వున్నాయని తెలంగాణ ప్రభుత్వ నేతలు ధీమాను వ్యక్తం చేశారు. అయితే అదంతా ట్రాష్ అని.. తెలంగాణ ప్రభుత్వం తమను బ్లాక్ మెయిల్ చేస్తుందని టీడీపీ నేతలు బుకాయించారు. అలా వారం రోజులు గడిచిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు.. మనవాళ్లు బ్రిఫ్డ్ మీ అంటూ స్టీఫెన్ సన్ తో సాగించిన ప్రసంగ సారంశం మొత్తం టీవీలలో ప్రసారం కాగా షాక్ గురైన ప్రభుత్వం షాక్ గురైంది. ఇలా జరిగిన తరుణంలో స్వయంగా చంద్రబాబు మీడియా ముందుకు వచ్చి కౌంటర్ ఇస్తారని అందరూ భావించారు. కానీ అది జరగలేదు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ మీడియా ముందుకు వచ్చి.. తెలంగాణ ప్రభుత్వంపై పలు అరోపణలు గుప్పించారు. తెలంగాణ ప్రభుత్వం.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఫోన్ ను ట్యాపింగ్ చేసిందని సంచలన అరోపణలు చేశారు. ముఖ్యమంత్రితో పాటు పలువురు మంత్రులు, ఇతర ప్రభుత్వ ముఖ్య అధికారుల ఫోన్లు కూడా తెలంగాణ ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందని అరోపించారు. సరిగ్గా అదే తరహాలో ఇప్పుడు కూడా ఆంధ్ర‌ప్రదేశ్ ప్ర‌భుత్వ స‌ల‌హాదారు పర‌కాల ప్ర‌భాక‌ర్ ఎదురుదాడికి దిగారు. తెలంగాణ ప్రభుత్వం చ‌వ‌క‌బారు ఆరోప‌ణ‌లు చేస్తుందని.. ఇలాంటి అరోపణల‌పై తాము దృష్టి సారించ‌బోమని ఆయ‌న వ్యాఖ్యానించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా తెలంగాణ మంత్రి ఆరోప‌ణ‌లు చేశార‌ని ఆయ‌న అన్నారు. కావాల‌నే త‌మ‌పై బుర‌ద చ‌ల్లుతున్నార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు.

ఏపీ ప్ర‌భుత్వం పోర్ట‌ల్ ద్వారా ఇప్పటికే 9 వేల లావాదేవీలు జ‌రిగాయ‌ని పరకాల పేర్కొన్నారు. తెలంగాణ చేస్తోన్న ఆరోప‌ణ‌ల్లో నిజంలేద‌న్న విషయాన్ని తాము నిరూపించిన‌ట్లు ఆయ‌న పేర్కొన్నారు. తెలంగాణ మంత్రులు దీనిపై స‌మాధానం చెప్పాల్సిన అవ‌స‌రం ఉంద‌ని అన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏ రాష్ట్రం మ‌రో రాష్ట్రంపై ఇలాంటి ఫిర్యాదు చేయ‌లేదని ఆయ‌న వ్యాఖ్యానించారు. క‌నీస స‌మాచారం లేకుండా మాట్లాడుతున్నారంటే ఆశ్చ‌ర్యం క‌లుగుతోందని ఎదురుదాడికి దిగారు. సరిగ్గా అప్పటి ఓటుకు నోటు కేసు ఘటనలను ఒక్కసారి పరిశీలిస్తే.. కూడా ఇలానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిస్పందించిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ఇక తాజాగా మరోవిధమైన వాదనకు ఏపీ తెరలేపింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ విషయంలో తెలంగాణ సహా దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ముందున్న తాము గతేడాదే రెండో స్థానంలో ఉన్నామన్న వాదనను తెరపైకి తీసుకోచ్చింది. ఇతరులను కాపీ కొట్టాల్సిన అవసరం లేదని వాదిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు తాము అప్ లోడ్ చేసిన సమాచారం తమకు కాకుండా ఇతర రాష్ట్రాలకు తెలిసే అవకాశం లేదన్న కొత్త వాదనను ఏపీ ప్రస్తావించింది. తమ వెబ్ సైట్ లోకి అనధికారికంగా చొరబడిన వ్యక్తులకే ఈ సమాచారం తెలుస్తుందని కూడా వాదిస్తోంది. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన అధికారులు తమ వెబ్ సైట్ లోకి చొరబడ్డారని, ఇది ముమ్మాటికీ హ్యాకింగేనని ఏపీ సర్కారు భావిస్తోంది.

ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చేందుకు సమగ్ర విచారణకు దాదాపుగా నిర్ణయం తీసుకున్న ఏపీ... సదరు విచారణకు సంబంధించి ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటిదాకా ఏపీ నిగ్గు తేల్చిన వివరాల మేరకు... ఈ నెల 2న తెలంగాణ సీఎం కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి తమ వెబ్ సైట్ లోకి చొరబడ్డారట. సదరు అధికారి ద్వారానే తాము అప్ లోడ్ చేసిన సమాచారం తెలంగాణకు చేరిపోయిందట. తాము సమాచారాన్ని అప్ లోడ్ చేసిన తర్వాత ఎవరెవరు సైట్ లోకి ప్రవేశించారన్న సమాచారాన్ని పరిశీలించిన మీదటే ఏపీ ఈ విషయాన్ని నిగ్గు తేల్చింది. దీంతో ఇది మరో ఓటుకు నోటు కేసులా మారిందని, అయితే ఈజ్ అఫ్ డూయింగ్ బిజినెస్ కేసులో ఎవరు తప్పు, ఎవరు ఒప్పు అన్న విషయం కూడా కేంద్రమే తేల్చాలని, లేనిపక్షంలో న్యాయస్థానాలు జోక్యం చేసుకుంటాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ease of ding business  application  Telangana  AP  copy  cash for vote  

Other Articles