పెద్దాయనతో పెద్ద ప్రమాదమే! | jagan face troubles with Mysura reddy new party decision

Jagan face troubles with mysura reddy new party decision

Mysura reddy new party, Mysura reddy for rayalaseema, Jagan suffers with Mysura reddy party, new party for rayalaseema

Mysura reddy separate party for rayalaseema will definitely effects on Jagan's YSRCP.

పెద్దాయనతో పెద్ద ప్రమాదమే!

Posted: 07/09/2016 12:19 PM IST
Jagan face troubles with mysura reddy new party decision

ఓ వైపు నేతలు వలసలు కొనసాగుతున్నా, మరోవైపు ప్రతిపక్ష నేతగా విఫలమవుతున్న వైఎస్ జగన్ లో ఏ మాత్రం చలనం లేదు. పార్టీ నుంచి కీలక నేతలు ఒక్కోక్కరుగా వీడుతున్నా పెద్దగా పట్టించుకోకపోవటం ఆశ్చర్యం కలిగించేదే. చివరికి పార్టీ బలం అదికంగా ఉన్న రాయలసీమ నాలుగు జిల్లాల నుంచి నేతలు తగ్గిపోతున్నా... తమ పార్టీకి ఏ మాత్రం నష్టం లేదనే నమ్మకంలో మునిగిపోయాడు.  అయితే త్వరలో దానికి కూడా గండి పడే అవకాశం కనిపిస్తోంది.

కడప సీనియర్ నేత, మాజీ ఎంపీ మైసూరా రెడ్డి కొన్ని నెలల క్రితం వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆగష్టులో ఆయన తిరిగి సొంత పార్టీ టీడీపీ గూటికి చేరుతారనే వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే తాను ఏ పార్టీలో చేరతారననే విషయం చెప్పక పోయినప్పటికీ, రాయలసీమ వెనకబాటు తనంపై పోరాటం చేస్తానని వైసీపీని వీడే సమయంలో మైసూరా ప్రకటించారు. నిజానికి రాయలసీమ హక్కుల సాధన కోసం జగన్ ఏ మాత్రం కృషి చేయకపోవటం వల్లే ఆయన రాజీనామా చేశారన్న మరో వాదన కూడా ఉంది.

ఈ నేపథ్యంలో ఆయన ప్రత్యేక పార్టీ పెట్టబోతున్నారనే వార్తలు వినవస్తున్నాయి. ఇందుకు సంబంధించి ఆయన ఇప్పటికే బైరెడ్డి తోపాటు పలువురు కీలక నేతలతో కూడా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. నీరు, ప్రాజెక్టులు, ఉపాధి కల్పన తదితర విషయాల్లో సీమ హక్కుల సాధనకై ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ పోరాటం ఉండబోతుందనేది ఈ వార్త సారాంశం. దీంతో ఆ ప్రాంతంలో వైసీపీకి దెబ్బపడటంతోపాటు, ఏకంగా ప్రతిపక్ష స్థానానికే ఎసరు పెట్టే అవకాశం లేకపోలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.  

ఏపీ మొత్తం మీద వైసీపీ ఎక్కువ సీట్లు గెలుచుకుంది రాయలసీమ నుంచే. అయినప్పటికీ ఈ మధ్య ఈ నాలుగు జిల్లాల నుంచే అధికంగా నేతల వలసలు అధికార పక్షంలోకి కొనసాగుతున్నాయి. ఇలాంటి సమయంలో తమ పార్టీకేం ఢోకా లేదని ఫీలవుతున్న జగన్ కి మైసూరా నిర్ణయం అశనిపాతంలా తయారవుతుందనటంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు.  

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : YSRCP  AP politics  Mysura reddy  TDP  separate party  rayalaseema  

Other Articles