ఇక బ్రేకప్ తప్పదా? | TDP and BJP ready to contest in AP civic polls

Tdp and bjp ready to contest in ap civic polls

Civic polls in AP, AP civic polls, TDP-BJP alliance

Civic polls leads to TDP and BJP war in Andhra Pradesh.

ఇక బ్రేకప్ తప్పదా?

Posted: 07/12/2016 12:15 PM IST
Tdp and bjp ready to contest in ap civic polls

సార్వత్రిక ఎన్నికల ముందు అధికారం కోసం కలుసుకున్న చేతులు కలకాలం కొనసాగే ఛాన్సే లేదని విశ్లేషకులు చెబుతున్నప్పటికీ, తాము ఎప్పటికీ మిత్ర పక్షంగానే ఉంటామని టీడీపీ అండ్ బీజేపీ చెబుతున్నాయి. మధ్యలో ఎన్ని మనస్పర్థలు వచ్చినా, ఇరు పార్టీల నేతలు బహిరంగ విమర్శలు చేసుకున్నా అవేం మా మైత్రికి అడ్డురావని చాటుతున్నాయి. 2019 ఎన్నికలే ఈ పార్టీలకు అసలైన పరీక్ష పెడతాయని అనుకుంటుండగానే... బ్రేకప్ అప్ చెప్పుకునే అవకాశాలు సమీపంలోనే ఉన్నట్లు అనిపిస్తోంది.  

మధ్యలో స్థానిక సంస్థల ఎన్నికలు ఈ చిచ్చును దాదాపు కన్ఫర్మ్ చేస్తున్నాయి. కార్పొరేషన్, మున్సిపాలిటీలకు ఎన్నికల కోస ఆయా పార్టీలు పొత్తుకు ససేమిరా అనటం, ఎవరి వారే పోటీ చేస్తామని ప్రకటించడం దీనిని దృవీకరిస్తున్నాయి. గుంటూరు కార్పొరేషన్ కి జరిగే ఎన్నికల్లో బీజేపీ పోటీ చేసి తీరుతుందని మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ప్రకటించగా, వైజాగ్ లో కూడా కమలం బరిలో ఉంటుందని పలువురు నేతలు చెబుతున్నారు.

అదే సమయంలో కీలకమైన ఈ రెండు పట్టణాలను ఎట్టి పరిస్థితుల్లో చేజారనీయకూడదనే ఉద్దేశంతో ఉంది అధికార పక్షం. అక్కడి స్థానిక తమ్ముళ్లు రంగంలోకి దిగి కార్యాచరణ కూడా ప్రారంభించారంట. ఇక ఇప్పటికే విశాఖ స్థానిక ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసి ఉన్న బీజేపీ మరోసారి ఆ ఫీట్ ను రిపీట్ చేయాలని భావిస్తోంది. వెరసి మిత్రపక్షాలు ప్రత్యర్థులుగా మారి కత్తులు దూసుకోవటం ఖాయంగానే కనిపిస్తోంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Andhra Pradesh  civic polls  TDP  BJP  alliance  

Other Articles