jagga reddy appointed as telangana pcc spokesperson

Tpcc chief picks new team of party spokespersons

Telangana Pradesh Congress Committee, TPCC president N. Uttam Kumar Reddy, jagga reddy, gandra venkatrami reddy, TPCC official representative, jagga Reddy, appointment

Telangana Pradesh Congress Committee president N. Uttam Kumar Reddy issued orders appointing a team of 23 new Spokespersons.

జగ్గారెడ్డికి ఆ బాధ్యతలు అందుకేనా..?

Posted: 07/09/2016 12:21 PM IST
Tpcc chief picks new team of party spokespersons

దేశంలోని నూతనంగా అవిర్భవించిన రాష్ట్రం తెలంగాణ. ఈ నూతన రాష్ట్రం ప్రకటించేందుకు కాంగ్రెస్ ఎంతో కొల్పోవాల్సి వచ్చింది. ఈ నిర్ణయంతో తెలుగు రాష్ట్రాలలో తమ ఉనికినే ప్రశ్నించుకునే స్థాయికి దిగజారిన కాంగ్రెస్ మళ్లీ పూర్వవైభవం కోసం యత్నిస్తుంది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినా.. అక్కడా పార్టీకి ప్రతిపక్ష హోదాకే పరిమితం కావడంతో ఖంగుతిన్న పార్టీ అధిష్టానం.. రానున్న రోజుల్లో తాము ఎలాంటి తరుణంలో, ఎంత కష్టనష్టాలకు ఓర్చి తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించామో ప్రజలకు తెలియజేయాలనుకుంది.

తమ సొంత పార్టీ నేతలను కూడా వదులుకుని రాష్ట్రాన్ని ప్రకటించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలలో మళ్లీ ఒక వెలుగు వెలగాలని అశిస్తుంది. మరీ ముఖ్యంగా తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తుంది. ఇందుకోసం ఇప్పటివరకు భాగంగా అడపా దడపా జనంలోకి వెళ్లడం, లేదా ఎన్నికల సమయంలోనే ప్రజల్లోకి వెళ్తున్న తీరును మార్చుకోవాలని ఏకంగా రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర నేతలకు సూచించారు. గతంలో అధికారంలో వున్నప్పుడు తెలంగాణ వాదనను బలపరుస్తూనే.. టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసురుతూ తమతో పాటు పార్టీ ఉనికి కాపాడిన నేతలను అధికార ప్రతినిధులుగా నియమించారు. మొత్తంగా 23 మందిని అధికార ప్రతినిధులను నియమించినా.. వారిందరిలో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి నియామకాన్ని ప్రత్యేకంగా చెప్పకోక తప్పదు.

ఈయన రాజకీయ అరంగ్రేటం జరిగింది బీజేపి పార్టీతో. సంగారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా రాజకీయ అరంగ్రేటం చేసి అంచెలంచెలుగా ఎదిగారు. కాగా అప్పటి మెదక్ ఎంపీ అలె నరేంద్రకు మంచి శిష్యుడిగా వున్న ఈయన.. 2004లో ఆయన ప్రోద్భలంతో ఎమ్మెల్యే టిక్కెట్ లభించడంతో ఎన్నికల బరిలో నిలిచారు. అ ఎన్నికలలో టీఆర్ఎస్ తరపున సంగారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపోందిరు. ఆ తరువాత అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ అపరేషన్ అకర్ష్ కు ఆయనకు దగ్గరైన జగ్గారెడ్డి.. ఇక తాను గెలిచిన టీఆర్ఎస్ పార్టీ సహా ముఖ్యనేతలపై కూడా విమర్శలు గుప్పించారు. ఆ క్రమంలో రెండో పర్యాయం కూడా సంగారెడ్డి నుంచి గెలిచిన జగ్గారెడ్డి.. టీఆర్ఎస్ నేతలకు సవాల్ విసిరారు. ఇక ప్రభుత్వ విఫ్ గా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.

ఇటీవల జరిగిన మెదక్ పార్లమెంటు స్థానానికి మాతృత్వ పార్టీ బీజేపి నుంచి ఎన్నికల బరిలో నిలిచి.. తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేసినా.. ఒటమిని చవిచూశారు. ఆ తరువాత వెనువెంటనే తాను చేసిన తప్పును సరిదిద్దుకునే క్రమంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి చేరారు. ఇక అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూనే వున్నారు. అయితే ఇప్పుడు జగ్గారెడ్డికి ఎందుకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎందుకు అధికార ప్రతినిధి హోదాను కల్పించిందన్నదే అసలు ప్రశ్న.

ఇప్పటికే ఓ వైపు టీటీడీపీ నుంచి రేవంత్ రెడ్డి విసురుతున్న విమర్శల టీఆర్ఎస్ నేతల గుండెల్లో బెల్లాల్లా గుచ్చుకుంటున్న క్రమంలో ఇటు అధికార ప్రతినిధి హోదాతో జగ్గారెడ్డిని నియమించి. ఆయన వాగ్ధాటితో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం అపరేషన్ అకర్ష్ నుంచి అన్ని అంశాలపై తనదైన శైలిలో జగ్గారెడ్డి వాస్తవాలను వెలుగులోకి తీసుకువచ్చి.. ప్రభుత్వాన్ని ఇరుకున పెడతారని టీపీసీసీ భావిస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అందుకనే అయనకు అధికార ప్రతినిధి హోదాను కల్పించారని పేర్కోంటున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : TPCC official representative  jagga Reddy  appointment  

Other Articles