దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ను నెంబర్ వన్ స్థానంలో నిలబెడతానంటూ దానిని ప్రచారస్త్రంగా చేసుకుని ఎన్నికలలో విజయాన్ని సాధించిన తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలపే విషయం తెలియదు కానీ.. ఆయన మాత్రం నెంబర్ వన్ స్థానంలోనే నిలిచారు. అదేంటి అలా వ్యంగంగా అంటున్నారు అనుకునేరు..? నిజమే మరి. రాజధాని లేని రాష్ట్రాన్ని చేసి తమకు యూపీఏ ప్రభుత్వం, ముఖ్యంగా కాంగ్రెస్ అన్యాయం చేసిందని నిత్యం విరుచుకుపడే చంద్రబాబు.. అస్తులు విలువలు లెక్కిస్తే నెంబర్ వన్ అని స్పష్టమవుతుంది.
రాజధాని లేని రాష్ట్రానికి మీరే విరాళాలు ఇవ్వండీ అంటూ రాష్ట్ర ప్రజల వద్దకు వెళ్లి జోలే పట్టిన ప్రభుత్వానికి ప్రజలు ఇతోధికంగానే సాయం చేశారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన రాష్ట్ర ఉద్యోగుల సంఘం సమావేశంలోనూ.. పలువరు కార్మికులు నిలువుదోపిడి ఇచ్చారు. అయితే అందరి నుంచి విరాళాలు వసూలు చేశారు కానీ.. నిజంగా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు కానీ, ఆయన తనయుడు నారా లోకేష్ కానీ, లేదా నారా వారి సంస్థల నుంచి కానీ ఎంత మేరకు విరాళాలు వచ్చాయన్నది ఇప్పటికీ మిస్టరీనే.
తానే మొత్తం, తానే సర్వం, తనతోనే నిజాయితీ పుట్టింది.. తాను లేకుంటే నీతే లేదన్నట్లు.. తాను చెప్పేదే వేదం, తాను చేసేదే ధర్మం అన్నట్లుగా వ్యవహరించే బాబు.. అడపా దడపా తన అస్తుల వివరాలను ప్రకటించి.. తాను కేవలం ఒక సామాన్యుడినని.. అయితే అస్తులు కూడా అంతగా లేవని ప్రకటించే చంద్రబాబు అస్తుల చిట్టా మాత్రం పెద్దగానే వుంది. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్(ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు గత సాధారణ ఎన్నికలకు ముందు అభ్యర్థులు అందచేసిన అఫిడవిట్‌లను అధ్యయనం చేసి నివేదిక రూపొందించాయి.
చంచ్రబాబు ప్రకటించే అస్తుల వివరాలు అప్పడప్పుడు తగ్గుతుంటాయి కూడా. అయితే వాస్తవానికి మాత్రం ఆయన ఆస్తుల వివరాలు లెక్కకు మించి పెరుగుతాయన్నది జగమెరిగిన సత్యం. ఏడీఆర్ సంస్థ రూపోందించిన నివేదిక ప్రకారం చంద్రబాబు అస్తుల విలువలో ఏకంగా దేశంలోనే నెంబర్ వన్ సీఎంగా నిలిచారు. ఆయన అస్తుల విలువ 177 కోట్ల రూపాయలు. అత్యధిక ఆస్తులు కలిగిన సీఎంల జాబితాలో తొలి స్థానంలో, దేశంలోని అన్ని రాష్ట్రాల మంత్రులతో పోల్చితే.. నాలుగో స్థానంలో నిలిచారు. ఈ విషయంలో ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కూడా దాటేశారు. అమె మూడవ స్తానంలో నిలువగా, అరుణాచల్ ప్రదేశ్ ముక్యమంత్రి ఫెమా ఖండూ ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు నెంబర్ వన్ ముఖ్యమంత్రి అయ్యారు.. కానీ రాష్ట్రాన్ని ఎప్పుడు నెంబర్ వన్ చేస్తారన్న ప్రశ్నలు ప్రజల నుండి వ్యక్తం అవుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more