అసెంబ్లీ సమావేశాలు, పుష్కరాలు, అన్నింటికి మించి ప్రత్యేక హోదాపై రేగిన అలజడి ఈ వరుస హడావుడిల నేపథ్యంలో ఏపీలో ఫిరాయింపులు కాస్త తగ్గుముఖమే పట్టాయి. అంతకు ముందు మాత్రం ఇరు తెలుగు రాష్ట్రాల్లోనూ పెద్ద ఎత్తునే ఫిరాయింపులు జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి అధికార పక్షాల్లోకి చేరటం ద్వారా లబ్ధి పొందటంతోపాటు, రాజకీయ భవిష్యత్తును సేఫ్ జోన్ లో ఉంచుకోవాలన్నదే వారి ఉద్దేశం. విపక్షాల ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు సైకిల్ కోసం క్యూ కట్టగా, ఇప్పుడు మాత్రం పరిస్థితి కాస్త చల్లబడింది.
అయితే తాజాగా టీడీపీకి ఓ రివర్స్ పంచ్ పడే అవకాశం ఉన్నట్లు వార్తలు వినవస్తున్నాయి. టీడీపీకి కంచుకోటగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో అధికార పక్షం నుంచి ప్రతిపక్షానికి వలస కొనసాగేలా కనిపిస్తోంది. టీడీపీ సీనియర్ నేత, తాడేపల్లిగూడెం మాజీ ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పార్టీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ఆయన ఈ తరహా బాట పట్టడానికి బలమైన కారణం ఉందట.
2014లోనే టీడీపీలో చేరిన ఆయన గడచిన ఎన్నికల్లో తాడేపల్లిగూడెం టికెట్టు ఆశించారు. అయితే పొత్తులో భాగంగా ఆ స్థానం బీజేపీకి దక్కింది. దీంతో కొట్టుకి ఆశాభంగం అయ్యి బహిరంగంగానే పార్టీపై అసంతృప్తి వెల్లగక్కారు. ఆపై స్వయంగా చంద్రబాబు నాయుడు కల్పించుకోవటంతో సైలెంట్ అయిన ఆయన ఈ మధ్య పార్టీ కలాపాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో వచ్చే ఎన్నికల నాటికి కూడా పరిస్థితిలో మార్పేమీ కనిపించకపోతుందని భావిస్తున్న ఆయన తక్షణమే పార్టీ మారాలని యోచిస్తున్నట్లు సమాచారం.
అయితే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ తరపున ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని హామీ ఇస్తేనే ఆయన వైసీపీలో చేరతాననే కండిషన్ పెట్టారంట. దీంతో ఇప్పటి నుంచే టికెట్ ఆశిస్తున్న ఆశావహులను బుజ్జగించే పనిలో పడింది వైసీపీ. చర్చలు గనక సఫలీకృతమైతే ఇంకో వారంలో కొట్టు వైసీపీలో చేరటం తథ్యంగా కనిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more