పార్టీలో వలసలు ఆగాయని సంతృప్తి చెందుతున్న అధినేత జగన్ కి మళ్లీ గట్టి ఝలకే తగిలే సూచనలు కనిపిస్తున్నాయి. వైకాపా సీనియర్ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్ త్వరలో పార్టీని వీడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇందుకు జగన్ వైఖరేనని ఆయన సహచరుల దగ్గర ప్రస్తావించినట్లు సమాచారం.
నిజానికి 2014 ఎన్నికల సమయంలోనే ఆయన పార్టీ మారతారన్న వార్తలు వచ్చాయి. ఆ సమయంలో వాటిని స్వయంగా మేకపాటే స్వయంగా ఖండించాడు. కానీ, వైకాపాలో ఆయన అసంతృప్తి లెవల్ ఇప్పుడు తారాస్థాయికి చేరటంతో ఖచ్చితంగా ఈసారి మార్పు ఉంటుందనే చెప్పుకుంటున్నారు. ఈ దశలో బీజేపీ సీనియర్ నేత, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో మేకపాటి సంప్రదింపులు చేసినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.
70 పదుల వయసులో ఉన్న మేకపాటి రాజమోహన్ రెడ్డి లాంటి సీనియర్ నేతను నిర్లక్ష్యం చేయటమేకాదు, పార్టీ పనులను మరీ స్థానిక నేతలకు అందజేస్తున్నారన్న టాక్ ఒకటి ఉంది. అంతేకాదు జగన్ అండ్ కో నుంచి సరైన గౌరవం లభించడం లేదని ఆయన సన్నిహితుల దగ్గర ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. సుదీర్ఘరాజకీయ ప్రస్థానం ఉన్న మేకపాటి ఒకసారి ఎమ్మెల్యేగా, ఐదుసార్లు ఎంపీగా గెలిచాడు. రాజశేఖర్ రెడ్డితో మంచి సంబంధాలు ఉండటం మూలంగానే మరణానంతరం జగన్ కి మద్ధతు ఇస్తూ వైకాపాలో చేరిపోయాడు. అయితే మేకపాటి కాషాయం తీర్థం పుచ్చుకుంటారన్న వార్తలను వైకాపాకు చెందిన ఓ ముఖ్యనేత ఖండిస్తున్నాడు.
ఆయనకు వయసు పైబడింది. అందుకే స్థానిక పనులను చూసుకోవాల్సిందిగా యువనేతలకు సూచిస్తున్నాం. అంతేగానీ ఆయన్ని నిర్లక్ష్యం చేయటం లేదు. ఇక అధినేత జగన్ ఆయన్ని పట్టించుకోవటం లేదన్న దాంట్లో వాస్తవం అస్సలు లేదు అని సదరు నేత తెలిపాడు. ఇక పార్టీ మార్పుపై స్వయంగా మేకపాటి స్పందిస్తూ పార్టీలో కలకలం రేపేందుకే బీజేపీ నేతలు ఇలాంటి యత్నాలు చేస్తున్నారంటూ కొట్టిపడేశాడు. అయితే ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉన్నందునా ఈ అంశాన్ని అంత తేలిగ్గా కొట్టిపారేయలేమంటున్నారు విశ్లేషకులు. ఈ విషయంలో బీజేపీ కూడా వ్యూహాత్మక మౌనాన్ని ప్రదర్శించడమే దీనికి నిదర్శనమని వారంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more