యావత్ దేశం పాకిస్థాన్ అనుసరిస్తున్న విధానాలను, ప్రేరేపిస్తున్న ఉగ్రవాదాన్ని తీవ్ర స్వరంతో ఖండిస్తుండగా, మన దేశానికి చెందిన నటులు మాత్రం అదేశ నటీనటులను వెనకేసుకోస్తున్నారు. ఈ క్రమంలో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ పై దేశవ్యాప్తంగా పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్న తరుణంలో బీజేపి నేతలు కానీ, అర్ఎస్ఎస్ నేతలు కానీ ఆయన గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో ఇప్పడు చర్చనీయాంశంగా మారింది. ఆయనపై బీజేపి అభిమాన అడ్వకేట్లు పిల్ కిందనో లేక మరోలాగానో కేసులు ఎందుకు నమోదు చేయడం లేదు. ఆయనపై సోకాల్డ్ హిందూ వాద సంస్థలు నేతలు సభ్యులు పోలీసు స్టేషన్లలో పిర్యాదులు ఎందుకు చేయడం లేదు. కనీసం ప్రైవేటు పిర్యాుదులతో కోర్టును కూడా ఎవరూ ఎందుకు ఆశ్రయించడం లేదు. ఇప్పుడివే అనుమానాలు దేశ ప్రజల్లోనూ రేకెత్తుతున్నాయి.
తన అభిమాన లోకంతో పాటు సినీరంగానికి చెందిన కళాకారులు, దేశ ప్రజల నుంచి కూడా విమర్శలను ఎదుర్కోంటున్నా.. బీజేపి, ఆర్ఎస్ఎస్ నేతలు కానీ, ప్రభుత్వాలు కూడా ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. పాకిస్థాన్ కు అనుకూలంగా ఆయన బాహాటంగా చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం రేపుతుండగా, ప్రభుత్వాలు ఆయనపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి. ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి సంఘం నేత కన్హయ్య కుమార్, గుజరాత్ పటేల్ హక్కుల ఉద్యమకర్త హార్థిక్ పటేల్ లపై కేసులు నమోదు చేసిన కటకటాల వెనక్కి పంపిన ప్రభుత్వాలు.. సల్మాన్ విషయంలో ఎందుకు వెనక్కు తగ్గుతున్నాయి,
రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ రచింనిన రాజ్యాంగంలో చట్టం అందరికీ సమానమనే రాసి వుంది., కానీ చిన్నచితక నేతలపై ఒకలా, భాలీవుడ్ కండలవీరుడికి మరోలా ఎందుకు వర్తిస్తుందో కూడా అర్థంకాని ప్రశ్న, సల్మాన్ ఖాన్ ఒక హీరో కావడం మూలంగా ఆయనను అరెస్టు చేసిన పక్షంలో దేశంలో హింస, అశాంతితో పాటు శాంతిభద్రతల ప్రభావం పడుతుందని వాదిస్తున్నవాళ్లు కూడా లేకపోలేదు. ఇక ఈ వాదనపై కూడా పలు అనుమానాలు వస్తున్నాయి. మంచి ఫామ్ లో వుండగా బాలీవుడ్ హీరో సంజయ్ దత్ ను అరెస్టు చేయగా, దేశంలో ఏలాంటి నిరసనలు అందోళనలు తలెత్తలేదు, మరీ అలాంటప్పుడు సల్మాన్ ఖాన్ విషయంలో ఎందుకు తలెత్తుతున్నాయని అనుమానిస్తున్నారన్న ప్రశ్నలు కూడా వినబడుతున్నయి.
ఉరి ఘటనలో 19 మంది భారత్ జవాన్లు అమరులు కాగా, వారి గురించి ఏమాత్రం పట్టనట్లుగా వ్యవహరించే సల్మాన్ ఖాన్.. తన వ్యాపార ధోరణితో వ్యవహరించి పాక్ నటీనటులను వెనకేసుకురావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి, ఒక ఆర్మీ జవాను మృతి చెందడం అంటే భారత మాత ముద్దుబిడ్లల్లో ఒకరు అమరుడైనట్లే. తమ ప్రాణాలను పణ్ణంగా పెట్టి దేశ ప్రజలకు ఎలాంటి కష్టం, నష్టం తలెత్తకుండా శత్రుదేశాల నుంచి దేశాన్ని, దేశప్రజలను కాపాడుతుంటాడు. ఉరి ఘటపై స్పందించినా.. లేకపోయినా పర్వాలేదు కానీ జవాన్లను అవమానించే రీతిలో ఎలాంటి కామెంట్లు చేసినా అది సమంజసం కాదు.
పాకిస్తాన్ ప్రభుత్వం, ఆ దేశ ఆర్మీ సహకారంతో సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతూ.. కాల్పుల ఉల్లంఘనకు దిగిన ఏ సమయంలోనూ ఖండించని సోకాల్డ్ నటులు పాక్ నటులపై నిషేధం విధించగానే ఎందుకని రెచ్చిపోతున్నారో అర్థం కావడం లేదు. కేవలం వ్యాపార దృక్పథంతో పాక్ నటులను రమ్మని తమ చిత్రాలకు అక్కడ వ్యాపారం చేసుకునేందుకే అయితే.. అమ్మ రోమ్ములపైనే గుద్దే ఇలాంటి నటులు మన భారతావనిలో జన్మించినందుకు యావత్ భారతదేశం సిగ్గుపడుతుంది. హీరోలే కాదు నటులైనా వారిని దేశ ప్రజలు సహించరన్న విషయం తెలియాలి. అయినా ఇతరులపైనై వెంటనే విరుచుకుపడే బీజేపీ నేతలు సల్మాన్ ఖాన్ విషయంలో ఎందుకు నీళ్లు నములుతున్నారు.
పాకిస్తాన్ నటీనటులు ఉగ్రవాదులు కారని, వాళ్లు ఇక్కడ పనిచేసేందుకు వర్క్ పర్మిట్ వీసా తీసుకుని మరీ వచ్చారని, వాళ్లకు వీసాలు మంజూరు చేసింది కూడా ప్రభుత్వమేనని సల్మాన్ వ్యాఖ్యానించడం, ఇక ఆయన వ్యాఖ్యలు నేపథ్యంలో మరో నటుడు ఓం పూరి కూడా రెచ్చిపోయారు. పరిస్థితి ఇలానే వదిలేస్తే.. ఇక నటీనటులందరూ దాయాధి దేశానికి జై కోట్టినా కడుతారు. అయినా మన ప్రభుత్వాలు కానీ. బీజేపి, అర్ఎస్ఎస్ నేతలు కానీ చూస్తూ మిన్నకుండిపోతారు. దళితులపై దాడులు చేసి తమ హిందూ వాదాన్ని కాపాడుకుంటున్న వ్యక్తుుల, సంఘాలు వానపాములపై ప్రతాపం చూపకుండా.. ఇలాంటి వ్యక్తులపై చర్యలకు దిగితే అ సందేశానం అన్ని వర్గాలకు అత్యంత వేగంగా చేరుతుంది.
ఇక మరికొందరు సల్మాన్ ఖాన్ కు ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మధ్య మంచి స్నేహం వుందని, అందుచేతనే ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలు కూడా వినబడుతున్నాయి. సల్మాన్ ఖాన్ ఎలాంటి తప్పిదాలు చేసినా ప్రధాని వెనకేసుకోస్తున్నారని, ఒక వేళ అవి తీవ్ర దుమారాన్ని రేపితే.. ప్రధాని తన మరో మిత్రుడు సుబ్రహ్మణ్యస్వామితో ఒక స్టేట్ మెంట్ ఇప్పిస్తారని కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో సల్మాన్ ఖాన్పై వున్న పలు వివాదాలు కూడా ప్రధానితో వున్న సన్నిహిత్యం నేపథ్యంలోనే పెద్దవి కాకుండా చల్లార్చబడ్డాయని గుసగుసలు కూడా వినబడుతున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more