పెళ్లి కార్డుతోనే పెద్ద సంచనలం రేపి అందరి దృష్టిని ఆకర్షించాడు కర్ణాటక మాజీ మంత్రి, మైనింగ్ రారాజు గాలి జనార్దన్ రెడ్డి. ఇప్పుడు ఆ పెళ్లికి సెలబ్రిటీల కళతో సందడి చేసేందుకు సిద్ధమౌతున్నాడు. ఒక చిన్న ఎల్సీడీ స్క్రీన్ కార్డులో ఉంచి వీడియో మెసేజ్ ద్వారా పెళ్లికి రావాలంటూ అందరికీ ఆహ్వానం పంపాడు. ఇందుకోసం భారీగానే వెచ్చించినట్లు ఆ కార్డు చూస్తే అర్థమైపోతుంది. ఇంతకీ ఆ ఆలోచన ఉంది ఎవరనుకుంటున్నారు. మన డైలాగ్ కింగ్ సాయికుమార్. తెలుగుతోపాటు కన్నడలోనూ స్టార్ స్టేటస్ ఉన్న సాయికుమార్ కి, గాలి కుటుంబంతో ఎప్పటి నుంచో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ చొరవతోనే కార్డు బాధ్యతలను గాలి సాయికి అప్పగించాడంట.
ఐదు రోజులపాటు దగ్గరుండి మరీ సినిమా టెక్నీషియన్స్ తో సాయి కుమార్ ఆ కార్డు డిజైన్ చేయించినట్లు తెలుస్తోంది. ఇక గాలి వారింట జరిగే ఈ పెళ్లికి పెద్ద ఎత్తున్న ఏర్పాటు జరిగిపోతున్నాయి. ఇప్పటికే బాలీవుడ్, టాలీవుడ్ లతోసహా ఆల్ వుడ్లకు సంబంధించిన సెలబ్రిటీలకు కార్డుల పంపిణీ జరిగిపోవటం, వారు పెళ్లికి హాజరయ్యేందుకు సిద్ధం కూడా అయిపోతున్నారంట.
టాలీవుడ్ నుంచి మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, బాలీవుడ్ నుంచి షారూఖ్ ఖాన్ లతోపాటు పలువురు టాప్ డైరక్టర్లు, రాజకీయ ప్రముఖులకు కూడా ఆహ్వానం పంపిచేశాండట. అంతేకాదు వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రముఖుల కోసం ప్రత్యేక రైళ్లను కూడా బుక్ చేసినట్లు సమాచారం. కావేరి వివాదంతో కోలీవుడ్ నటులకు కార్డులు అందజేయటంపై కాస్త తటాపటాయిస్తున్నట్లు తెలుస్తోంది. చూస్తుంటే కోట్లు కుమ్మరించి గాలి వారి వివాహం ఘనంగా జరగబోతుందని అర్థమౌతోంది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more