అరుణక్క కారు షికారు వార్తలు నిజమేనట gadwal mla aruna to join TRS

Gadwal mla dk aruna to join trs

Congress Leader, DK Aruna, dk aruna trs, dk aruna gadwal, dk aruna shocks congress, dk aruna minister promise, dk aruna to join trs, dk aruna congress, New Distrcits, TRS, KCR, Telangana

It's conformed that Congress Fire Brand DK Aruna, yet to Join TRS after new districts formation, but delayed due to some reasons

అరుణక్క కారు షికారు వార్తలు నిజమేనట

Posted: 11/01/2016 03:17 PM IST
Gadwal mla dk aruna to join trs

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు టీఆర్ఎస్ నేతలపై పవర్ ఫుల్ పంచులు విసురుతూ.. సవాళ్లకు సైతం వెనకాడని ఫైర్ బ్రాండ్ ఎవరా..? అని అడిగితే వినిపించే పేరు ఒక్కటే. అమె డీకే అరుణ. అధికార పక్షంపై విమర్శలు చేసే వారిలో విపక్ష కాంగ్రెస్ కు చెందిన అనేక మంది సీనియర్ నేతలు వున్నా.. అరుణక్క స్థాయిలో మాత్రం ఎవరు ఫోకస్ కాలేకపోయారు. అందుకు అమె ముక్కుసూటి తనం కూడా ఒకింత కారణమేకావచ్చు. అయితే గద్వాల జిల్లా ఏర్పాటుతో అమె ముఖ్యమంత్రిపై కానీ, అధికారపక్షంపై కానీ ఎలాంటి విమర్శలు చేయకుండా మౌనదీక్షలో వున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.

జిల్లాల పునర్విభజన విషయంలో అధికార పార్టీతో అమీతూమి తేల్చుకునేందుకు కూడా వెనుకాడని అరుణ.. రాజీనామా అస్త్రంతో తన మాటను నెగ్గించుకున్నారు. ఈ క్రమంలో అమెలోని చిత్తశుద్దికి తలొగ్గిన కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక గద్వాల్ జిల్లాను కూడా ఏర్పాటు చేసింది. దీంతో అరుణ కారెక్కేస్తారని కూడా అప్పట్లో పుకార్లు షికారు చేశాయి. అయితే వాటిని అరుణ ధీటుగానే ఖండించారు. కానీ అది నిజమేనని, అమె త్వరలోనే కారులో షికారు చేయడానికి సిద్దమైయ్యారని క్లారిటీ వచ్చేసింది.

అది కూడా ఏకంగా సీఎం కేసీఆర్ కుమార్తె - నిజామాబాద్ ఎంపీ కవిత నోట జాలువారడంతో ఊహాగానాలు నిజమని తేలాయి. దీంతో తెలంగాణ కాంగ్రెస్ వర్గాల్లో ఒక్కసారిగా షాక్ కు గురయ్యాయి. కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ గా కోనసాగుతున్న డీకే అరుణ ఇక కన్ఫామ్ గా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనుందని తెలియడంతో పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తుంది. కాంగ్రెస్ వర్గాలు ఈ వార్తలతో కలవరానికి కూడా గురవుతున్నాయి.

గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ త్వరలోనే టీఆర్ ఎస్ లో చేరతాని.. అమె ఇప్పటికే పార్టీలో చేరాల్సి ఉన్నా..కొన్ని కారణాల వల్ల అది కుదర్లేదని..ఆమె త్వరలోనే పార్టీ మారనున్నారని కవిత మీడియాతో చెప్పడంతో పార్టీ శ్రేణులు కూడా సందిగ్ధంలో పడ్డారు. రెండున్నరేళ్ల తరువాత వచ్చే ఎన్నికల నాటికి నాయకులు లేని పార్టీగా కాంగ్రెస్ అవతరిస్తుందా..? అన్న డైలిమా కూడా కాంగ్రెస్ వర్గాల్లో నెలకోంది. ఇప్పటికే చాలామంది నేతల పార్టీ నుంచి మారుతున్నా కాంగ్రెస్ రాష్ట్ర కార్యవర్గం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించడమేంటన్న ప్రశ్నలు వినబడుతున్నాయి. ఇప్పటికైనా పార్టీ నాయకత్వం తగు చర్యలు తీసుకుంటే తప్ప.. కార్యకర్తల కలవరానికి బ్రేకులు పడవు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Congress Leader  DK Aruna  New Distrcits  TRS  KCR  Telangana  

Other Articles