కొత్త ఇల్లు అల్రెడీ కొనేశాడా? | pawan kalyan alredy buy new house in Eluru.

Pawan kalyan buys new home in eluru

Pawan Kalyan buys new home, Pawan Kalyan Eluru new home, Pawan new home in Eluru, Pawan home in Eluru, Pawan home, Pawan kalyan home, Pawan buys new home, Janasena office in Eluru, Pawan home pic fake, pawan kalyan new house in Eluru

Janasena chief Pawan Kalyan buys new house in Eluru, pic goes viral.

పవన్ కొత్త ఇల్లు కొనేశాడా?

Posted: 11/03/2016 10:04 AM IST
Pawan kalyan buys new home in eluru

ఇలా అనుకున్నాడో.. లేదో... జనసేన అధినేత అడ్రస్ చేంజ్ పనులు జెట్ స్పీడ్ తో చకచకా జరిగిపోతున్నాయంట. అంతేకాదు ఏకంగా ఇల్లు కూడా కొనేశాడన్న వార్తలు గుప్పుమంటున్నాయి. నిన్నటి వరకూ హైదరాబాద్‌లో నివాసం ఉన్న పవన్ కళ్యాణ్ తన మకాంని ఏపీలోని ఏలూరుకి మార్చే పనిని ముమ్మరం చేశాడు.

గ‌త ఎన్నిక‌ల్లో కేంద్రంలో మోదీకి, రాష్ట్రంలో చంద్ర‌బాబుకు స‌పోర్ట్ చేసిన ప‌వ‌న్, వచ్చే ఎన్నికలనాటికి పూర్తి రాజకీయ శక్తిగా ఎదగడానికి ఇప్పటినుంచే ప్రయత్నాలను మొదలుపెట్టాడు. అల్రెడీ అధికార పక్షం టీడీపీ కంచుకోట అయిన పశ్చిమ గోదావరి జిల్లాలో పాగా వేయాలని పెద్ద ఫ్లానే వేసిన పవన్ తన కేరాఫ్ మార్చటం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. దానిలో భాగంగా త‌న ఓట‌ర్ ఐడి కార్డును జూబ్లిహిల్స్ నుంచి ఏలూరుకు మార్చేస్తున్నారు.

అంతేకాదు ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ఒక ఇంటిని సెలక్ట్ చేసి ఆఘమేఘాలమీద రిజిష్టర్ చేయించారని తెలుస్తుంది. అయితే ఈ ఇంటిలో పవన్ కళ్యాణ్ ఉంటారా లేక పార్టీ కార్యకలాపాలను నిర్వహిస్తారా అన్నది క్లారిటీ రావాల్సి‌ఉంది. ఏపీలో ఓటర్ ఐడీ ఫ్రూఫ్ కోసం ఈ ఇంటి అడ్రస్‌నే నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఇందులో వాస్తవం ఎంత అనేది జనసేన చేసే ప్రకటనపై ఆధారపడి ఉంది. ప్రస్తుతానికైతే పవన్ కొత్త ఇల్లు అంటూ ఓ ఫోటో నెట్ లో వైరల్ అవుతోంది.

pawan new home in Eluru

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Janasena Pawan kalyan  new home  Eluru  

Other Articles