డీకే అరుణకు హోంశాఖ పగ్గాలు..? DK Aruna to replace nayini narasimha reddy as home ministry?

Dk aruna to replace nayini narasimha reddy as home ministry

dk aruna, home ministry, Telangana Home Minister, Ruling party, Defections, Srinivas Yadav, kadiyam sri hari, chandu lal, nayini narasimha reddy, CM KCR, gadwal, Telangana

If sources are to be belived, congress fire brand DK Aruna to replace Nayini Narasimha reddy as Telangana Home Minister after joining the Ruiling party.

హోంశాఖ ఇస్తామని డీకే అరుణకు టీఆర్ఎస్ గాలం..?

Posted: 11/06/2016 06:24 PM IST
Dk aruna to replace nayini narasimha reddy as home ministry

తెలంగాణ రాజ‌కీయాల్లో స‌రికొత్త సమీకరణలు సంతరించుకోనున్నాయా.? అంటే అవుననే సమాధానాలే వస్తున్నాయి. తమ పార్టీ టికెట్ పై గెలుపంది.. అధికార పార్టీలోకి వలసవెళ్లిన ప్రజాప్రతినిధులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు శాసనసభ స్పీకర్ కు అదేశించినా.. దానిని పెడచెవిన పెట్టి మరీ.. మరోమారు పార్టీ ఫిరాయింపులకు తెరలేవనుందా..? అంటే అవుననే వాతావరణమే అలుముకుంది. ప్ర‌స్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డీకే అరుణ టీఆర్ఎస్‌ తీర్థం తీసుకోనున్నారన్న వార్తలను అధికారకంగా ముద్రపడినట్లే. స్వయంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ, నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఈ విషయంలో కుండబద్దలు కోట్టారు. అమ త్వరలోనే పార్టీలోకి చేరుతారని కూడా స్పష్టం చేశారు.

నిత్యం ముఖ్యమంత్రి సహా టీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలకు పాల్పడే అరుణకు టీఆరఎస్ ఎలా గాలం వేసిందబ్బా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. అధికార పార్టీతో నిప్పు-ఉప్పులా వుండే అరుణ.. అంత హఠాత్తుగా కారు ప్రభావానికి ఎలా లోనయ్యారా..? అన్న సందేహాలు పార్టీ నేతల్లో రేకెత్తుతున్నాయి, 2004లో వైఎస్ హయాం నుంచి మంత్రిగా కోనసాగుతూ వచ్చిన అరుణ.. అధికారం పోగానే అధికారపక్షంపై తీవ్రంగా విరుచుకుపడుతుందని, అందుచేత అమెకు మళ్లీ మంత్రి దర్పం కల్పిస్తే.. ఇక విమర్శలకు తావు లేకుండా వుంటుందని టీఆర్ఎస్ అలా తన పాచికను వేసిందని తెలుస్తుంది.

అయితే ఇప్పటికే మంత్రి పదవులను చేపట్టిన అమె అధికార టీఆర్ఎస్ అఫర్ కు కూడా తలవొంచకపోవడంతో ఏకంగా వైఎస్ హయాంలో సబితక్కను గుర్తుచేసుకున్న టీఆర్ఎస్.. అదే తరహాలో అరుణక్కకు కూడా హోంశాఖ పదవీ బాధ్యతలను ఇస్తామన్న ప్రతిపాదన ముందుకు తీసుకువచ్చిందని, దీనికి అమె అంగీకారం కూడా చెప్పారని సమాచారం. కాగా, ఇదే సమయంలో దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు.. తెలంగాణ శాసనస స్పీకర్ వేణుగోపాల చారీకి.. పార్టీ ఫిరాయించిన వారి విషయంలో ఏం చర్యలు తీసుకున్నారో నాలుగు వారాల్లోపు చెప్పాలని అదేశించడంతో చేరికలో జాప్యం జరుగుతున్నట్లు తెలుస్తుంది.

రాష్ట్ర కాంగ్రెస్ నేతలు దాఖలు చేసిన పిటీషన్ ను విచారిస్తూ అదేశించిన నేపథ్యంలో అరుణక్క టీఆర్ఎస్ ఎంట్రీకి బ్రుకులు పడ్డాయి. అరుణ కోస‌మే ప్ర‌త్యేక గ‌ద్వాల్ జిల్లా ఇచ్చార‌ని ప్ర‌చారం జ‌రుగుతుండ‌గా ఆమెను పార్టీలో తీసుకుంటే బ‌ల‌మైన మ‌హిళా నాయ‌కురాలి అండ టీఆర్ఎస్‌కు ఉంటుంది. ఇక మ‌హిళా మంత్రి లేద‌న్న వ‌స్తోన్న విమ‌ర్శ‌ల‌తో పాటు కీల‌క‌మైన హోం శాఖ‌ను మహిళ‌కు కేసీఆర్ ఇచ్చార‌ని కూడా విమ‌ర్శ‌ల‌కు చెక్ పెట్టిన‌ట్లు ఉంటుంద‌ని కేసీఆర్ ఆలోచ‌న‌గా తెలుస్తోంది.

అయితే ఇప్పుడు మీకు మరో సందేహం కూడా కలగాలి. మరి ప్ర‌స్తుతం హోం మంత్రిగా ఉన్న నాయిని నర్సింహారెడ్డిని త్వ‌ర‌లో జ‌రిగే కేబినెట్ ప్ర‌క్షాళ‌న‌లో కేసీఆర్ త‌ప్పించి.. ఆయ‌న‌కు పార్టీ ప‌రంగా కీల‌క ప‌ద‌వి క‌ట్ట‌బెడ‌తార‌ని స‌మాచారం. నాయిని ఫ్యామిలీకి వ‌చ్చే ఎన్నిక‌ల్లో ముషీరాబాద్ అసెంబ్లీ టిక్కెట్టు కూడా ఇచ్చేలా ఆయ‌న్ను కేసీఆర్ ఒప్పించిన‌ట్టు తెలుస్తోంది. ఇక నాయిని హోం శాఖ‌ను టీ కాంగ్రెస్ ఫైర్‌బ్రాండ్ డీకే అరుణ‌కు ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dk aruna  home ministry  nayini narasimha reddy  KCR  gadwal  Telangana  

Other Articles