సింగరేణి సంస్థ ఎన్నికలు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు తలనొప్పిగా మారాయి. టీబిజీకేఎస్ గెలుపుకోసం అధికార పార్టీ నేతలు నానా తంటాలు పడుతున్నారు. సింగరేణి యాజమాన్యం గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ అనుబంధ తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం గెలుపు కోసం పార్టీ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. గేటు మీటింగులతో ప్రచారాన్ని హోరెత్తించి సింగరేణి కార్మికులను ప్రసన్నం చేసుకున్నారు. హోరాహోరీ జరిగిన ప్రచారంలో టీఆర్ఎస్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీల నేతలు పాల్గొన్నారు.
ఇదిలావుడగా, సింగరేణి ఎన్నికలను అధికార పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా ఈ ఎన్నికలలో విజయబావుటాను ఎగురువేయాలని కృతనిశ్చయంతో ముందుకు సాగుతుంది. ఇప్పటికే డివిజన్ల వారీగా ఎమ్మెల్యేలకు, ఎంపిలకు సీఎం కేసీఆర్ ప్రచార బాధ్యతలు అప్పగించారు. దీంతో అధికార పార్టీ నేతలంతా కార్మికులను ప్రసన్నం చేసుకునే పనిలో శక్తియుక్తులు ధారపోస్తున్నారు. అయితే టీబిజీకేఎస్పై కార్మికుల నుంచి పలు చోట్ల వ్యతిరేకత ఎదురవుతుండటంతో నేతలకు దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది.
అధికార పార్టీని గెలిపించే పనిని టీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరువాత ఇటు యాజమాన్యం కూడా భుజానికి ఎత్తుకుందన్న వార్తలు వినబడుతున్నాయి. ఏకంగా సింగరేణి సీఎండి శ్రీధర్ తో కార్మికులంతా టిబిజికేఎస్కే ఓటు వేయాలని మౌఖిక ఆదేశాలు జారీ చేయించినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కార్మికులకు అధికారులంటే భయం ఉండటంతో వారితో ఒత్తిడి చేయించడం ద్వారా తాము ఓటమి నుంచి బయటపడాలని అధికారపార్టీ భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ మేరకు కార్మిక సంఘాల దిగువశ్రేణి నేతలను కూడా యాజమాన్యం ఒత్తిడి తీసుకువస్తుందని తెలుస్తోంది.
సింగరేణి కార్మికులు ఎన్నికలు జరిగిన ప్రతిసారి విలక్షణమైన తీర్పును ఇస్తూనే ఉన్నారు. దీంతో ఈధఫా టిబిజికేఎస్ మైండ్ బ్లాంక్ అయ్యే తీర్పు వెల్లడవుతుందని అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇక్కడ మరింతగా గమనించాల్సిన విషయం ఏమిటంటే.. యూనియన్ కోసం కాకపోయినా కనీసం కేసీఆర్ తనయ కవిత కోసమైనా ఈ ఎన్నికలలో గెలుపోందాలని ఎమ్మెల్యే ప్రయత్నాలు చేస్తున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో విజయంతో కేసీఆర్ తన మార్కు విజయాన్ని అందించగా, సింగరేణి యూనియన్ ఎన్నికల విజయంతో తనయ కవిత కూడా విజయాన్ని తండ్రికి అందించాలన్న దీంతో ముఖ్యమంత్రి వారసులు, రాజకీయాంగా కూడా నిజమైన వారసులయ్యారన్న సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రణాళిక రచన జరుగుతుందని ఊహాగానాలు కూడా తెరపైకి వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more