గుజరాత్ శాసనసభ తొలి దశ ఎన్నికల పోలింగ్ కు ముందు ప్రధాని నరేంద్రమోడీ తన చేతిలో వున్న బ్రహ్మాస్త్రాన్ని కూడా వాడేశారా..? గత మూడేళ్ల క్రితం జరిగిన దేశ సార్వత్రిక ఎన్నికలలో గుజరాత్ అభివృద్దిని చూసి ఓట్ల వేయండంటూ యావత్ దేశ ప్రజలకు చెప్పిన నరేంద్రమోడీ.. గుజరాత్ అసెంబ్లీలో మాత్రం అందుకు భిన్నంగా కేంద్రంలో తాము చేస్తున్న అభివృద్దినో.. లేక రాష్ట్రంలో చేసిన అభివృద్దినో ప్రచారాస్త్రాలుగా మార్చుకోవాల్సింది పోయి.. తన చేతిలో వున్న ట్రంప్ కార్డును కూడా వాడేసి గెలుపుబాట పట్టించేందుకు యత్నాలు చేస్తున్నారా..? అన్న అనుమానాలు రేకెత్తతున్నాయి.
ఈ క్రమంలో ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సినీయర్ నేత, కేంద్ర మాజీ మంత్రి మణిశంకర్ అయ్యార్ లాంటి నేతను కూడా వెనువెంటనే సస్పెండ్ చేసిన కాంగ్రెస్ పార్టీ ఇటువంటి వ్యాఖ్యలు చేసే సంస్కృతి తమకు లేదని కూడా ఈ సందర్భంగా చెప్పుకుంది. ఈ విషయంపై రాహుల్ గాంధీ మరోసారి స్పందించారు. ప్రధానమంత్రి పదవిని అలంకరించిన వ్యక్తిని తమపార్టీ గౌరవిస్తుందని అన్నారు. ఆ పదవిలో ఉన్న వ్యక్తి గురించి తమ పార్టీ తప్పుగా మాట్లాడదని చెప్పారు. అందుకే తాము మణిశంకర్ అయ్యర్‌పై కఠిన చర్యలు తీసుకున్నామని తెలిపారు.
అయితే ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయాలని భావించిన ప్రధాని రామజన్మ భూమిలో రామమందిర నిర్మాణం కోసం యావత్ దేశ ప్రజానికం ఎదురుచూస్తున్న సమయంలో సార్వత్రిక ఎన్నికలు అయ్యేంత వరకు ఈ విషయమై తీర్పును నిలిపివేయాలని కపిల్ సిబాల్ వాదించడాన్ని అయన ప్రస్తావించారు. ఈ తీర్పు ఫలితం రానున్న సార్వత్రిక ఎన్నికలపై ప్రభావం చూపుతుందని పిటీషన్ దాఖలు చేసిన కేంద్ర మాజీ మంత్రి సిబాల్ ను కూడా తక్షణం కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడమే గుజరాత్ తో బీజేపి పరిస్థితి దిగజారిందని స్పష్టమవుతుంది.
అయితే రాణకీయ కోణంలో అలోచించే నేతలు గుజరాత్ ఎన్నికల నేపథ్యంలో తమ రాజకీయ లబ్దికోసం కుల, మతాలకు చెందిన అంశాలను తెరపైకి తీసుకురావడం సర్వసాధారణమే అయినా.. స్వయంగా ప్రధాని.. కపిల్ సిబాల్ ను సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేయడమేంటన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఈ అంశాన్ని ప్రస్తావించి ప్రధాని గుజరాత్ రాష్ట్రంలోని హిందువుల ఓట్లను తమ వైపు తిప్పుకోవాలని పరోక్షంగా మతతత్వాన్ని తెరపైకి తీసుకువస్తున్నారా... అన్న అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. నిత్యం అవినీతి రహిత సమాజం, స్వచ్ఛా భారత్, అభివృద్ది అంశాలపై ప్రసంగాలు చేసే ప్రధాని వాణిలో బాణి ఎలా మారిందని ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
ఇక కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ పై ఈ ఎన్నికల సందర్భంగా ప్రధాని మరో అభాండాన్ని కూడా వేశారు. మణిశంకర్ తన హత్యకు కూడా కుట్రపన్నారని అరోపించారు. పాకిస్థాన్ లోని వ్యక్తుల చేత తనను అంతమొందించడానికి మణిశంకర్ అయ్యార్ పథక రచణ చేశారని కూడా అరోపించారు. ప్రధానిగా కొనసాగుతున్న వ్యక్తి ప్రాణానికి హానీ చేకూర్చాలని కుట్ర చేసిన పక్షంలో అది రాజద్రోహమే అవుతుంది. ఇలాంటి కుతంత్రాలు చేయడమన్నది వ్యక్తిగానే జీర్ణించుకోలేని విషయం. కానీ ప్రధాని హోదాలో వున్న వ్యక్తి పట్ల ఇలాంటి వాటికి పాల్పడటం అక్షేపనీయమే.
అయితే కేంద్ర ప్రభుత్వాధినేతగా కొనసాగుతున్న ప్రధాని మోడీ.. ఇలాంటి వ్యాఖ్యలు కేవలం గుజరాత్ ఎన్నికలకు ముందు ప్రచారాస్త్రాలుగా సంధించడం పట్ల పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రధాని స్వయంగా ఇలాంటి వ్యాఖ్యలు చేశారంటే వాటికి తగిన స్థాయిలో అధారాలు కూడా వుండివుంటాయి. అవే వున్న పక్షంలో అవతలి వారు ఎంతటి వారైనా కటకటాల వెనక్కి నెట్టడం ఎంతో సేపు కాదు.. కానీ ప్రధాని అలాంటి చర్యలు ఉపక్రమించకుండా కేవలం ఎన్నికల నేపథ్యంలో ప్రచారంలో మాత్రమే ఈ వ్యాఖ్యలు చేయడం ప్రశ్నార్థకంగా మారుతుంది.
ఈ ఎన్నికలలో ప్రధాని మోడీ తనపై వ్యక్తిగతంగా వున్న సానుబూతిని కూడా వినియోగించుకోవాలని భావిస్తున్నారా..? తన చేతిలో వున్న చివరి ట్రంప్ కార్డును కూడా ఇలా వినియోగిస్తున్నారా..? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి అయితే ప్రధాని నరేంద్రమోడీ చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు, సానుభూతి, బీజేపి పార్టీని విజయతీరాల వైపు నడిపిస్తాయా..? లేదా అన్నది మాత్రం వేచి చూడాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more