పెద్దవాళ్లు చెప్పే సామెతల్లో నిజాలు దాగివుంటాయన్నది వాస్తవం. కాకుల్ని కొట్టి గద్దలకు పెడతున్నారు.. అన్న సామెత వారికి అప్పట్లో ఎలాంటి సందర్భాల్లో చెప్పారో కాని.. ప్రస్తుతం దేశంలోని బ్యాంకులకు మాత్రం ఈ సామెత సరిగ్గా సరిపోలుతుంది. దేశంలోని అర్థిక నేరగాళ్లుకు అప్పులమీద అప్పులు ఇచ్చి.. వాటిని వసూలు చేయడం చేతకాక.. వాటంన్నింటినీ ఒక్క కలం పోటుతో స్ట్రైక్ అఫ్ చేస్తున్న బ్యాంకులు.. సామాన్య ఖాతాదారుల నుంచి మాత్రం రక్తాన్ని పిండుతున్నాయి. సామాన్య ఖాతాదారులు కాయకష్టం చేసి.. తమ రక్తాన్ని చెమటగా మార్చి వచ్చిన డబ్బులోంచి నెలకు కొంత డబ్బును దాచిపెడితే.. అవసరాల నిమిత్తం ఆ తరువాత వాటిని తీసుకుంటే కూడా ఈ బ్యాంకులకు అది నేరంగా భావించి.. పెనాల్టీలు వసూలు చేస్తున్నాయి.
ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు తెరవాలంటూ పిలుపునిచ్చిన క్రమంలో అందుకు సంబంధించిన అప్లికేషన్లు లేవని, రూ. 500. రూ.1000లతో ఖాతాలు తెరవాలంటే మాత్రమే.. వాటికి సంబంధించిన ధరఖాస్తులు మాత్రమే వున్నాయిన చెప్పిన బ్యాంకుల అధికారులు.. జన ధన్ యోజనా ఖాతల పేరుతో సామాన్యులు, పేదల నుంచి సేవింగ్స్ అకౌంట్లు తెరిపించాయి. ఇక సేవింగ్స్ అకౌంట్లలో కనీస నగదు నిల్వలు లేని పక్షంలో వాటిని నిర్వహించడం చాలా కష్టంగా మారుతుందని చెప్పిన బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ విధానాన్ని తీసుకువచ్చి.. సామన్యా ఖాతాదారులను పెనాల్టీల పేరుతో తెగ బాదేస్తూ.. జలగల మాదిరిగా సంతోషాన్ని పొందుతున్నాయి.
అలా మినిమమ్ బ్యాలెన్స్ లేని సేవింగ్ అకౌంట్ బ్యాంకు ఖాతాల్లో పేదల వేసిన డబ్బు మినిమమ్ బ్యాలెన్స్ లేదన్న కారణంగా ప్రతీ నెల ఒక్కో బ్యాంకు ఒక్కో విధంగా సామాన్య ఖాతాదారులపై పెనాల్టీ వేస్తుంది. ఇలా కనీస నగదు నిల్వలులేని వినియోగదారుల నుంచి గత ఆర్థిక సంవత్సరం (2017-18) రూ.5వేల కోట్ల జరిమానాలు వేశాయి. అసలు బ్యాంకులను ప్రారంభించిన ఉద్దేశ్యం ప్రస్తుతం అలాగే కొనసాగుతుందా..? అసలు బ్యాంకులు ఏర్పడటానికి ముఖ్య ఉద్దేశ్యం ఏమిటీ.. ఖాతాదారుల కోసం ఏర్పాటైన బ్యాంకులు, వారి డబ్బుతోనే వ్యాపారాలు చేస్తూ లాభాలను గడిస్తూ.. తిరిగి వారికే కనీస నిల్వల పేరుతో పెనాల్టీలు విధించడం ఎంతవరకు సమంజసం. ఏర్పాటుకు ముఖ్యఉద్దేశాని గాలికి వదిలేసిన బ్యాంకులు ప్రస్తుతం బాదుడుకు కేరాఫ్ అడ్రస్ గా మారుతున్నాయి.
పేదలు తమ అవసరాలను తీర్చుకున్న తరువాత కొద్దిగా పొదుపు చేస్తే అది వారి భవిష్యత్తును అదుకునేలా వుంటుందని బ్యాంకులు వెళ్తుంటారు. కానీ బ్యాంకుల బాదుడుకు ఇప్పుడు పేదలే నలుగుతున్నారు తప్ప.. పెద్దలకు మాత్రం నష్టం లేదు. ప్రతీ సామాన్యుడు బ్యాంకుల్లో నిల్వ చేసే డబ్బును దేశ ప్రగతికి వినియోగించాల్సిన బ్యాంకులు.. అందులో బాగంగా పారిశ్రామిక వేత్తలకు ఇస్తున్నాయి. వారు ఎగ్గోట్టిన డబ్బులను ఏదో ఒక రూపంలో ఇలా ప్రజల వద్ద నుంచే రాబడుతున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే.. ఎన్నో వేల కోట్ల రూపాలయను అప్పులుగా ఇచ్చిన బ్యాంకులు.. మరీ ముఖ్యంగా ఎస్బీఐ దాదాపుగా ఆరువేల కోట్ల రూపాయలను విజయ్ మాల్యాకు ఇచ్చి.. నష్టపోయినా.. గత ఏఢాది ఆరు వేల కోట్ల నికర నష్టాన్ని చవిచూసినా.. అందులో దాదాపుగా పావుశాతం భర్తీ చేసుకోగలిగింది.
అదేంటి అప్పుడే ఎలా నష్టాలను అంతమేర పూడ్చుకుందీ అంటే.. నికర నష్టాన్ని.. సామాన్య ఖాతాదారుల నుంచి కనీస నిల్వలు లేని పెనాల్టీ వసూలు చేసి.. నష్టాన్ని పూడ్చుకుంది. ఒక్క అర్థిక సంవత్సరంలోనే దాదాపుగా 2 వేల 400 కోట్ల రూపాయల మేర పూడ్చుకున్న బ్యాంకు దిగ్గజం.. మరో రెండేళ్లలో వీటిని పూర్తిగా భర్తీ చేసుకున్నాక కానీ.. పేదలపై భారం మోపడం అపదేమో. ఇప్పటికే కనిష్ట నిల్వల పెనాల్టీ వసూళ్లపై ఎస్బీఐపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నా.. వాటన్నింటినీ ఈ బ్యాంకింగ్ దిగ్గజం దున్నపోతు మీద వానపడిన చందంగా తీసుకుంటుందే తప్ప.. తమ గోడు పట్టడం లేదని సామాన్య ఖాతాదారులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగా మరి సామాన్య ఖాతాదారులను కొట్టి బడా అర్థిక నేరగాళ్లకు పెడుతున్న బ్యాంకులు.. సామాన్యులలో లేని ఐక్యాతా లేమిని తమ బలంగా చేసుకుని నిబంధలను రుద్దుతున్నాయన్న విమర్శలు కూడా తెరపైకి వస్తున్నాయి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more