దేవుడి సొంతరాష్ట్రంగా ప్రకృతి రమణీయతతో బాసిల్లుతున్న కేరళా రాష్ట్రంపై వరుణుడు ప్రకోపాన్ని చాటాడా.? లేక శబరిమలేశ్వరుడైన హరిహరపుత్రుడు అయ్యప్ప స్వామి శాపాన్ని పెట్టడా.? ఇప్పుడిదే ప్రశ్న యావత్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయ్యప్ప స్వామికి అగ్రహాం వచ్చిందని.. అందుకే కేరళను జలప్రళయం ముంచెత్తిందన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. వందేళ్లలో కనీవినీ ఎరుగని విధంగా మలయాళ సీమను కకావికలం చేసిన వరదలకు కారణం మణికంఠుడి శాపమా..? అన్నదే ఇప్పుటు నెట్టింట్లో హాట్ టాపిక్.
తాము చేసే పనులలో దైవాన్ని వెతుక్కునే నాస్తికులను కూడా కరుణించే దేవుడు.. మనుషులపై పగబడతాడా.? తన ప్రకోపానికి వందల సంఖ్యలో జనులను హతమార్చి.. లక్షల సంఖ్యలో జనులను ఇబ్బందుల పాలుచేస్తాడా.? వరదల వెనుక మానవ తప్పిందం గురించి అసలు మాట్లాడరేంటి.? అసలు మూలాలను అన్వేషించడం మానేసి.. అన్నింటికీ దేవుడితో లింక్ చేసి.. అందుకనే దేవుడు పగబట్టాడు.. శపించాడు.. అగ్రహించాడని.. దేవుడికే అపఖ్యాతి తీసుకువస్తున్న తీరుపై పలువురు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
శబరిగిరీశుడు అయ్యప్పస్వామి తన భక్తుల పాలిట కొంగుబంగారం. ఆయన మహిమలను హిందూ భక్తులు ఎంతగానో వివరిస్తారు. హిందువైన ప్రతీఒక్కరు జీవితంలో ఒక్కసారైనా మాలాకృతులై.. 41 రోజుల కఠోరదీక్షతో అయ్యప్పస్వామి మండల దీక్షను పూర్తి చేసి.. శబరి కొండకు ఇరుముడితో వెళ్లి.. అక్కడి పద్దెనిమిది బంగారు మెట్లను ఎక్కి.. స్వామివారి దర్శనం చేసుకోవాలని అంటారు గురుస్వాములు. దేవుళ్లందరూ కారణజన్ములని.. మహాశివుడి వరం పొంది ముల్లోకాలను తన గుప్పిట పెట్టుకోవాలని భ్రమించే మహిషాసురుడనే రాక్షసుడిని అంతం చేసేందుకు అయ్యప్పస్వామి అవతరించిన విషయం తెలిసిందే. మహిషాసురుడ్ని అంతమొందించిన తరువాత శబరిగిరీషుడిగా వెలసిన అయ్యప్ప జ్యోతిస్వరూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నాడు.
అయితే అయ్యప్ప స్వామి వారి దర్శనానికి వెళ్లేందుకు ఆడవారికి ఆంక్షలున్నాయి. పదేళ్ల నుంచి 50 యేళ్ల మహిళలకు ఆలయ ప్రవేశం నిషేదం. స్వతహాగా మణికంఠుడు కారడవిలో వుండటం చేతనో లేక ఆడవారితో కలసి 41 రోజుల పాటు దీక్ష చేసిన నేపథ్యంలో ఆయన ధీక్షబూనిన భక్తులు నిగ్రహంగా వుండలేరనో వారిని అంక్షల నేపథ్యంలో నిలువరించారు. అయితే దీనిపై గత కొంతకాలంగా తీవ్ర విమర్శలు రావడం ఇదే అంశంపై సుప్రీంకోర్టులో పిటీషన్ వేయడం మహిళలకు కూడా ప్రవేశం కల్పించాలని సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇవ్వడం జరిగిపోయాయి. దీంతో సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో కన్నెర్ర చేసిన అయ్యప్ప స్వామి కేరళపై వరద ప్రళయాన్ని కారణమయ్యాడన్న కథనాలు సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతున్నాయి.
మహిళల ఆలయ ప్రవేశం విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై అయ్యప్పస్వామి ఆగ్రహించాడన్న వాదనల్లో ఎలాంటి నిజం లేదని మరికోందరు పేర్కోంటున్నారు. ఒకవేళ అదే నిజమైతే.. న్యాయస్థానాలకు అంశాన్ని తీసుకెళ్లిన వాళ్లను ఏం చేయకుండా..? వారి తరపున వాదించిన న్యాయవాదులను ఏం చేయకుండా.. అభం శుభం తెలియని కేరళవాసులను ఎందుకు బాద్యుల్ని చేసి బాధిస్తాడని వారు ప్రశ్నిస్తున్నారు. తమిళనాడులో గత ఏడాది ఇలాంటి పెను ఉత్పాతమే సంభవించిందిని, అస్పోంలోనూ ఇలాంటివే జరిగాయని, ఇవి పూర్తిగా ప్రకృతి ప్రకోపమేనని అంటున్నారు.
వరుసగా పది నుంచి పన్నెండు రోజుల పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో ఏక్కడైనా లొతట్టు ప్రాంతాలు జలమయం అవుతాయన్నది నగ్న సత్యం. అయితే కేరళ పూర్తిగా పర్వత ప్రాంతం. ఇక రెండు కొండల మద్య సమానంగా వున్న ప్రాంతాల్లోనే ఇల్లు కట్టుకునేందుకు అక్కడి వారు ప్రాధాన్యతనిస్తారు. ఇక వందేళ్లుగా ఇలాంటి వర్షం రాకపోవడంతో.. వాగులు, వంకలు, కాలువల ప్రాంతాలు కూడా అన్యక్రాంతమై.. జలప్రళయానికి కూడా కారణమైందన్న కూడా సత్యమే. అయితే మానవ తప్పిందాలను వదిలేసి.. జలవిలయానికి దేవుడ్ని కారణభూతుడ్ని చేసి.. దైవత్వానికే అపఖ్యాతి అపాదించేలా నెట్టింట చర్చ జరగడం గర్హనీయమేనని పలువురి వాదన.
తప్పులు చేసే మానవులు.. తమ తప్పులకు దేవుడిపై అభండాలు వేసి.. వాట్సాప్, ఫేస్ బుక్కుల్లో దీనిపై చర్చోపచర్చలు పెట్టడం సమంజసమేనా.? ముందుగా అపదలో చిక్కుకున్నవారికి అపన్న హస్తం అందించాల్సిందిపోయి.. మానవత్వంతో వ్యవహరించాల్సిన సమయంలో అర్థలేని చర్చలకు దారి తీయడం సమంజసమేనా అంటూ మరికోందరు వాదిస్తున్నారు.లేకుండా సాగుతున్నాయి. అయ్యప్ప భక్తులు మాత్రం.. వరదలు కచ్చితంగా సుప్రీం తీర్పు వల్లే వచ్చాయని వాదిస్తుండగా మరికొందరైతే ప్రకృతికి ప్రకోపమే ఈ విలయానికి కారణమని చెబుతున్నారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more