టీడీపీ పార్టీకి కేంద్రంలోని బీజేపి నేతృత్వంలోని ఎన్డీయే పార్టీతో తెగదెంపులు చేసుకున్ననాటి నుంచి తెలుగుదేశం నేతలు, వ్యూహకర్తలు అనుమానిస్తున్నట్లుగానే రాష్ట్రంలోని అధికార పార్టీపై కక్షసాధింపు చర్యలు సాగుతున్నాయా.? అపరేషన్ గరుడు, ద్రవిడ లాంటి వాటికి కాషాయపార్టీ తెరలేపుతుందా.?. సమాకాలిన రాజకీయాలలో ఎప్పుడోచ్చామన్నది ముఖ్యంకాదు.. ఎవరు ఏ పదవిలో కోనసాగుతున్నారన్నదే ప్రాధాన్యతను సంచరించుకుంటుందా.? అంటే అవుననే సమాధానాలే వినబడుతున్నాయి.
పట్టుమని పదిమంది పారిశ్రామిక వేత్తలకు దేశసంపదను దోచిపెట్టుతూనే.. మరోవైపు అవినీతిని సహించమంటూ స్వయం ప్రతిపత్తి కలిగిన కేంద్ర సంస్థలను వినియోగించుకుని వాటి ద్వారా ప్రత్యర్థి పార్టీల నేతలను టార్గెట్ చేస్తున్నారా.? దేశ రాజధాని ఢిల్లీలోని అప్ ప్రభుత్వం నుంచి ప్రారంభమైన ఈ దాడులు.. కేంద్ర మాజీ అర్థికశాఖ మంత్రి చిదరంబరం, ఆయన తనయుడు కార్తి చిదంబరం వరకు సాగినా.. కేంద్రం సహా కేంద్రంలోని మంత్రులు, బీజేపి పెద్దలు మాత్రం ఈ వ్యవహారాలపై వ్యూహాత్మక మౌనం పాటిస్తూ ముందుకుసాగంలో అంతర్యమేమిటో గోచరించడం లేదు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి నేపథ్యంలో వచ్చిన ఆర్కే నగర్ అసెంబ్లీ ఉపఎన్నికలలో డబ్బు విచ్చలవిడిగా ఖర్చుఅవుతుందని, అప్పటి మంత్రులు, పలువురు ఎమ్మెల్యేల ఇళపై కూడా ఐటీ దాడులు జరిగాయి. అంతటితో కూడా అగని కేంద్రం.. ఇక్కడ పాగా వేయాలన్న తమ అంచానలు తప్పాయని భావించి.. ఎన్నికలను ఒక్కరోజు ముందు రద్దు చేస్తున్నట్లు.. వాటిని మళ్లీ నిర్వహించనున్నట్లు కూడా ప్రకటించాయి.
ఈ క్రమంలో తమిళనాడులోని అధికార పార్టీలోని రెండు వర్గాలను ఏకం చేసి.. ఇక తమకు ఎదురులేదని భావించిన తరుణంలో అర్కేనగర్ ఉపఎన్నికకు వెళ్లినా.. అక్కడి ప్రజల తీర్పులో మాత్రం తేడా కనిపించలేదు. అంతకుముందు తాము నిర్ధేశించిన అభ్యర్థి టీటీవీ దినకరన్ కే ప్రజలు మొగ్గుచూపారు. ఇక అక్కడి నుంచి ఏ రాష్ట్రంలో ఎవరితోనే వారు నేరుగా దోస్తీలు చేస్తున్నారో.. ఎవరితో తెరవెనుక దోస్తీకి ఇష్టపడుతున్నారు. ఎవరితో దోస్తీగా వుంటూనే తమ గుప్పిట్లో వున్న కేంద్ర సంస్థలతో తేనె పూసిన కత్తిలా వ్యవహరిస్తున్నారో అర్థంకాకు యావత్ దేశంలోని రాజకీయ వాతావరణాన్ని మార్చేశారు.
అయితే అటు బీహార్ లో నితిష్ కుమార్ ను తిట్టిన నోటితోనే మొచ్చుకుంటూ ఆయన పార్టీతో జలకలసి ప్రభుత్వాన్ని నడుపుతున్న బీజేపి.. బీహార్ లో గత అసెంబ్లీ ఎన్నికలలో లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన అర్జేడీ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టగా.. ఆయనను ఆయన పార్టీని ఇరుకున పెట్టేలా సీబీఐ కేసులు, దాడులు జరుపుతూ.. చివరాఖరలకు లాలూను జైలు గోడల మధ్యకు నెట్టారు. ఇక ఇటు పక్కలో బెల్లంగా మారిని శివసేనను కదిలిస్తే మహారాష్ట్రలోని సర్కారుకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని వారు సునిషిత విమర్శలు చేస్తున్నా.. మౌనాన్నే వహిస్తూ కూర్చుండీపోయారు.
ఇక నాలుగేళ్లన్నరేళ్ల ముందు కలసి నడుద్దాం.. కలసి సాగుదాం అంటూ టీడీపీతో చట్టాపట్టాలేసుకుని ముందుకు సాగిన బీజేపి.. అమిత్ షా రాజకీయ చతురతను కానీ.. ప్రధాని మోడీ వ్యూహాత్మక అడుగులను ఏ మాత్రం తక్కువగా అంచనావేయకుండా కదిలిన టీడీపికి.. వైరం ప్రారంభమైంది. ప్రత్యేక హాదా విషయంలో ప్రారంభమైన ఇరుపార్టీల మధ్య విభేదాలు ఇక రానురాను తారాస్థాయికి చేరకున్నాయి. బీజేపి వ్యూహాలను ముందస్తుగానే తెలుసుకున్న టీడీపీ.. ఎక్కడికక్కడ వారి ద్వంద వైఖరిని ప్రజలకు తెలియజేస్తూనే ముందుకు సాగింది.
ఈ క్రమంలో చంద్రబాబు రాజకీయ చతురతను ఎలా ఢీకొనాలో తెలియక.. కేంద్రం మళ్లీ టీడీపీ ఎంపీలను టార్గెట్ చేసింది. అందులో భాగంగానే సీఎం రమేష్ ఇళ్లు, కార్యాలయాలపై ఇవాళ ఐటీ దాడులు జరిగాయని కూడా టీడీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఇక తాజాగా అమిత్ షా, ప్రధాని మోడీలను టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సంధిస్తున్న అరోపణలకు ఇప్పటికీ కేంద్రం నుంచి సరైన సమాధానమే లేదు. అసలు ఆ ఆరోపణలు తమపై సంధిస్తున్నవి కాదన్నట్లుగా వ్యవహరిస్తుంది అధికార పార్టీ.
దేశ ప్రజల జేబుల్లోంచి పలు రకాలుగా డబ్బులు లాగుతున్న కేంద్రం.. వాటిని అనీల్ అంబాని బేబులోకి వేస్తుందన్న అరోపణలపై ఇప్పటివరకు ప్రధాని సమాధానం ఇవ్వలేదు. సరికాగా.. కనీసం స్పందించనూ లేదు. ఇక అమిత్ షా తనయుడు జైషాకు చెందిన కంపెనీలో కూడా అక్రమంగా పెట్టుబడులు ఎలా వెళ్లాయన్న ప్రశ్నలు దేశవ్యాప్తంగా దుమారం లేపినా.. దానిపై మాత్రం ఒక్క విచారణ కూడా లేకుండా.. అసలేం జరిగింది అన్నట్లుగా వ్యవహరించింది కాషాయ పార్టీ. ఇక కేరళలో తమ పార్టీ నేతలు దొంగ నోట్లను ముద్రిస్తున్నా.. నాటు బాంబులను తయారు చేస్తున్నా.. పట్టించుకోలేదు.
అటు కర్ణాటకలో ఏకంగా గాలి జనార్థన్ రెడ్డి కుటుంబికులు నోట్ల రద్దు సమయంలో తమ కూతురు పెళ్లి కోసం అవసరమైన డబ్బును ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి తీసుకున్నారన్న విషయాలు వెలుగులోకి వచ్చినా పెద్దగా పట్టించుకున్న పాపన పోలేదు. వారి వద్ద పనిచేసే డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడుతూ మరణ వాంగ్మూలం ఇచ్చినా.. అది కూడా బుట్టదాఖలు అయ్యింది. నీతి న్యాయం అంటూ మాట్లాడే వాళ్లు.. అందరి విషయంలోనూ అలానే వుండాలి. కానీ తనకు ఒక నీతి, తనను కానీ వారికి మరో నీతి అంటూ వ్యవహరించకూడదన్న విషయం తెలిసినా.. తాను పట్టిన కుందేలుకు మూడేకాళ్లు అంటూ వ్యవహరించడం ఎంత వరకు సమంజసమన్నది.? ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే తేలుస్తారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more