దేశంలో ఎన్నికలవేడి రాజుకుంది. నిర్ణీత షెడ్యూల్డు ప్రకారం జరుగుతున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా తెలంగాణ ముందస్తు ఎన్నికలతో కలపి ఐదు రాష్ట్రాల ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలపై విమర్శనాస్త్రాలను సంధించడంతో పాటు అవి చేసిన అక్రమాలను కూడా పార్టీలో జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ఏడాది ఎన్నికలు చివర్లో ఈ ఐదు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు కూడా జరగనుంది.
ఈ క్రమంలో ఎన్నికలకు సమాయత్తం అవుతున్న రాష్ట్రాల్లో పర్యటిస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో అన్నిపార్టీల ముఖ్యనేతలు తలమునకలైవున్నారు. అధికార పార్టీలు చేసిన అక్రమాలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు విపక్ష పార్టీలు సిద్దంకాగా, విపక్షపార్టీలు ఏ విధంగా విఫలమయ్యాయన్న విషయాన్ని అధికార పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్తేందుకు రెడీ అవుతున్నాయి. ఎన్నికల వేళ ఇవన్నీ శరమామూలే.. అనుకుంటున్నారా.? అయితే ఒకే.. కానీ.. పార్టీ అగ్రనేతల మరణాలను కూడా ప్రచారాస్త్రాలుగా మార్చుకుని వాటిని కూడా రాజకీయ లబ్ది కోసం వాడుకుంటే అది క్షమార్హం కాదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
దేశానికి సంబంధించిన గోప్ప వ్యక్తులు, పార్టీకి చెందిన మహానుభావులు ఎవరైనా సరే.. వారి మరణాలను కూడా రాజకీయ లబ్ది కోసం చౌవకబారు ప్రచారం కోసం వాడుకోవడం విమర్శలకు తావిస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తెలంగాణకు వచ్చారు. హైదరాబాద్ లో పార్టీ ముఖ్యనేతల సమావేశంలో పాల్గోన్న తరువాత ఆయన సాయంత్రం కరీంనగర్ లోని అంబేద్కర్ మైదానంలో జరిగిన సమరభేరిలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా అధికార టీఆర్ఎస్, విపక్ష కాంగ్రెస్ విమర్శలు గుప్పించారు. నిజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడే ధైర్యం వున్న తాము.. తెలంగాణలో టీఆర్ఎస్ కు నిజమైన ప్రత్యామ్నాయం అని ప్రకటించుకున్నారు. హైదరాబాద్ లో మజ్లిస్ కు వ్యతిరేకంగా పోరాడే పార్టీ ఏదైనా వుంది అంటే అది బీజేపియేనని చెప్పుకోచ్చారు. అంతటితో ఆగని షా.. టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాల కూటమి అధికారంలోకి వచ్చినా.. మజ్లిస్ తో పోరాటం చేయలేవని విమర్శలు గుప్పించారు.
ఇక్కడి వరకు బాగానే వున్నా మాజీ ప్రధాని, దివంగత మహానేత అటల్ బిహారీ వాజ్‌పేయ్ అంతిమయాత్రను కూడా అమిత్ షా ప్రచారాస్త్రంగా వాడేసుకున్నారు. ఆయన అంతిమయాత్రంలో ప్రధాని నరేంద్రమోడీ ఐదు కిలోమీటర్ల దూరం కాలినడక పాల్గొన్న విషయాన్ని కూడా ప్రస్తావించారు. ‘‘వాజ్‌పేయీ అంతిమ యాత్రలో ప్రధాని మోదీ ఐదు కిలోమీటర్లు నడిచారు. అదీ మా పార్టీ వాజ్‌పేయీకి ఇచ్చిన గౌరవం అని అన్నారు. పార్టీ నేతలపై గౌరవాన్ని కూడా ఓట్ల కోసం, రాజకీయ లబ్ది కోసం వాడుసుకోవడం విమర్శలకు తావిస్తుంది.
అదే సమయంలో మాజీ ప్రధాని తెలంగాణ పుత్రుడు, భూమి పుత్రుడైన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణిస్తే.. అధికారంలో వున్న కాంగ్రెస్ ప్రభుత్వం, ఆయన బౌతికకాయాన్ని అఘమేఘాల మీద హైదరాబాద్ కు తరలించి.. అక్కడ అంత్యక్రియలను నిర్వహించింది. ఆయన పార్థీవదేహం కూడా పూర్తిగా కాలిపోకముందు నాయకులు అందరూ వెళ్లిపోయారు. అయన బౌతికకాయం సగమే కాలిందన్న విషయం మరుసటి రోజున పత్రికలలో చూశామని అన్నారు.
పీవీ నరసింహారావు అంత్యక్రియలను అధికారంలో వున్న కాంగ్రస్ ఎందుకు ఢిల్లీలో జరపలేదని ఆయన ప్రశ్నించారు.
అయితే, అమిత్ షా వాజ్‌పేయీ. పివి నరసింహారావుల అంత్యక్రియల విషయాన్ని ప్రస్తావించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. శవ రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శిస్తున్నారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మోదీ అలా చేశారా? అనే అనుమానాలు కలిగేలా అమిత్ షా మాట్లాడుతున్నారని తెలుపుతున్నారు. వాజ్‌పేయీ మరణం తర్వాత ఆయన చితాభస్మాన్ని పలు రాష్ట్రాల్లో ఊరేగింపుగా తీసుకెళ్లి నదుల్లో కలిపిన సంగతి తెలిసిందే. ఈ చర్యలపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more