త్వరలో రూ.2000 నోటు కాలగర్భంలో కలిసిపోనుందా.? అంటే అవునన్న సంకేతాలే కనబడుతున్నాయి. పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో 2016 నవంబర్ 10న దేశప్రజలను పలకరించి అతిపెద్ద దేశీయ కరెన్సీ రూ.2000 నోటు రాకతోనే ప్రజలను ముప్పుతిప్పలు పెట్టింది. అప్పటి వరకు వున్న రూ.1000 నోటుకే చిల్లర లభించడం కష్టంగా వున్న క్రమంలో రూ.2000 నోటు వచ్చి చిల్లర సమస్యను మరింత పెంచింది.
అయితే పెద్ద నోట్లతో అవినీతి, అక్రమాలు, నల్లధనం, ఇలా అనేక సమస్యలు వున్నాయని చెప్పిన కేంద్రం.. వెయ్యి నోటు స్థానంలో రూ.2000 నోటుకు ఎందుకు తీసుకువచ్చిందో దేశప్రజలకు ఇప్పటికీ అర్థంకానీ ప్రశ్నగానే మిగిలింది. ఈ నోటు ప్రవేశపెట్టిన నేపథ్యంలో విమర్శలకు కూడా తావిచ్చింది కేంద్రం. అయితే తనపై నిందలు పడకుండా డొంకతిరుగుడు సమాధానాలతో సర్థి చెప్పి సరిపెట్టుకుని కాలం వెల్లదీసింది.
తాజాగా మాజీ కేంద్ర ఎన్నికల కమీషనర్ ఓం ప్రకాష్ రావత్.. ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా చేసిన వ్యాఖ్యలు కూడా కేంద్రానికి చురకలు అంటించేవిలా వున్నాయి. దేశంలో నోట్ల రద్దు ప్రభావం పెద్దగా లేదని.. ఐదు రాష్ట్రాల ఎన్నికలలో పెద్దసంఖ్యలో పట్టుబడిన కొట్ల రూపాయల మొత్తం అంతా నల్లధనమేనని, రాజకీయ పెద్దలు, ప్రముఖులు అందరూ ముందుగానే తమ ధనాన్ని మార్చుకున్నారని ఆయన పెదవి విరిచిన విషయం తెలిసిందే.
ఇక నోట్ల రద్దు తరువాత కూడా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆదాయపన్ను శాఖ అధికారుల దాడుల్లో కూడా పెద్ద ఎత్తున్న కట్టల కొద్ది కొత్త నోట్లు, బంగారం పట్టుబుడతుంది. ఇక సీబిఐ దాడుల్లో, ఈడీ దాడుల్లో కూడా ఇది షరామామూలేగానే మారింది. ఇక ఆయా రాష్ట్రాల పరిధిలోని ఏసీబీ అధికారుల దాడుల్లోనూ అనేక మంది అక్రమార్కుల ఇళ్లలో కొత్త నోట్ల కట్టలు బయడపడుతున్నాయి. ఈ క్రమంలో నోట్ల రద్దు వల్ల దేశ ప్రజలపై పడిన భారం.. దేశంలోని పేదలు, మధ్యతరగతి ప్రజలు అనుభవించిన వేధన, ఎదుర్కోన్న ఇబ్బందులకు ఏం లాభం చేకూరిందన్న ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి.
ఈ ప్రశ్నలు కేంద్ర ప్రభుత్వాన్ని అలోచింపజేస్తున్నాయా..? లేక తాము తెచ్చుకున్న ఆర్బీఐ గవర్నర్ ఉర్జీత్ పటేల్ కూడా తన పదవీ కాలం ముగియకుండానే రాజీనామా చేసి వెళ్లిపోయిన క్రమంలో విమర్శలపాలవుతున్న తమను తాము కాపాడుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారో తెలియదు కానీ.. ఇప్పటి పెద్ద నోట్ల ప్రభావం ఎలా వుంటుందన్న విషయంలో కళ్లు తెరిచారు. తాజాగా, మళ్లీ నల్లధనం, పన్ను ఎగవేతలు, మనీలాండరింగ్‌కు రూ.2000నోటు ఆయుధంగా మారినట్టు కేంద్రం భావించింది. దీంతో ఆఘమేఘాల మీద పెద్ద నోటు ముద్రణను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
అయితే చలామణిలో ఉన్న నగదులో 37% కరెన్సీ రూ.2000 నోట్ల రూపంలోనే ఉన్న నేపథ్యంలో క్రమంగా పెద్ద నోటును కాలగర్భంలో కలపాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సంకేతాలు అందుతున్నాయి. ఉన్నపళంగా రూ.2000 నోటును రద్దుచేస్తే ఎన్నికల ముందు తీవ్ర వ్యతిరేకత, విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చే ప్రమాదం పొంచి ఉండటంతో తొలుత ముద్రణను నిలిపివేసి ఆ తర్వాత క్రమంగా చలామణిని తగ్గించే మార్గాలను అన్వేషిస్తున్నది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more