దేవుడి సొంత రాష్ట్రంగా.. ప్రశాంతమైన ప్రకృతికి అలవాలైన రాష్ట్రం కేరళ. అఖండభారతావనిలో నూటికి నూరు శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రం. అలాంటి సస్యశామల అన్న పదానికి నిర్వచనంలా వున్న రాష్ట్రంలో ప్రస్తుతం బాంబు విస్పోటనాలు చోటుచేసుకుంటున్నాయి. వివేకవంతులున్న రాష్ట్రంలో ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టడంలో పలువురు పనుతున్న కుట్రలు పైచేయి సాధించాయా.? అంటే ఔననే చెప్పకతప్పదు.
ప్రకృతి రమణీయతకు ఆలవాలంగా వున్న రాష్ట్రంలో నాటు బాంబుల విస్పోటనాలు భీతావాహ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. భిన్నమతాలు, భిన్న సంస్కృతులు వున్న మలయాళీయలను నిట్టనిలువునా చీల్చుతున్నాయి. ఇన్నాళ్లు సామరస్యంగా వున్న ప్రజలు.. అందరి ఆచారవ్యవహారాలను గౌరవిస్తూ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటారు. అయితే దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో శబరిమల ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడంతో ఒక్కసారిగా ప్రశాతంగా వున్న కేరళ అట్టుడిపోయింది.
శబరిమలతో పాటు ఆ పవిత్ర ఆలయం నెలకొన్న పుత్తనతిట్ట జిల్లా సహా రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకారులు తెలిపిన అందోళనకారులు ఆగ్రహానికి గురికావడంలో తప్పలేదు. అయితే ఏకంగా నాటు బాంబులతో విరుచుకుపడి విధ్వంసాలకు పాల్పడే చరిత్ర మాత్రం మళయాలీయులకు లేదు. అలాంటి కనీవిని ఎరుగని రీతిలో కేరళ బంద్ నేపథ్యంలో నాటు బాంబులు ఎక్కడి నుంచి వచ్చాయి. ఎవరిని టార్గెట్ చేశారు. కమ్యూనిస్టు భావజాలాన్ని, లేక సుప్రీంకోర్టు అదేశాలనా.? అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. శాంతియుతంగా నిరసన తెలుసుతున్న అందోళనకారులను కూడా టార్గెట్ చేస్తున్నారా.? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
హిందూ సంస్థలు చేపట్టిన ఆందోళనతో రాష్ట్రం రణరంగంగా కనిపిస్తోంది. పలు చోట్ల అవాంఛనీయ సంఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. కన్నూర్ జిల్లా ఇరిత్తి ప్రాంతంలో సీపీఎంకు చెందిన కార్యకర్తపై శుక్రవారం అర్ధరాత్రి కొందరు ఆందోళన కారులు దాడిచేసి అతన్ని కత్తితో గాయపరిచారు. ఎమ్మెల్యే ఎ.ఎన్.షంషీర్ ఇంటిపై కూడా దాడి జరిగింది. తస్సెరీ ప్రాంతంలో బీజేపీ ఎంపీ వి.మురళీధరన్ నివాసంపై ఆందోళనకారులు బాంబులు విసిరారు.
నాటు బాంబులు తయారు చేసినవారెవ్వరూ..? సంపూర్ణ అక్షరాస్యత కల్గిన రాష్ట్రం దేశానికి ఇచ్చే సందేశమిదేనా.. అసలు కేరళ ఎందుకిలా రగిలిపోతుంది. ఇప్పటికే కేరళకు చెందిన పలువురు ముస్లిం యువకులు ఐసిస్ లో చేరేందుకు దేశ సరిహద్దులు దాటి వెళ్లిపోవడమే అందోళన కల్గిస్తున్న క్రమంలో అంతర్గతంగా చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు మళయాలీయులనే కాకుండా యావత్ దేశ ప్రజలను మరింత అవేదనకు, అందోళనకు గురిచేస్తున్నాయి. తమ తీర్పుతో దేశంలోని ఒక రాష్ట్రం రావణకాష్టంలా రగలిపోతున్న ఈ పరిస్థితుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం చోరవ చూపాల్సిన అవసరం ఎంతైనావుంది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more