ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన క్రమంలో అన్ని పార్టీలు తమ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గెలుపు ఓటములు ఓటర్ల తీర్పుపై అధారపడి వుంటాయన్న విషయం తెలిసిందే. అయితే గత పర్యాయం కొద్దిలో చేజారిన అధికారం ఈ సారి తప్పక అందుతోందని భావిస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమదే అధికారమని ధీమా వ్యక్తం చేయడంతో పాటు తమదే అధికారమన్న అధికార, ప్రత్యర్థి పార్టీలపై వ్యంగంగా విరుచుకుపడుతుంది. దీంతో ఆ పార్టీపై జనసేన పార్టీ కార్యకర్తలు, అభిమానులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఎవరి ధీమాను వారు వ్యక్తం చేసుకుంటే.. మీ జోక్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు.
అయినా ఈ విషయంలో ఇప్పుడు రెండు పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రత్యర్థి రాజకీయా పార్టీలకు సముచిత గౌరవం ఇవ్వాలని తెలియకుండా కేవలం అధికారమే పరమావధిగా వ్యాఖ్యలు చేయడం వైసీపీ నేతల అధికార దహాన్ని ప్రతిబింభిస్తుందని జనసేన కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. అసలేం జరిగిందంటే.. తమ పార్టీకి మే 23న వెల్లడికానున్న ఫలితాల్లో 88 సీట్లు సాధిస్తుందని ఆ పార్టీ నేత, సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ చెప్పడంపై వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఘాటుగా స్పందించారు.
ఇవాళ ట్విట్టర్ లో ఈ మేరకు స్పందించిన ఆయన ఆయన స్పందిస్తూ.. జనసేన పార్టీ కేవలం 65 స్థానాల్లోనే పోటీ చేసిందనీ, అలాంటప్పుడు పవన్ కల్యాణ్ అనుంగు అనుచరుడు జేడీ లక్ష్మీనారాయణేమో 88 చోట్ల ఎలా విజయం సాధిస్తుందని జోస్యం చెబుతున్నారని వ్యంగంగా ప్రశ్నించారు. ఇతను దర్యాప్తు చేసిన కేసుల్లో కూడా ఇలాగే లేనివి ఉన్నట్టు రాశాడు. ఇది కూడా చంద్రబాబు బ్రీఫింగేనా?’ అని ట్వీట్ చేశారు. పనిలో పనిగా ఏపీ సీఎం చంద్రబాబుపై కూడా కామెంట్లు చేశారు. పాకిస్థాన్ వాళ్లు పిలిచినా చంద్రబాబు వెళ్లి ప్రచారం చేసి వస్తాడని ఎద్దేవా చేశారు.
దీనిపై జనసైనికులు మండిపడుతున్నారు. విజయసాయిరెడ్డి అనుంగు నాయకుడి కోసం అందరినీ టార్గెట్ చేసి.. ఒకరితో మరోకరికి లింకులు పెట్టుకుంటూ మసిపూసి మారేడు కాయను చేయలాని ప్రయత్నిస్తున్నాడని ధ్వజమెత్తారు. చేతికి వున్న ఐదు వేళ్లను విజయసాయి అంజనం వేసి యాభై వేళ్లుగా కూడా చూపగల గణిత ఘనాపాటి అని సైటర్లు వేశారు. కూడికలు కూడా రాని విజయసాయి చార్టడ్ అకౌంటెంట్ ఎలా అయ్యారని జనసైనికులు ఆయనపై మండిపడుతున్నారు. జనసేన సొంతంగా పోటీచేసింది 120 స్థానాలని, మిత్రపక్షాలతో కలసి 175 స్థానాల్లో పోటీ చేసిందని వారు పేర్కోన్నారు. తాము అధికారంలోకి వస్తామని జేడీ చెప్పడంలో తప్పేముందని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.
ఎవరు గెలుస్తారన్న. ఎవరికి అధికారం దక్కుతుందన్న విషయాలు వచ్చే నెల 23వ తేదీన తేలిపోనుంది. అయితే ఈ లోపు ఎవరెంత ధీమా వ్యక్తం చేసినా అది కేవలం తమ క్యాడర్ ను కాపాడుకుని, ఉనికి చాటుకోవడానికే అన్న విషయం ఓటర్లతో పాటు రాజకీయ పార్టీల నేతలకు కూడా తెలుసు. అంతా తెలిసి కూడా ప్రత్యర్థి పార్టీలోపై వ్యంగస్త్రాలు సంధించడం.. ప్రత్యర్థి పార్టీలను, కార్యకర్తలను, ఆయా పార్టీలకు ఓట్లు వేసిన ఓటర్లను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం అవసరమా.? అన్నది వారికే తెలియాలి. పార్టీల కార్యకర్తల మధ్య యుద్దవాతావరణాన్ని సృష్టించడం ఎందుకో నాయకులకైనా అర్థమయ్యేనా.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more