సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మరోమారు అధికారంలోకి వచ్చేందుకు చాయ్ వాలా నరేంద్రమోడీ.. చౌకీధార్ గా మారారని విపక్షాలు.. దేశభద్రత విషయంలో మన వాయుసేన అత్మస్థైర్యం దెబ్బతినేలా విపక్షాలు ప్రశ్నలు కురిపిస్తున్నాయని అధికార విపక్షాలు పరస్పర అరోపణలు చేసుకుంటున్నాయి. రాఫెల్ కుంభకోణం విషయంలో ప్రధాని అంబానీలకు, పారిశ్రామిక వేత్తలకు కాపలావుంటున్నారని, ఆయన హాయంలో అనేక మంది దేశ అర్థిక ఉగ్రవాదులు దేశం దాటారంటూ.. కాంగ్రెస్ ఇప్పటికే అరోపణలు గుప్పిస్తోంది. అంతేకాదు.. చౌకీదార్ దోంగ అంటూ కూడా ప్రతీ సభలోనూ ప్రజలకు వివరిస్తోంది.
ఓ వైపు విపక్షాల అరోపణలను, విమర్శలను కోట్టిపారేస్తున్న దేశప్రధాని నరేంద్రమోడీ.. స్వాతంత్ర భారతావని ఎప్పుడూ దాయాధితో వ్యవహరించని తీరున తాము వ్యవహరిస్తున్నామని గట్టిగా బదిలిస్తూనే వుంది. అయితే ఈ ఎన్నికలలో గెలిచేందుకు ప్రధాని మోడీ బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కు ఇచ్చిన ఇంటర్వ్యూపై మాత్రం పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేవలం అబద్దాలతో దేశ ప్రజలకు మభ్యపెట్టి మరోమారు అధికారంలోకి వచ్చేందుకు చేసిన ప్రయత్నమని.. ఆయన తనంతట తానుగా ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ అబద్దాలు వెల్లడించడమేంటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ కు ఏ టీవీ చానెల్ తో సంబంధం లేకపోయినా.. ఆయనకు ఇంటర్య్వూ ఇవ్వడం పట్ల కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. సర్జికల్ స్ట్రైక్స్, ఆ తరువాత పూల్వామా దాడి, ఆ తరువాత మరోమారు వాయుసేన సర్జికల్ స్ట్రైక్స్.. అంతకుముందు గత పర్యాయం సార్వత్రిక ఎన్నికలకు ముందు దేశప్రజలకు ఆయన ఇచ్చిన ఎన్నికల హామీలు, రైతుల ఆత్మహత్యల విషయంలో చర్యలు తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు పలుమార్లు వేసిన మొట్టికాయలు, గుజారత్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్.. దాయాధి దేశ ముష్కరులతో కుమ్మక్కై తన హత్యకు సుపారీ ఇచ్చారని చేసిన వ్యాఖ్యలపై.. ప్రధాని నరేంద్ర మోడీ ఇంటర్య్వూలకు దేశంలోని అనేక మీడియా ఛానెళ్లు ఎదురుచూస్తున్నా.. ఆయన అక్షయ్ కుమార్ కు ఎలా సమాయాన్ని కేటాయించారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
లోక్ సభ సమావేశాలు ఏమాత్రం సజావుగా సాగకుండా చరిత్రలో ఓ అపఖ్యాతిని మూటగట్టుకున్న అంశమై ఛాయ్ వాలాను విపక్షాలు దేశ ప్రధానిగా అంగీకరించడం లేదని చెప్పని క్రమంలోనూ.. పెట్రోల్ ధరలు మునుప్పెన్నడూ లేని కొత్త రికార్డు ధరలను అందుకున్న క్రమంలోనూ.. నిత్యావసర సరుకుల ధరలు పెరిగిన క్రమంలోనూ ఆయన ఎం చెబుతారోనని.. ఇలా గత ఐదేళ్ల కాలంలో అనేకె సమస్యలపై మౌనం దాల్చిన ప్రధాని మోడీ.. ఎలా సమస్యలపై దేశప్రజలకు వివరిస్తారోనని మీడియా నిరీక్షిస్తున్నా.. వారి ముందుకు రాకుండా.. కేవలం అక్షయ్ కుమార్ తో సమయాన్ని కేటాయించడం పట్ల కూడా విమర్శలు వస్తున్నాయి.
WATCH | "I used to wash my clothes till the time I became Chief Minister": PM Modi tells Akshay Kumar
— NDTV (@ndtv) April 24, 2019
Full interview: https://t.co/flA2JrFOjN pic.twitter.com/7sz9RV7oP7
ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే మరో తాజాగా పలువురు నెట్ జనులు ప్రధానిపై అరోపణలు చేస్తున్నారు. ప్రధానిని నెట్టింట్లో ట్రాల్ చేస్తున్నారు. అత్యున్నత స్థాయిలో కొనసాగుతూ దేశప్రజలకు అబద్దాలను చెబుతూ.. గోప్పలకు పోతున్నారంటూ అరోపణలు చేస్తున్నారు. 2001లో అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేవరకు తన దుస్తులు తానే ఉతుక్కున్నానని బుధవారం బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ చెప్పారు. అయితే ఇది పూర్తిగా అవాస్తమని నెటిజెన్లు మండిపడుతున్నారు. మోదీ అబద్ధాలు చెబుతున్నారని కొన్ని సాక్ష్యాల్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి ఇలా అబద్ధాలు చెప్పడమేంటని, ఇదంతా ఎన్నికల గిమిక్కని మండిపడుతున్నారు.
అయితే 1970 దశకంలో.. నరేంద్రమోదీ ఆర్‌ఎస్ఎస్ ప్రచారక్ గా ఉన్నప్పటి నుంచే చాంద్ మహ్మద్ అనే వ్యక్తి మోదీ దుస్తులు ఉతుకుతూ వచ్చారు. అతడు 2017 అక్టోబర్‌లో మరణించారు. అంటే మోదీ ముఖ్యమంత్రి కాకముందు మూడు దశాబ్దాల క్రితం నుంచే ఆయన దుస్తులు వేరే వారు ఉతికేవారనే విషయం స్పష్టమవుతోందని నెటిజెన్లు మండిపడుతున్నారు. చాంద్ అహ్మద్ చనిపోయినట్లు వచ్చిన వార్తా క్లిప్పుల్ని నెటిజెన్లు షేర్ చేస్తున్నారు. ఇక ఈ మేరకు అంగ్ల దినపత్రిక ది ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో రెండేళ్ల క్రితం వచ్చిన కథనం కూడా దీనిని ధృవీకరిస్తోంది. ముఖ్యమంత్రిగా బాద్యతలు చేపట్టిన తరువాత ఆయన కు ఐదు లక్షల రూపాయలను ఇచ్చినా ఆయన తీసుకోలేదని, బుదలుగా ఇంటి స్థలం కోరగా, మోడీ వెంటనే మంజూరు చేశారని కూడా ఈ కథనంలో ప్రచురించింది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more