మాజీ మంత్రి, టిడిపి సీనియర్ నేత, టెక్కలి ఎమ్మెల్యే అచ్చన్నాయుడుకు మరో పదవి దక్కనుందా.? అంటే అవుననే వార్తలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో మరీ ముఖ్యంగా టీడీపీ పార్టీలో జోరుగా వినబడుతున్నాయి, అచ్చన్నాయుడికి రాష్ట్ర పార్టీ పగ్గాలను అందించాలని ఇప్పటికే ఆయన సహచరులు పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువచ్చారని, అయితే అందుకు అధిష్టానం కూడా సానుకూలంగా స్పందించిందన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే నిజంగా ఇలాంటి రాజకీయ పరిణామాలు చోటుచేసుకుంటుయా.? అని పార్టీ వర్గాల్లో గుసగుసలు కూడా వినబడుతున్నాయి.
పార్టీ అధికారంలో వున్నా తాము మంత్రులం కాలేకపోయామని, కనీసం నామినేటెడ్ పదవులు కూడా తమకు దక్కలేదని, ఇప్పుడు పార్టీ పదవులు కూడా దక్కే అవకాశం లేదని కొందరు సీనియర్లు పార్టీ అధిష్టానంపై రుసరుసలు అడుతున్నారని తెలుస్తోంది, పార్టీ కోసం అహర్నిషలు కష్టపడిన తమకు ఏ పదవులు దక్కకపోయినా తాము ఇన్నాళ్లు పార్టీ ఏజెండాను ముందుకు తీసుకెళ్లి.. క్షేత్రస్థాయిలో పార్టీని బలపేతం చేశామని.. ఇప్పుడు కూడా పార్టీ తమను గుర్తించకుండా అధికారంలో వుండగా మంత్రి పదవులను ఇచ్చిన వారికే పార్టీ పదవులను కూడా అంటగడితే.. తమ పరిస్థితి ఏంటని.. ఈ విషయంలో పునరాలోచించుకోవాలని కూడా పలువురు నేతలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈఎస్ఐ మందుల కుంభకోణంలో అభియోగాలను ఎదుర్కోని అరెస్టయిన అచ్చెన్నాయుడును రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తే.. పరోక్షంగా అధికార పార్టీకి తమను విమర్శించే హక్కును కూడా కల్పించినట్టే అవుతుందని మరికొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి, రాష్ట్ర పార్టీ అధ్యక్ష హోదాలో ఆయనను పెడితే అటు పార్టీ తో పాటు అచెన్నాయుడ్ని కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. దీంతో ఆయననకు పార్టీ పగ్గాలను అందించేముందు అధిష్టానం ఈ విషయాలపై కూడా అలోచించాలని అంటున్నారు, ఇక ఇప్పటికే సంస్థాగత ఎన్నికల ప్రక్రియను మండలస్థాయి వరకు పూర్తిచేసిన టీడీపీ.. ఇప్పుడు లోక్సభ నియోజకవర్గాల వారీగా కమిటీలను నియమించేందుకు కసరత్తు ప్రారంభించింది. మరో వారం రోజుల్లో ఈ కమిటీలను, ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటిస్తారని సమాచారం. అలాగే, రాష్ట్ర కమిటీల నియామకం కూడా పూర్తిచేస్తారని తెలుస్తోంది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more