కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం రైతుల కోసం తామెంతో చేస్తున్నామని పై ఓ వైపు బడాయిలు చెబుతూనే మరోవైపు వారితో లడాయికి సిద్దమైందా.? అంటే ఔననే చెప్పాలి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం రైతుల పక్షపాతి అని.. వారి అభ్యున్నతి కోసమే నూతన వ్యవసాయ చట్టాలను కేంద్రం తీసుకువచ్చిందని చెబుతున్నా.. వారితో కేంద్రం పలు పర్యాయాలు చర్చలు నిర్వహించినా.. ఫలితం మాత్రం శూన్యం. వన్నులో చలి పుట్టే శీతలకాలంలోనూ.. ఏ డిమాండ్ తో నిరసన బాట పట్టారో రమారమి మూడు నెలలు కావాస్తున్న ఆ డిమాండ్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది.
కేంద్రం తన తాజా బడ్జెట్ లోనూ అటు వరి, ఇటు గోధుమ పంటలకు మద్దతు ధరను పెంచుతున్నట్లు ప్రకటించిన కేంద్రానికి రైతుల సంక్షేమంపై నిజంగా చిత్తశుధ్ది వుంటే.. కేంద్రం తీసుకువచ్చిన నూతన సాగు చట్టాలు తమ ఉనికికి, మనుగడను ప్రశ్నార్థకంగా మారుస్తుందన్న అనుమానాలతో నిరసనోద్యమం చేపట్టిన రైతన్నల డిమాండ్ మేరకు బిల్లును ఉపసంహరణపై మంత్రిమండలిలో చర్చించి నిర్ణయం తీసుకోవచ్చుకదా.? అన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి. ఇక గణతంత్ర దినోత్సవం రోజున జరిగిన ట్రాక్టర్ ర్యాలీలో హింసాత్మక ఘటనలు తమ పని కాదంటున్న రైతుల వాదనలను పరిగణలోకి తీసుకోకుండా కేంద్రం అది వారి పనే అని హైలెట్ చేయడం కూడా పలు ప్రశ్నలు ఉత్పన్నమయ్యేట్టు చేస్తోంది.
ఇక ఇప్పటికే ఏకంగా 200 మందిపై కేసులు బనాయించినా.. వేలాదిగా దేశ రాజధాని సరిహద్దులోని సింఘు, ఘాజీపూర్, టిక్రీ ప్రాంతాలకు చేరుకుని నిరసన చేపడుతున్న రైతులు మాత్రం తమ నిరనస పంథాను మాత్రం వీడటం లేదు. సాగు చట్టాలపై కేంద్రం వెనక్కు తగ్గే వరకు తమ నిరసన నిలిచిపోదని ఖరాఖండీగా చెబుతున్నారు రైతులు. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారమన్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన సందర్భంలో రైతు సంక్షేమాన్ని కాంక్షించే ప్రధానిపై రైతులు సందేహాన్ని వ్యక్తం చేయడం సహేతుకంగా లేదని వ్యాఖ్యానించారు. అయితే రైతులు ఏమి అలోచించినా.. ప్రధాని మాత్రం వారి ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే కాంక్షతోనే వున్నారని కేంద్రమంత్రి పేర్కోన్నారు.
ఇదిలావుండగా.. యావత్ దేశం చూస్తుండగా తమపై బడాయిలను బాగా చెబుతూనే.. తీరా తాము నిరసనోద్యమం చేస్తున్న ప్రాంతంలో మాత్రం లడాయికి కేంద్రం సిద్దమైందని రైతులు అరోపిస్తున్నారు. దేశ ప్రజల దృష్టిలో తమపై ప్రేమను కనబరుస్తున్న కేంద్రం.. నిజానికి తమపై మాత్రం ఉక్కుసైన్యాన్ని వినియోగిస్తూ చెదరగోట్టేందుకు అనేక విధాల ప్రయత్నాలు కొనసాగిస్తోందని అన్నారు. స్థానికులను కూడా తమపైకి ఉసిగోల్పుతున్న చర్యలు కేంద్రానివేనని పలువరు రైతులు అరోపిస్తున్నారు. తాము సాగు చేయకపోతే.. పంటలు పండించకపోతే తమ గూడారాలను పీకేస్తున్న వారు ఏం తింటారని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇక తాజాగా తాము ఈ నెల 6న జాతీయ, రాష్ట్రీయ రహదారులపై మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటల వరకు రాస్తో రోకో చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో తమ ఉద్యమానికి తరలివస్తున్న రైతులను అడ్డుకునేందుకు కేంద్రం.. దారిలో సిమెంటు కాంక్రీట్ వేసి వాటిలో నిటారుగా మెకులను ఏర్పాటు చేశారని దీంతో వీటిపై నుంచి ఏలాంటి వాహనాలు వెళ్లకుండా వెళ్లినా పంక్చర్ అయ్యేలా చర్యలు చేపట్టడం.. దీనికి తోడు మార్గమధ్యంలోని పలు చోట్ల పలు చోట్లు రోడ్డుకు అడ్డంగా ఇనువ చువ్వలతో కూడిన గోడలను నిర్మించడాన్ని రైతలు తీవ్రంగా పరిగణిస్తున్నారు.
తాము అత్యల్ప ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుని ఇక్కడే తిష్టవేసి కేంద్ర సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న తరుణంలో కేంద్రం ఢిల్లీ పోలీసులకు ఉక్కుతో కూడిన లాఠీలను ఇచ్చిందని, దీంతో వారు తమపై అకారణంగా కూడా విరుచుకుపడే అవకాశాలు వున్నాయని, అలాంటి పరిస్థితులను వారే సృష్టించి కూడా ఉక్కులాఠీలకు పని చేప్పే అవకాశాలు వున్నాయని అరోపిస్తున్నారు, ఇలా కేంద్రం తమపై యుద్దానికి సన్నధమైందని తమకు మద్దతు లభించకుండా, నిరసన తెలిపే ప్రాంతాల్లో కనీస అవసరాలు కల్పించకుండా తమను శిభిరాలు వదిలి వెళ్లేలా చేస్తుందని అరోపించారు.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more