హుజూరాబాద్ అసెంబ్లీ స్థానానికి జరుగనున్న ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ సొంత పార్టీకి చెందిన నేతను బరిలోకి దింపుతుందా.? లేక వలస వచ్చిన నేతలనే బరిలోకి దింపుతుందా.? అన్న ఆసక్తికరమైన చర్చ జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీ అధి నుంచి వలస నేతలకు ప్రాధాన్యమిస్తూ పోంత పార్టీ నేతలను పక్కనపెడుతుందన్న అపవాదును ఈ ఉప ఎన్నికలలో బాపుకోవాలని పార్టీ యత్నిస్తుందా.? లేక వలస నేత అయితేనేం తమకు విజయాన్ని అందించే నేతనే బరిలోకి దింపాలని భావిస్తోందా.? అన్న ఆసక్తి రాష్ట్ర వ్యాప్తంగా నెలకొంది. దీంతో హుజూరాబాద్ అసెంబ్లీ స్థాన ఉపఎన్నికలు సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మాజీ మంత్రి ఈటెల రాజేందర్ ఆత్మగౌరవం పేరుతో మంత్రి పదవికి, టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి త్వరలో ఉప ఎన్నికలు రానున్నాయి. దీంతో బీజేపి పార్టీలో చేరిన ఈటెల రాజేందర్.. ఆదే పార్టీ నుంచి ఎమ్మెల్యే స్థానానికి పోటీ పడుతుండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన పాడి కౌశిక్ రెడ్డికి టీఆర్ఎస్ టికెట్ లభించడం తద్యమని అంతా బావించారు. అయితే ఇటీవలే పార్టీలో చేరిన యువ నేత కౌశిక్‌రెడ్డికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవిని కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది పార్టీ అధిష్టానం. దీంతో ఆయన ఎన్నికల రేసు నుంచి సైడ్ అయ్యారు.
ఈ నేపథ్యంలో ఈ సారి హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికల బరిలో పార్టీ అధిష్టానం ఎవరిని అభ్యర్థిగా దింపనుందన్నది హాట్ టాపిక్ గా మారింది. పార్టీతో పాటు ప్రజల్లో ఇమేజ్ కలిగిన నేత.. ఈటెలను ఢీకొట్టగలిగే సామాజిక వర్గ బలం.. విద్యార్థులు, యువత మద్దతు కూడగట్టుకున్న నేతను ఎంపిక చేసి.. ఈటెలకు గట్టి చెక్ పెట్టాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే దళితులను ప్రసన్నం చేసుకునేందుకు దళితబంధు పథకాన్ని హుజూరాబాద్ అసెంబ్లీ నుంచే ప్రభుత్వం ప్రారంభించనుంది. ఇక ఎమ్మెల్సీ స్థానం అగ్రవర్ణానికి చెందిన నేతకు కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో బిసి వర్గానికి చెందిన నేతకు టికెట్ ఇస్తేనే సామాజిక సమత్యులను చాటుకుని ఓట్లను దండుకోవచ్చునని పార్టీ అధిష్టానం భావిస్తోంది.
దీంతో ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పెద్దిరెడ్డికి కూడా టికెట్ రాదని తేలింది. టీడీపీ పార్టీకి చెందిన సీనియర్ నేత.. తెలంగాణ ఉద్యమంలో భాగంగా దేవందర్ గౌడ్ స్థాపించిన నవ తెలంగాణ ప్రజాపార్టీలో చేరి.. దానిని చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేసిన కొన్నాళ్ల తరువాత తిరిగి టీడీపీకి వెళ్లిన పెద్దిరెడ్డి.. తెలంగాణ అవిర్భావం తరువాత 2019లో టీడీపీని వీడి బీజేపి పార్టీలో చేరారు. అయితే హుజురాబాద్ నియోజకవర్గం నుంచే రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయనకు ఈటెల రాకతో అసంతృప్తికి గురయ్యారు.
ఇన్నాళ్లు అంకితభావంతో పనిచేసి పార్టీ బలోపేతానికి కృష్టి చేసిన తనకు గుర్తింపు లేదన్న ఆయన బీజేపి వీడి టీఆర్ఎస్ లో చేరారు. అయితే అక్కడా ఆయనకు టికెట్ దక్కే అవకాశాలు లేవు. ఇప్పటికే పాడి కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ స్థానాన్ని ఖరారు చేయడంలో ఇక ఉప ఎన్నికల బరిలో బిసిలనే నిలపాలని అంశాన్ని పార్టీ అధిష్టానం సిరియస్ గా తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ టీడీపీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి.. ఇటీవలే టీఆర్ఎస్ లో చేరిన సౌమ్యుడు, వివాదరహితుడు, నేతవర్గానికి చెందిన నాయకుడు ఎల్ రమణ పేరు తెరపైకి వస్తోంది.
ఎల్ రమణతో పాటు టీఆర్ఎస్ అవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న నేత గెల్లి శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా తెరపైకి వస్తోంది. ఒకరు తెలంగాణ టీడీపీ నుంచి వచ్చిన వలస నేత.. మరోకరు పార్టీలో పునాదుల నుంచి పనిచేస్తున్న నేత. కరీంనగర్ జిల్లాతో పాటు ఉభయ తెలుగురాష్ట్రాల్లో తనకంటూ మంచి గుర్తింపును సాధించుకున్నా.. హుజూరాబాద్ నియోజకవర్గానికి మాత్రం ఎల్ రమణ స్థానికేతర నేతే. కాగా, గెల్లి శ్రీనివాస్ యాదవ్ స్థానిక నాయకుడు. అందులోనూ బలమున్న యాదవ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి. దీంతో ఇరువురిలో ఎవరికి టికెట్ లభిస్తుందనే అంశమై ఆసక్తికర చర్చ సాగుతోంది.
ఇదిలావుండగా, పార్టీ నేతల్లో అంతర్గతంగా కొనసాగుతున్న చర్చకు ఇకపై ఫుల్ స్టాప్ పెట్టాలని పార్టీలోకి వచ్చిన నేతలకు టికె్ట్ ఇవ్వకుండా పార్టీలో ఏళ్లుగా కోనసాగుతున్న నేతలకే టికెట్ ఇవ్వాలని కూడా పార్టీ అధిష్టానం భావిస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఉపఎన్నికల తరుణంలో ఎలాంటి విమర్శలకు తావులేకుండా.. పార్టీ నేతలను అందరినీ కలుపుకుని పోవడంలోనూ పార్టీలో కొనసాగుతున్న నేతలు దోహదం చేస్తారని కూడా అదిష్టానం బేరిజు వేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో హుజూరాబాద్ ఉప ఎన్నికల బరిలో పార్టీ విద్యార్థి విభాగం నేత గెల్లి శ్రీనివాస్ యాదవ్ కు కేటాయించే అవకాశాలే ఎక్కువగా వున్నాయని టాక్ వినిపిస్తోంది.
(And get your daily news straight to your inbox)
Sep 22 | కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వం తమ హయాంలో దేశంలో అభివృద్దిలో పురోగమిస్తోందని ప్రచారం చేసుకుంటున్న తరుణంలో బీజేపి పాలిత రాష్ట్రాలతో పాటు విపక్ష పార్టీల పాలనలోని రాష్ట్రాల్లోనూ స్థానిక ప్రజలు తమ ప్రాంతంలోని దుర్భర... Read more
Sep 07 | తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో కేవలం అవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి.. ప్రజల్లో నిగూఢమై ఉన్న బాధను తట్టిలేపడంలో సఫలీకృతమై.. 13 ఏళ్లలోనే తమ స్వప్నాన్ని సాకారం చేసుకుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర సాకరమైన... Read more
Sep 05 | టాలీవుడ్ యంగ్ హీరో, మంచు మోహన్ బాబు చిన్న తనయడు మంచు మనోజ్ రెండో పెళ్లి సిద్ధమయ్యాడా.? అంటే ఔనన్న సంకేతాలే కనబడుతున్నాయి. నిన్నమొన్నటి వరకు కేవలం పొలిటికల్ సర్కిళ్ల వరకు పరిమితమైన ఈ... Read more
Sep 01 | ప్రభుత్వ రంగ బ్యాంకు ఐడీబీఐ బ్యాంకులో వాటా విక్రయానికి కేంద్ర ప్రభుత్వం ఈ నెల ప్రాథమిక బిడ్లను ఆహ్వానించనుంది. ఈ విషయమై ఆర్బీఐతో చర్చలు చివరి దశకు చేరుకున్నాయని అధికారులు చెప్పారు. `ఇప్పటికీ కొన్ని... Read more
May 21 | రాష్ట్ర విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో తన పార్టీని బలపర్చేందుకు ప్రణాళికలు రచించిన పనవ్ కల్యాన్.. గత అసెంబ్లీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలలో కేవలం ఏపీకి మాత్రమే పరిమితం అయ్యారు. ఆ తరువాత... Read more