స్వాతంత్ర్యం వచ్చి 68 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. అంతెందుకు.. ఇతరుల బాగోగుల గురించి ఏమాత్రం పట్టించుకోకుండా కేవలం తాను మాత్రమే సుఖంగా వున్నానా.. లేదా..? అన్న స్వార్థంతోనే ప్రాణమున్న జీవిలా ప్రతిఒక్కరు జీవిస్తున్నారే కానీ.. ఈ దేశంలో మానవత్వానికి తావు లేకుండాపోయింది.
కానీ.. స్వాతంత్ర్యం రావడానికి ముందు పరిస్థితులు ఇలా వుండేవి కావు. ఆనాడు దేశంలో జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు ఎందరో మహానుభావులు ముందుకొచ్చి అమరులయ్యారు. తమ కడుపు నిండిందా లేదా అన్నది కాకుండా ఇతరుల క్షేమం గురించి ఆలోచించేవారు. బానిసలుగా బతుకుతున్నవారి స్వేచ్ఛకోసం, చీకటిలో మూలుగుతున్న జీవితాల్లో వెలుగులు నింపడం కోసం తమ జీవితాన్ని త్యజించారు. అటువంటివారిలో ‘సర్దార్ జమలాపురం కేశవరావు’ కూడా ఒకరు.
హైదరాబాదు రాష్ట్రానికి చెందిన కేశవరావు.. ప్రజల మనిషిగా, ప్రజల కోసం జీవిస్తూ, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో ధైర్య సాహసాలను నూరిపోయడమే ఆయన ప్రవృత్తిగా జీవించారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడైన ఈయన... తన కడుపు నిండిందా లేదా అన్నది పట్టించుకోకుండా ఎదుటివాడు తిన్నాడా లేదా అన్నదే నిత్యం ఆవేదన చెందేవారు. అందుకే ఆయన్ను అందరూ తెలంగాణ ‘సర్దార్’గా పిలుచుకుంటారు. ఈయన ఆంధ్ర ప్రదేశ్ కాంగ్రేస్ కమిటీ తొలి అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు చేపట్టారు కూడా!
జీవిత విశేషాలు :
1908 సెప్టెంబర్ 3న నిజాం సంస్థానంలో తూర్పు భాగాన వుండే ఖమ్మం(నాటి వరంగల్ జిల్లా)లోని ఎర్రుపాలెంలో జమలాపురం వెంకటరామారావు, వెంకటనరసమ్మ దంపతులకు తొలి సంతానంగా జమలాపురం కేశవరావు జన్మించారు. వీరిది సుసంపన్నమైన జమీందారీ వంశం. ఎర్రుపాలెంలో ప్రాథమిక విద్య అనంతరం, హైదరాబాద్లోని నిజాం కళాశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు.
స్వాతంత్ర్య సమరయోధుడిగా :
నిజాం పరిపాలనాకాలంలో ప్రజలందరూ వెట్టిచాకారి చేస్తూ అష్టకష్టాలకు గురయ్యేవారు. వారి కష్టాలను చూసి ఎవరూ జాలి చూపించేవారు కాదు. ఇంకా దారుణంగా హింసించేవారు. అలా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ జీవితం గడపుతున్న ప్రజలను చూసిన కేశవరావు ఒక్కసారిగా చలించిపోయారు. వారిపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టేందుకు, నిజాం నిరంకుశ పాలనా నుంచి విముక్తిం చేయడం కోసం కేశవరావు తెలంగాణ జిల్లాల్లో కేశవరావు కాలినడకన విస్తృతంగా పర్యటించారు. ఆ క్రమంలోనే భారత స్వాతంత్య్రోద్యమం పట్ల, గాంధీ సిద్ధాంతాల పట్ల కేశవరావు ఆకర్షితులయ్యారు.
1930లో విజయవాడలో జరిగిన సభలో ఈయనకు గాంధీతో పరిచయం ఏర్పడింది. అప్పుడు గాంధీ ఉపన్యాసాలకు ఉత్తేజితుడైన ఈయన.. ఆయన ఏర్పరచిన సిద్ధాంతాలను ఆచరించేవారు. అలాగే ఆంధ్రపితామహుడుగా పేరుగాంచిన మాడపాటి హనుమంతరావు ప్రారంభించిన గ్రంథాలయోద్యమాన్ని కేశవరావు తెలంగాణలోని ప్రతి పల్లెలోనూ ప్రచారం గావించారు. వయోజన విద్యకై రాత్రి పాఠశాలలు నడపడంలో ఈయన ముందుండేవారు. అణగారిన వర్గాల్లో చైతన్యాన్ని నింపడానికి ప్రత్యేక శ్రద్ధను కనపరిచేవారు. 1938లో ఆవిర్భవించిన తెలంగాణ స్టేట్ కాంగ్రెస్లో ఈయన ప్రముఖపాత్ర నిర్వహించారు. గోవిందరావు నానక్, జనార్దనరావు దేశాయ్, రావి నారాయణరెడ్డిలతో కలిసి నిషేధాజ్ఞలను ధిక్కరిస్తూ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 18 నెలల కఠిన కారాగార శిక్ష అనుభవించారు. 1942లో ‘క్విట్ ఇండియా’ ఉద్యమాన్ని తెలంగాణలో ఊరూరా ప్రచారం చేశారు.
1946లో మెదక్ జిల్లా కందిలో కేశవరావు అధ్యక్షతన జరిగిన 13వ ఆంధ్రమహాసభ సందర్భంగా నిర్వహించిన బ్రహ్మాండమైన ఊరేగింపు అందరినీ ఆకట్టుకుంది. 1947 ఆగస్టు 7న మధిరలో స్టేట్ కాంగ్రెస్ చేపట్టిన సత్యాగ్ర హం బాధ్యుడైన కేశవరావుకు ప్రభుత్వం రెండేళ్ల కారాగార శిక్ష విధించింది. నిజాం సంస్థానం దేశంలో విలీనమైన తరువాత, 1952లో కేశవరావు రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఇలా అలుపెరుగని నాయకుడిగా ప్రజల్లో చైతన్యం నింపుతూ ముందుకు సాగిన కేశవరావు... 45 ఏళ్ల ప్రాయంలోనే 1953 మార్చి 29న తుదిశ్వాస విడిచారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more