Nutan Prasad Biography | telugu famous comedians

Nutan prasad biography famous telugu co actor comedian

nutan prasad history, nutan prasad biography, nutan prasad life story, nutan prasad photos, nutan prasad comedian, nutan prasad wikipedia, nutan prasad photos

nutan prasad biography famous telugu co actor comedian : The Biography of telugu famous comedian nutan prasad who acted more than 350 films. he won nandi and ntr awards.

నూటొక్క జిల్లాల అందగాడిగా ప్రసిద్ధి చెందిన హాస్యనటుడు

Posted: 04/02/2015 03:30 PM IST
Nutan prasad biography famous telugu co actor comedian

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎందరో హాస్యనటులు వచ్చారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి తమవంతు ప్రయత్నాలు చేశారు. చాలామంది హాస్యనటులు తమ వృత్తిపట్ల సఫలీకృతమై మంచి పేరే గడించారు కానీ.. మరికొందరు మాత్రం ఇండస్ట్రీలో చిరకాల స్థాయిని ఏర్పరుచుకున్నారు. పరిశ్రమలోనే కాకుండా ప్రేక్షకుల గుండెల్లోనూ తమకంటూ ప్రత్యేక గుర్తింపును ఏర్పాటు చేసుకోగలిగారు. అటువంటివారిలో నూతన్ ప్రసాద్ ఒకరు. ఒక చిన్న పాత్ర ద్వారా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఈయన.. ప్రతినాయకుడు, ప్రముఖ హాస్యనటుడుగా ఎదిగారు. తనదైన శైలిలో పలికే సంభాషణలతో వైవిధ్యపాత్రల్లో నటించిన ఈయన.. వాటికి జీవం పోస్తూ హాస్యవన్నెలద్దారు.

జీవిత చరిత్ర :

1945 డిసెంబర్ 12న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాలోని కైకలూరులో నూతన్ ప్రసాద్ జన్మించారు. ఈయన అసలు పేరు తడినాధ వరప్రసాద్. సినిమాల్లో నటించాలన్న ఆశతో ఈయన హైదరాబాదులో చేస్తున్న తన ప్రభుత్వోద్యోగానికి రాజీనామా చేసి, పరిశ్రమవైపు అడుగులు వేశారు. ఈ క్రమంలోనే ఆయన 1973లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన ‘అందాలరాముడు’ సినిమాతో చిత్రరంగ ప్రవేశము చేశారు. ఆ తరువాత ఈయన రెండుమూడు చిత్రాల్లో నటించినా... ఈయనకు తొలి గుర్తింపు మాత్రం ‘ముత్యాలముగ్గు’ చిత్రంలో రావుగోపాలరావుతోపాటు ప్రతినాయకునిగా నటించడముతో వచ్చింది. ఆ సినిమా ఘనవిజయం సాధించిడంతో ఆయన మరిన్ని అవకాశాలు వరించాయి.

నూతన్ ప్రసాద్ సైతాన్ గా నటించిన ‘రాజాధిరాజు’ చిత్రంతో ఈయన నటనా జీవితం తారాస్థాయికి చేరుకొన్నది. 1984లో ‘సుందరి సుబ్బారావు’ చిత్రంలో నటనకు ఆయనకు నంది పురస్కారం లభించింది. 2005లో ఎన్టీఆర్ పురస్కారం లభించింది. ఈయన అనేక చిత్రాలలో అగ్ర నటులైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఘట్టమనేని కృష్ణ, చిరంజీవి సరసన హాస్య, ప్రతినాయక, సహాయ మొదలైన విభిన్న పాత్రలు పోషించారు. దాదాపు 365 సినిమాల్లో నటించిన ఈయన.. ఒక చిత్రంలో కథానాయకునిగా కూడా నటించి.. ప్రేక్షకులను మెప్పించారు.

ఈయన సినీకెరీర్ పై గాయం ప్రభావం :

'బామ్మమాట బంగారుబాట' అనే సినిమా చిత్రీకరణ సమయంలో అనుకోకుండా ఓ ప్రమాదం జరిగింది. అందులో గాయపడిన నూతన ప్రసాద్.. కొంతకాలం నటజీవితామనికి దూరంగా వుండాల్సి వచ్చింది. కొంతకాలం తర్వాత తిరిగి కోలుకుని నటించడం మొదలెట్టారు కానీ.. కాళ్ళు అచేతనావస్థలో ఉండిపోయిన కారణంగా పరిమితమైన పాత్రలనే పోషించగలిగారు. ‘దేశం చాలా క్లిష్టపరిస్థితిలో ఉంది’, ‘నూటొక్క జిల్లాల అందగాడిని’ అని ఈయన చెప్పిన డైలాగులు ప్రేక్షకాదరణ పొందాయి. ఆ డైలాగుతోనే ఈయనక నూటొక్కజిల్లాల అందగాడిగా అనే పేరు వచ్చింది. ఈయన 2011 మార్చి 30న బుధవారం హైదరాబాదులో అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nutan prasad biography  telugu famous comedians  tollywood  

Other Articles