The Biography Of Edida Nageswara Rao Who Produce Excellent Movies Poornodaya Movie Creations | Telugu Famous Producers | Tollywood Industry

Edida nageswara rao biography telugu famous producer tollywood industry

Edida Nageswara Rao history, Edida Nageswara Rao biography, Edida Nageswara Rao life story, Edida Nageswara Rao filmography, Edida Nageswara Rao updates, Edida Nageswara Rao news, Edida Nageswara Rao death news, Edida Nageswara Rao, telugu famous producers, telugu producers list, tollywood industry, swathi muthyam movie

Edida Nageswara Rao Biography Telugu Famous Producer Tollywood Industry : The Biography Of Edida Nageswara Rao Who Produce Excellent Movies Poornodaya Movie Creations.

స్ఫూర్తిదాయకం.. ఏడిద నాగేశ్వరరావు ప్రస్థానం..

Posted: 10/05/2015 05:31 PM IST
Edida nageswara rao biography telugu famous producer tollywood industry

ఏడిద నాగేశ్వరరావు.. ఓ సాధారణ స్థాయి నుంచి ఉన్నత ఆశయాలు నిర్మించగల ప్రముఖ నిర్మాతగా ఎదిగిన గొప్ప వ్యక్తి. నాటకరంగం నుంచి మొదలైన ఈయన ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులు వచ్చినప్పటికీ పట్టుదలతో ముందుకు సాగారు. అదే ఆయన్ను అందనంత స్థాయికి తీసుకెళ్లింది. ఆ పట్టుదలే ఆయన్ను నాణ్యమైన నిర్మాతగా చిత్రపరిశ్రమలో స్థానం కల్పించింది. నిజానికి.. వెండితెరపై కనిపించాలని ఎన్నో ఆశయాలతో ఇండిస్ట్రీలో ఆయన అడుగుపెడితే.. పరిస్థితులు ఆయన్ను మరో దారి చూపించాయి. ఓ ఉన్నతమైన నిర్మాతగా ఎదిగేలా చేశాయి.

జీవిత విశేషాలు :

1934 ఏప్రిల్ 24వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని కొత్తపేటలో సత్తిరాజునాయుడు, పాపలక్ష్మి దంపతులకు ఏడిద నాగేశ్వరరావు జన్మించారు. పాఠశాలలో చదువుకునే రోజుల్లో ఈయనకు నాటకాలంటే ఎంతో మక్కువ. ఆ సమయంలో ఓ నాటకంలో ఆయన వేసిన ‘ఆడవేషం’ ఆయనలో దాగివున్న రంగస్థల రుచిని చూపించింది. ఆ తర్వాత ఆయన ఎన్నో నాటకాల్లో నటించగా.. వాటికి అవార్డులు వరించాయి.

ప్రస్థానం :

ఎన్నో నాటకాల్లో నటించిన ఏడిద నాగేశ్వరరావుకు ఓ సందర్భంలో నిర్మాత వి.బి. రాజేంద్రప్రసాద్ నుంచి ‘అన్నపూర్ణ’లో నటించాలని పిలుపు వచ్చింది. ఆ పిలుపుతో ఎంతో సంతోషించిన ఆయన వెంటనే మద్రాస్ కు పయనమయ్యారు. అయితే.. ఆయనకు అవకాశం రాలేదు. కాస్త నిరాశకు గురైన ఆయన తిరిగి ఊరికి వెళ్లాలని అనుకున్నారు కానీ అవమానంగా వుంటుందని భావించారు. చిత్రపరిశ్రమలో ఏదైనా సాధించాలని నిర్ణయించుకున్నారు. ఆ పట్టుదలతో పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఎన్నో కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరగా డబ్బింగ్ ఆర్టిస్టుగా అవకాశం రాగా.. దాన్ని సద్వినియోగం చేసుకున్నారు. ‘పార్వతీ కళ్యాణం’లోని శివుడి పాత్రకి డబ్బింగ్ చెప్పిన ఆయనకు ఆ తర్వాత మరెన్నో అవకాశాలు వచ్చాయి. ఈ క్రమంలోనే నటుడిగా కూడా ఆఫర్లు వరించాయి. 1962 నుంచి 1974 మధ్య కాలంలో 30 సినిమాల్లో నటించగా.. 100 చిత్రాలకు పైగా డబ్బింగ్ చెప్పారు.

అలా సాగుతున్న ఏడిద జీవితంలో ఓ మలుపు తిరిగింది. కాకినాడకు చెందిన కొందరు వ్యక్తులు ‘గీతాకృష్ణ కంబైన్స్’ అనే సంస్థని స్థాపించి.. నిర్మాణ సారథ్య బాధ్యతల్ని ఏడిదకు అప్పగించారు. అలా నిర్మాణ బాధ్యతల్ని చేపట్టిన ఆయన దర్శకుడు కె.విశ్వనాథ్ తో కలిసి ‘సిరి సిరి మువ్వ’ సినిమాని నిర్మించారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించి లాభాలు తెచ్చి పెట్టడంతో.. ఏడిద తన బంధువులతో కలిసి ‘పూర్ణోదయ మూవీ క్రియేషన్స్’ స్థాపించారు. తొలి ప్రయత్నంలో భాగంగా ‘తాయారమ్మ బంగారయ్య’ సినిమాను నిర్మించగా.. అది అద్భుతమైన విజయం సాధించడంతోపాటు హిందీ, తమిళ భాషల్లోనూ రీమేక్ అయ్యింది. తొలి ప్రయత్నంలోనే నిర్మాతగా విజయం సాధించిన ఆయనకు మరిన్ని చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించేలా ఆత్మవిశ్వాసం పెంచింది. మూడో సినిమాగా ‘శంకరాభరణం’ నిర్మించిన ఈయనకు.. తర్వాత వెనుతిరిగి చూసుకునే అవకాశం రాలేదు. ‘స్వయం కృషి’, ‘సాగర సంగమం’, ‘స్వాతిముత్యం’, ‘సితార’ వంటి ఉన్నత అంశాలతో కూడిన చిత్రాలతోపాటు మరెన్నో సినిమాలను నిర్మించారు. ఈయన చివరగా నిర్మించిన చిత్రం ‘ఆపద్భాందవుడు’.

నిర్మాతగా చిత్రపరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్న ఏడిద నాగేశ్వరరావు.. తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి కార్యదర్శిగా సేవలందించారు. నంది పురస్కారాల కమిటీ అధ్యక్షుడిగా, జాతీయ పురస్కారాల కమిటీలో సభ్యుడిగా కూడా పని చేశారు. ఆయన నిర్మించిన చిత్రాలన్నీ జాతీయ స్థాయిలో పురస్కారాలు అందుకున్నాయి. ‘స్వాతిముత్యం’ తెలుగు నుంచి ఆస్కార్ నామినేషన్లకు ఎంపికైంది. చాలా సినిమాలకు వివిధ విభాగాల్లో నంది పురస్కారాలు వరించాయి. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ స్టార్ ఆస్పత్రిలో 04-10-2015 తేదీన తుది శ్వాస విడిచారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Edida Nageswara Rao  telugu famous producers  

Other Articles