మేఘనాధ్ సాహా.. భారతదేశానికి చెందిన సుప్రసిద్ధ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త. ఓ నిరుపేద కుటుంబంలో జన్మించిన ఈయన.. అంతర్జాతీయ స్థాయిలో ఒక గొప్ప శాస్త్రవేత్తగా ఎదిగిన ఈయన సక్సెస్ ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం. ఇతరుల సహకారం ఏమాత్రం లేకుండా కేవలం తన చదువుతో అందనంత ఎత్తుకు ఎదిగారు. ‘డబ్బులు లేకపోయినా చదువుతో ప్రపంచాన్ని జయించొచ్చు’ అన్న మాటకు నిదర్శనంగా నిలిచారు. సాంకేతిక పరిజ్ఞానం అంతంత మాత్రమే వున్న ఆ కాలంలోనూ తన మేధోశక్తితో నక్షత్రాల్లో జరిగే మార్పులు, ఉష్ణోగ్రత, పీడనం లాంటి ఎన్నో ధర్మాల్ని ఆవిష్కరించే సమీకరణాలను కనుగొని ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుకున్నారు.
జీవిత విశేషాలు :
1893 అక్టోబర్ 6వ తేదీన ప్రస్తుతం బంగ్లాదేశ్లో భాగమైన ఢాకాలోని సియోర్తలి గ్రామంలో మేఘనాథ్ సాహా ఓ నిరుపేద కుటుంబంలో జన్మించారు. చిన్న కిరాణా దుకాణం నడిపే తండ్రి ఆదాయం చాలకపోవడంతో ఆ కుటుంబం తరచు పస్తులతో గడిపేది. సాహాను బడి మానిపించి ఏదైనా పనిలో పెట్టడానికి తండ్రి ప్రయత్నించేవాడు. అయితే సాహా చురుకుదనాన్ని గమనించిన ఉపాధ్యాయులు తండ్రికి నచ్చచెప్పి దాతల సాయంతో ఓ బోర్డింగ్ స్కూలులో చేర్చారు. సాహా చక్కగా చదువుతూ స్కాలర్షిప్లు సాధించి పై చదవుల కోసం ఢాకా వెళ్లారు. అదే సమయంలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ ను విభజించినందుకు నిరసనగా.. గవర్నర్ తమ స్కూలును సందర్శిస్తున్న కార్యక్రమాన్ని సాహా తన స్నేహితులతో కలిసి బహిష్కరించి, డిస్మిస్ అయ్యారు. అనంతరం మరో స్కూల్లో చేరి అక్కడ కూడా స్కాలర్షిప్ సాధిస్తూ తన చదువును కొనసాగించారు.
ఎమ్మెస్సీ తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వక పోవడంతో ఉపాధి కోసం ట్యూషన్లు జీవితాన్నొ కొనసాగించారు. ఆ సమయంలో పరిశోధనల్లో కూడా నిమగ్నమయ్యారు. కొన్నాళ్ల తర్వాత కలకత్తాలో అధ్యాపకుడిగా చేరిన ఆయన ఖగోళ భౌతిక శాస్త్రంపై పట్టు సాధించారు. గాజు పట్టకం ద్వారా సూర్యకాంతి ప్రసరించినప్పుడు ‘వర్ణపటం’ (Spectrum) ఎందుకు ఏర్పడుతుందో చెబుతూ.. ‘అయనీకరణ’ సూత్రాన్ని ప్రతిపాదించారు. దీని వల్ల సూర్యుని ఉష్ణోగ్రతలు, సౌష్టవం, సంయోజనం లాంటి ధర్మాలను విశ్లేషించారు. ఫెలో ఆఫ్ రాయల్ సొసైటీ (లండన్)గా ఎన్నికయ్యారు. అలహాబాదు యూనివర్శిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్గా వర్ణపట విజ్ఞానం (Spectroscopy), అయనావరణం (Ionosphere)పై పరిశోధనలు చేశారు. సూర్యకిరణాల బరువును, వత్తిడిని కనిపెట్టే పరికరాన్ని రూపొందించారు. ఇంకా పురాతన శిలలు, సూర్యుని నుంచి వెలువడే రేడియో తరంగాలు, రేడియో ధార్మికతలపై కూడా పరిశోధనలు చేశారు. కలకత్తా విశ్వవిద్యాలయంలో న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగాన్ని ప్రారంభించారు. దేశంలో పరమాణు కణాల త్వరణాన్ని పెంచే తొలి యాక్సిలరేటర్ ఆయన పర్యవేక్షణలోనే నిర్మితమైంది.
1923లో సాహా అలహాబాదు విశ్వవిద్యాలయంలో ఆచార్యుడయ్యారు. అనంతరం 1927లో రాయల్ సొసైటీ లో సభ్యత్వం లభించింది. 1938లో కలకత్తా విశ్వవిద్యాలయానికి వెళ్ళారు. అక్కడ కలకత్తా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ ను నెలకొల్పి దానికి గౌరవాధ్యక్షుడిగా ఉన్నారు. ఇలా ఖగోళ శాస్త్రంలో విశేష పరిశోధనలు చేసి, ఎన్నో గౌరవాలు అందుకున్న ఈయన.. 1956 ఫిబ్రవరి 16వ తేదీన తుదిశ్వాస విడిచారు.
(And get your daily news straight to your inbox)
Mar 10 | స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన ఈ అఖండ భారతావనిలో ఎదుటివాడి గురించి ఆలోచించేవాడు ఎవ్వడూలేడు. కళ్లెదుటే నేరాలు జరుగుతున్నా వాటిని ఎదుర్కోవడానికి ఎవ్వరూ సాహసించరు. ఎవరికి అన్యాయం జరిగినా.. మనం జోక్యం చేసుకుంటే... Read more
Jan 19 | పేద, పెద్ద అన్న తారతమ్యాలు లేకుండా ఆకలి అన్న అర్తనాధం వినిపించనంతనే వారిని దరిచేర్చుకుని కడుపారా అన్నంపెట్టి మహర్షి, సమర్ధసద్గురు, అవదూత, భగవాన్ శ్రీ కాశీనాయన. క్షుద్భాదను ఎవరూ అనుభవించరాదని ప్రజలకు హితబోధ చేశారు... Read more
Oct 02 | తెలంగాణ ఉద్యమానికి ఆది గురువు. తెలంగాణ ఉద్యమంలో క్రీయాశీలక పాత్ర పోషించిన తెలంగాణ గాంధీ, బోళతనానికి నిలువుటద్దం కొండా లక్ష్మణ్ బాపూజీ. తన జీవితమంతా తెలంగాణ పక్షమే వహించారు. చివరి నిముషం వరకు తెలంగాణ... Read more
Jun 21 | తెలంగాణ సిద్ధాంతకర్త, జాతిపిత ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్.. ప్రత్యేక రాష్ట్ర అవిర్భావానికి వేసిన ప్రణాళికలు.. ఉద్యమానికి ఇచ్చిన సూచనలు.. అసలు తెలంగాణ ఎందుకు అన్న ప్రశ్నలకు తెలంగాణవాదులందరూ బుదలిచ్చే విధంగా.. రాసిన పుస్తకాలు దోహదం... Read more
Jan 23 | భారత స్వతంత్ర్య పోరాటంలో ఆయన ఓ విప్లవాత్మక నాయకుడు. శాంతమంత్రి జపిస్తూ చేతులు కట్టుకుని కూర్చుంటే.. కాలయాపన చేస్తూ పబ్బం గడుపుకునే బ్రీటీష్ వారికి.. స్వతంత్ర్యం చేకూరే దశలో తిరుగుబాటు బావుటా రుచి చూపించిన... Read more