Titicaca uros groups artifial island

titicaca islands, titicaca artificial islands, titicaca villagers, titicaca lake, peru bolivia border, titicaca lake people, titicaca water flow villagers

titicaca uros groups artifial island

నీటిపై తేలియాడుతున్న అద్భుత గ్రామాలు...

Posted: 11/08/2014 04:27 PM IST
Titicaca uros groups artifial island

సాధారణంగా ఒక ఇంటిని నిర్మించుకోవాలంటే ముందుగా ఒక స్థలాన్ని ఎంచుకోవాలి. ఆ తర్వాత పునాది వేయాలి, ఇటుకలు, ఉక్కు, సిమెంటు, ఇసుక, కూలీలు... అబ్బో చెప్పుకుంటూపోతే ఒక ఇంటినే నిర్మించేయొచ్చులెండి. అంటే.. ఇల్లు నిర్మించడం అంత సామాన్య విషయం కాదన్నమాట! అయితే పెరులోని తితికాకా అనే గ్రామవాసులు మాత్రం ఇవేమీ లేకుండా అద్భుతమైన ఇళ్లను నిర్మించేసుకున్నారు. స్థానికంగా లభించే ఎండిన గడ్డి, కట్టెలు, ఇతర సామాగ్రీలతో వాళ్లు ఏకంగా నీటిమీదే ఒక గ్రామాన్ని నిర్మించేసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో దీవులు వున్నప్పటికీ.. వీళ్లు మాత్రం వాటిమీద తన జీవన విధానాన్ని సాగించకుండా ఇలా నీటి మీద నిర్మించుకున్న గ్రామాలే మీద బతుకుతున్నారు.


Simple Picture Slideshow:
Could not find folder /home/teluguwi/public_html/images/slideshows/TiticacaIsland

పెరు-బొలివియా సరిహద్దులోని అండెస్ ప్రాంతంలో వున్న దక్షిణమెరికాలో పెద్ద సరస్సు అయిన తితికాకలో అక్కడి యూరోస్ జాతికి చెందిన గ్రామవాసులు ఇలా నిర్మించుకోవడం జరిగింది. 44 కుటుంబాలు కలిసి తమకు అనుకూలంగా వుండే విధంగా కొన్ని కృత్రిమ దీవులను గ్రామాలను ఏర్పాటు చేసుకున్నారు. శత్రువుల దాడినుంచి లేదా ఇతర సమస్యల నుంచి తమనుతాము కాపాడుకోవడం కోసమే ఈ విధంగా నీటిపై తేలుతున్న గ్రామాలను నిర్మించుకోవడం జరిగిందని వాటి రూపకర్తలు వెల్లడిస్తున్నారు. ఏదైతేనేం.. ఇవి మాత్రం పర్యాటకుల్ని తెగ ఆకర్షించేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ గ్రామాలకు ఇంటర్నెట్ లో అనూహ్య స్పందన లభిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles