సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు అరుదు. ఇతర రాష్ట్రాలతో సరిహద్దులు కలిగిన జిల్లాల్లో ఇలాంటి వారు మనకు తారసపడతారు. కానీ ఏకంగా ఐదు బాషలు వచ్చిన వారు వుంటారా.? మాట్లాడే వారిన చూశారా అంటే చాలా అరుదనే చెప్పవచ్చు. కనీసం ఒక్క జిల్లాలో మొత్తంగా ఐదు బాషలు మాట్లేడే వారుంటారా.? అంటే అది కూడా అరుదే. కానీ ప్రకృతి సొంత రాష్ట్రంగా బాసిల్లుతున్న కేరళలో.. ఉత్తర కేరళ ప్రాంతంలోని కాసరగొడ్లో మాత్రం ఏకంగా ఏడు భాషల్లో పరిచయం ఉండటం గమనార్హం.
కర్ణాటక మంగళూరుకు దిగువన కేరళలో ఉత్తరభాగంలో కాసర్గొడ్ ఉంటుంది. మళయాళం, కన్నడం, తులు, మరాఠీ, కొంకణి,ఉర్దూ, బ్యారీ.. తదితర భాషలను మాట్లాడుతారు. పాలనాపరంగా మలయాళంను ఉపయోగించినా కర్ణాటకను ఆనుకొని ఉండటంతో కన్నడం ప్రభావం అధికంగా ఉంటుంది. కర్ణాటకలోని దక్షిణ కన్నడ, ఉడుపిలతో పాటు కాసర్గొడ్లను తులునాడుగా వ్యవహరిస్తారు. ఈ ప్రాంతంలోని తీరభూముల్లో తులు భాష మాట్లాడతారు. దాదాపు 30 లక్షల మంది ఈ భాషను మాట్లాడుతారని అంచనా. బ్యారీ ముస్లింలు బ్యారీ భాషను వినియోగిస్తారు.
భిన్న సంస్కృతులు
కేరళలో ఈ ప్రాంతం విభిన్నమైన సంస్కృతిని కలిగివుంటుంది. కేరళ ఉత్తర భాగంలో తెయ్యం సంగీతరూపకం కాగా ఇక్కడ యక్షగానం ఎక్కువగా ప్రదర్శితమవుతుంటుంది. రాష్ట్రాల పునర్విభజన తరువాత ఇక్కడి పలు ప్రాంతాలను కర్ణాటకకు ఇవ్వాలని మహాజన్ కమిటీ సూచించింది. 1984లో మలబార్ జిల్లాలోని కాసర్గొడ్ తాలుకాను జిల్లాగా ఏర్పాటుచేశారు. ఈ ఏడు భాషల్లోనూ సాహిత్య సమావేశాలు జరుగుతుండటం విశేషం. జిల్లామీదుగా పశ్చిమ కనుమలు వెళుతాయి. రాణిపురం సమీపంలోని పర్వతాలు ట్రెక్కింగ్‌కు అనుకూలంగా ఉంటాయి. తీరంలోని బెకల్ కోట చారిత్రక కట్టడం. ప్రసిద్దమైన అనంతపుర సరస్సు ఆలయం ఇక్కడే ఉంది. ఈ సరస్సులో ఒక మొసలి శ్రీ అనంతపద్మనాభునికి సేవచేయడం విశేషం.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more
Dec 29 | స్నానాలు అచరించడం అంటే స్నానం చేయడమనే అర్థం వచ్చినా.. స్నానానికి ప్రాధాన్యత ఎంతో వుంది. స్నానాలు ఎలా చేయాలి, ఎంత సేపు చేయాలి, ఎప్పుడు చేయాలి.. ఏ నీళ్లతో చేయాలి.. ఎక్కడ స్నానాలు చేయడం... Read more