Chaya Someshwara Temple Mystery పచ్చల ఛాయా సోమేశ్వరాలయం - మర్మం ..

Chaya someshwara temple mystery

Chaya Someswara Temple, Mystery, Shadow, Shiva Lingam, Lord Shiva, Ancient Temples

Chaya Someswara Temple is the one of the ancient temple of Lord Shiva. Explore the mystery of the shadow in this temple

పచ్చల ఛాయా సోమేశ్వరాలయం - మర్మం ..

Posted: 11/14/2019 02:17 PM IST
Chaya someshwara temple mystery

పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి ఇరు అక్షరాలా కలయిక .. కానీ దాని పరవశం మాత్రం మూడక్షరాల జీవితాన్ని శాసిస్తుంది.. కాల ప్రమేయం ఎన్నో మార్పులు ,మానవ నవీనతత్వా ఆలోచనలు ..నమ్మకం అపనమ్మకం.. వీటి నడుమ మూఢ నమ్మకం అన్ని ఒకటి కొత్తగా మన ఆలోచనలను చెరిపివేస్తుంది.. ..నేడు మీ నమ్మకానికి మీ అపనమ్మకానికి ఒక అడ్డుకట్ట ఈ గుడి నేపథ్యం.. అంత ప్రకృతి వైపరీత్యాల కారక అంశమే నేటి ఈ కోవెల సారాంశం , ప్రాచీనా యుగం నుండి నేటి మేటి కలియుగ అంతం వరకు నడిచిన ఈ కోవెల గొప్పతనం అటువంటిది.. ఈ ఆలయాల ప్రసిద్ధి ఒక ఆలయానికే పరిమితం కాదు.. చుట్టూ ఉన్న ప్రాంతాలను కూడా ప్రభావితం చేస్తుంది..

దైవం మూడక్షరాలు పిలవడానికి ఎన్నో నామాలు ..చుడానికి ఎన్నో రూపాలు ..చేసే కార్యాలు మరెన్నో.. వీటన్నిటి అలజడి మన మదిలో .. ఐన ఒక భగవంతుడికి ఎన్నో ఆలయ ప్రాంగణాలు .. ఆ దైవ చింతకై ఎన్నో ఆర్భాటాలు.. మరెన్నో తొక్కిసలాటలు..

ఈ ఛాయా సోమేశ్వరాలయానికి ఒక విచిత్ర స్వభావం ఉంది.. వచ్చిన భక్త జనులను తన లోకి ఇముడ్చుకుంటుంది . పదే పదే తన వద్దకు రాబట్టుకుంటుంది.. . ఈ కోవేల లోని లింగం పై ఎప్పుడు ఒక నీడ మనకు కనపడుతుంది.. అది ఎలా వచ్చింది అంటే ఎవరి దగ్గర సరైన సమాధానం లేదు.. ఇలాంటి సమాధానం లేని ప్రశ్నలా వల్లనే దైవము ఉందనే ఆలోచన మన మదిలో కదలాడుతుంది.. ..

వీటన్నిటికీ మాత్రం సమాధానం మాత్రం మన దైవమే .. అయన మాత్రం సమాధానం ఇవ్వరు,,అయినా ఎంతో పిచ్చిగా అయన భక్తి పారవశ్యంలో మునిగి తేలే ఈ ప్రజలకు ఇదొక అరుదైన సంఘటన.. మరియు అబ్బురపరించే వింత.. .. అక్షరాలన్నీ పోగేసి పదాలుగా మలుస్తారేమో గాని రెండక్షరాల దైవాన్ని మాత్రం వేరు వేరు మతాల వారు కలసి కొలవలేరు .

ఏది ఏమైనా దైవం మాత్రం మనకు ఒక దైర్యం మరియు మన మానవ మనుగడకు ఒక నినాదం గా మన మంచి చెడ్డులకు

ఒక అండ దండాగా మనకు ఉంటారు .. ఎన్నో దేవాలయాలు మన తెలుగు నట కొలువైయ్యాయి అందు ఏది ప్రముఖమైనది అంటే మన నిపుణులే సరిగా సమాధానం చెప్పలేరు ఇక మనము మాములు జనం అసలు ఆ ప్రస్తావనే అనవసరం .. భక్తుల రద్దీని అంచనా వేసి కోలుదాం అన్న అది కూడా చేయలేని పరిస్థితి ..

మన భాగ్య నగరానికి కి దగరలో ఉన్న ఒక పురాతన దేవాలయ ప్రసిద్ధి, కీర్తి ప్రతిష్టలు తెలుసుకుందాం.. నల్లగొండ ప్రాంతాన్ని అనుకోని ఉన్న పానగల్ లో ఒక పురాతన ప్రాచీన ఆలయం చుపురులను ఆకట్టుకుంటుంది .. అంతే కాకా శాస్త్రవేత్తలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.. అంతగా ఏదో మహిమ దానిలో దాగి ఉంది.. పానగల్ లో ఆలయంతో పాటు ఉదయ సముద్రం ఎంతో మరెంతో ప్రసిద్ధి..అక్కడ గంగ పుత్రులకు మంచి ఉపాధి కలిపిస్తుంది.. ఆ కోవెల అలా ఎంతో ఉపయోగ పడుతుంది మన భక్త ప్రజలకు .. ఇదిలా ఉంటె ఆ ఆలయంలోని గొప్పతనం ఏమిటి అంటే ఆ ఆలయం లోని శివుడి లింగం పై ఛాయా నీడ ప్రతిబింబిస్తుంది..

చాయ్ సోమేశ్వలయాన్ని త్రికూటాలయం అని కూడా పిలుస్తారు..ఇ ది శైవ మతస్థులకు అతి అంత ప్రీతికరమైనది.. అసలు ఈ గుడి లో ప్రత్యేకం ఏమిటి అంటే శివ లింగం పై నీడ పడుతుంది అది అసలు ఎలా పడుతుందో ఎవరికీ తెలియదు .. ఉదయం 6 గంటలు నుండి ప్రాతఃకాలం 6 గంటల సమయం వరకు మనం దీని గమనించవచ్చు.. ఎప్పుడూ శివ లింగం ఛాయా తో కప్పపడి ఉంటుంది.. అందుకే దానికి ఆ పేరు వచ్చింది.. అసలు ఆ నీడా పడడానికి అవకాశమే లేదు ఎలా పడుతుందో ఎవరికీ అర్థంకాదు ఎందుకంటే అంత ఆలా కప్పపడిఉంటుంది..

Chaya Someswara Temple Mystery

శాస్త్రవేత్తలు ఎన్నో సంవత్సలుఁగా పరిశోధనలు చేస్తున్నారు ఈ మర్మం తెలుసుకోవాలని.. కానీ ఆ శివుడు మనకు ఆ భాగ్యం కలిపివటం లేదు..తన చిదంబర రహస్యాన్ని తనలోనే దాచుకుంటున్నారు.. ఇలా ఆశ్చర్య విడ్డురా లను పక్కన పెడితే పక్కన ఉండే ఉదయ సముద్రం ఎంతో ఆహ్లాద భరిత వాతావరణ కావ్యాన్ని రాసె రాతలు పదాలను, వినే చెవులకు ఏకాగ్రత, కదిలే కాలానికి ఆతురత పెంచుతాయి..

ధరిత్రి మొత్తం నిండియున్నది శివమ్.. పేరులోనే మూడు త్రిలోకనందుడు తన మూడు కన్నుల సైగలతో ప్రపంచాన్ని శాసించే శివమ్.. ఆ కోవలల్లో కొలువై యున్నారు,,

కోరిన కోరికలను విన్న వెంటనే ఆలోచింపక భక్త జనులను సంతోష పర్చగలిగే శివమ్ .. ఆనాటి కట్టడాలు..ఇంకా ఇప్పటికి చెక్కుచెదరని ఆలయా స్థావరాలు ఇవన్నీ ఒక నమ్మలేని అనుభూతులను .. మనల్ని ఏదో ఒక ఆలోచన స్పృతిలో పడవేస్తుంది..

ఇంతలా మనల్ని ఆకట్టుకుంటున్న ఈ కోవెల మర్మం మాత్రం మన యుగం ఎరుగదు.. కట్టిన మహనీయులు లేరు.. కోవెలలో కొలువైన శివమ్ నుండే తెలుసుకోగలం.. ఆ దైవ ఆలోచన ఎలా ఉందో మనకు తెలియని ఈ మర్మ ఛేదన ఎలా విడుస్తారో మన మానవాళి తెలుసుకోవాలి..

ఓం శివమ్..
శివమ్ శివమ్..
శంభో శివ శంకర..
జగతః ఆరాధన శివమ్..
శైవ మత శివమ్..

శ్రీవల్లి..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chaya Someswara Temple  Mystery  Lord Shiva  Ancient Temples  

Other Articles