ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అద్భుతకట్టడాలుగా పేరొందినవన్నీ మానవ నిర్మితాలే! ఆనాడు ఎంతోమంది శ్రామికులు ఎన్నోకష్టాలు ఎదుర్కొంటూ అద్భుతమైన భారీ కట్టడాలను ఎన్నో నిర్మించారు. సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన నేటి కట్టడాలకంటే అవి ఎంతో బలమైనవిగా, ఆకర్షణీయంగా వున్న నేపథ్యంలో వాటిని మానవ అద్భుతనిర్మాణాలను వర్ణించడం జరుగుతోంది. ఇతర దేశాల్లో వున్న వాటికంటే భారతదేశంలో పురాతన కాలానికి చెందిన కట్టడాలు లెక్కలేనన్నీ వున్నాయి. అటువంటిలో ఈ ‘బాహుబలి’ విగ్రహం ఒకటి! ఈయన పూర్తిపేరు గోమటేశ్వర బాహుబలి. జైనమత ప్రబోధకుడు. ఆనాడు ఈయన అందించిన సేవలకుగాను అప్పటి ప్రజలు ప్రత్యేకంగా ఒక విగ్రహాన్ని నిర్మించారు. ఇప్పుడా విగ్రహం భారతదేశంలో వున్న ఏడు అద్భుత విగ్రహాల్లో ఒకటిగా స్థానం కల్పించుకుంది.
విగ్రహ విశేషాలు :
1. క్రీ.శ. 983 ప్రాంతంలో గంగా రాజైన రాచమల్ల (రాచమల్ల సత్యవాక్ IV క్రీ.శ.975-986)కు మంత్రి అయిన చాముండరాయ కర్నాటక రాష్ట్రంలోని శ్రావణబెలగోల పట్టణానికి దగ్గర్లోని చంద్రగిరి కొండ మీద నిర్మించారు. ఈ విగ్రహం ఒక తామరపుష్పంపై నిల్చి ఉంటుంది. తలభాగం నుంచి తొడలప్రాంతం వరకు ఎటువంటి ఆధారం లేకుండా వున్న ఈ విగ్రహం 17.8 మీటర్ల పొడవు వుండి.. విగ్రహ ముఖం 6.5 ft m పరిమాణంలో ఉంటుంది. జైన ఆచారం ప్రకారం ఈ విగ్రహం పూర్తి నగ్నంగా నిర్మించడం జరిగింది. తెల్లటి గ్రానైట్ ద్వారా ఈ మహావిగ్రహాన్ని ఆవిష్కరించారు.
2. ఈ విగ్రహం గొప్ప మతసంబంధమైన సంకేతంగాను గుర్తింపు పొందింది. జైనమతంలో మొదటగా మోక్షం (పుట్టుక, మరణం అనే చక్రబంధం నుంచి విముక్తి) పొందింది బాహుబలియేనని జైనులు విశ్వసించడం వల్లే ఈ విగ్రహానికి మంచి పేరొచ్చింది. ఇది ఎంత ఎత్తుగా వుంటుందంటే.. దాదాపు 30 కి.మీ. దూరంనుంచి చూసినా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. చక్కటి శరీర సౌష్టవం, ఏకశిల పరిమాణం, కళానైపుణ్యం, హస్త నైపుణ్యాల మేలు కలయికలాంటి అంశాల కారణంగా మధ్యయుగ కర్నాటక శిల్పకళకు సంబంధించి ఈ విగ్రహం ఒక విశిష్ట సాధనగా పేరుగాంచింది. అంతేకాదు.. అతిపెద్ద ఏకశిలా విగ్రహంగానూ ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సాధించింది.
మరికొన్ని విషయాలు :
గోమటేశ్వర విగ్రహమున్న ప్రదేశమంలో చుట్టుపక్కల కూడా జైనమతం, జైన తీర్థంకరులకు సంబంధించిన అనేక విగ్రహాలు నిండి వుంటాయి. ఇదిలావుండగా.. ప్రతి 12 సంవత్సరాలకోసారి వేలాదిమంది భక్తులు ఈ ప్రదేశానికి చేరుకుని ‘‘మహామస్టకాభిషేకం’’ నిర్వహిస్తారు. ఎంతో బ్రహ్మాండమైన రీతిలో నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగంగా వేయి సంవత్సరాల పురాతనమైన గోమటేశ్వర విగ్రహాన్ని పాలు, పెరుగు, నెయ్యి, కుంకుమపువ్వు, బంగారు నాణేలతో అభిషేకిస్తారు. ఈ రకమైన అభిషేకం చివరిసారిగా 2006 ఫిబ్రవరిలో నిర్వహించారు. మళ్లీ 12 ఏళ్ల తర్వాత అంటే.. 2018లో ఈ అభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more