పాపికొండలు... భారతదేశంలోని పర్యాటక ప్రాంతాలన్నింటిలో ఎంతో భిన్నమైనది. ఇతర ప్రదేశాల్లో ఏదో ఒక లోటు వుండవచ్చు కానీ.. ఈ పాపికొండల్లో అటువంటి అనుభవాలు అస్సలు ఎదురుకావు. పర్యాటకప్రాంతాల్లోకెల్లా దీనిని ప్రశాంతమైన, సుందరమైన, రమణీయమైన, ఆహ్లాదకరమైన ప్రదేశంగా అభివర్ణిస్తారు. ఇక్కడి ఇక్కడి కొండలూ, జలపాతాలు, గ్రామీణ వాతావరణము ఎంత అద్భుతంగా వుంటాయంటే... ఈ ప్రదేశాన్ని ‘‘ఆంధ్రా కాశ్మీరం’’ అని పిలుచుకునేలా ఆహ్లాదపరుస్తాయి. ఎండాకాలంలో కూడా ఈ ప్రాంతం చల్లగానే ఉంటుంది. ఇక్కడ వేలాదిరకాల ఔషధ వృక్షాలు, మొక్కలు, జంతువులు, విష కీటకాలు, వివిధ రకాల పక్షులు వంటివి ఎన్నో వున్నాయి. ప్రకృతి సౌందర్యాలతోపాటు ఎన్నో జంతువులు, వృక్షాలకు నిలయంగా వున్న ప్రదేశం జాతీయపార్కుగా గుర్తించబడింది.
పాపికొండలు, తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి. ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల నడుమ, తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలను ఆనుకొని ఉన్నాయి. హైదరాబాదు నగరానికి 410 కిలోమీటర్ల దూరంలోను, రాజమండ్రి నగరానికి 60 కిలోమీటర్ల దూరంలోను ఈ పాపికొండలు వుంటాయి. పాపికొండల వద్ద గోదావరి చాలా తక్కువ వెడల్పులో రెండు కొండల మధ్య ప్రవహిస్తూ, ఆ వాతావరణానికి మరింత రమణీయతను తెచ్చి పెడుతుంది.
ప్రత్యేకతలు :
చుట్టూ గోదారమ్మ పరవళ్లు... పచ్చని ప్రకృతి సోయగాలు... కనుచూపు మేర పచ్చటి పర్వత పంక్తులు... గిలిగింతలు పెట్టే చలిగాలులు... కొండల మధ్య మధ్య అందమైన సూర్యోదయం, అంతే అందమైన సూర్యాస్తమయం... రాత్రిళ్లు వెదురు గుడిసెల్లో బస... మధ్యలో క్యాంప్‌ఫైర్... గోదారమ్మ ఒడిలో స్నానం... ఇలా ఎన్నో ప్రత్యేకతలను ఈ పాపికొండల్లో ఇనుమడింపబడి వున్నాయి. ఇక్కడికి ఒక్కసారి వస్తేచాలు.. మళ్లీమళ్లీ రావాలనే భావన ప్రతిఒక్కరిలోనూ పుడుతుంది. పాపికొండల వద్ద గోదావరి ప్రవాహం చాల ఇరుకుగా, ఎంతో లోతుగా ఉంటుంది. శివలింగం అలంకారం, ఆలయం చుట్టూ ఫలవృక్షాలు, పూలమొక్కలు, అమాయక కొండరెడ్ల గిరిజనుల అప్యాయత ఆదరణ నవనాగరిక సమాజానికే తలమానికం.
ఆలయం చరిత్ర :
ఈ పాపికొండల ప్రాంతంలో శ్రీరాముని వాకిటం అనే ఆశ్రమం వుంది. ఇందులోనే శివాలయం కూడా ఉంది. 1800 శతాబ్ధకాలంలో ఒక మునీశ్వరుడు రాజమండ్రి నుంచి లాంచీపై బయలు దేరి భద్రాచలం వస్తుండగా.. పేరంటాలపల్లి వద్ద రాత్రి అయింది. దీంతో ఆయన అక్కడే అక్కడ బస చేశారు. ఆయన నిద్రపోయిన సమయంలో కలలో భగవంతుడు కనిపించి... ఇక్కడ ఆలయాన్ని నిర్మించమని ఆదేశించారట! అందుకు అనుగుణంగా ఆయన ఇక్కడే నివాసం ఏర్పరుచుకుని, ఆ ఆలయాన్ని నిర్మించినట్లు ఈ ప్రాంతవాసులు చెబుతారు. ఈ ప్రాంత గిరిజనులు తమకు విద్యా బుద్దులు, వైద్య సౌకర్యం కల్పించిన మునీశ్వరుడిని వారు ఆరాధ్యదైవంగా భావిస్తారు.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more