The Mythological Story Of Maheshwar Place Where Lord Shiva Visits | Telugu Historical Stories | Lord Shiva Temples

Maheshwar historical story lord shiva mythological history

maheshwar place, telugu mythological stories, lord shiva visit places, lord shiva temples, ahalya fort in maheshwar, maheshwar ahalya fort, telugu historial stories, historical forts

Maheshwar Historical Story Lord Shiva Mythological History : The Mythological Story Of Maheshwar Place Where Lord Shiva Visits.

మహాశివుడు వెలసిన పవిత్ర పుణ్యక్షేత్రం

Posted: 09/11/2015 06:10 PM IST
Maheshwar historical story lord shiva mythological history

మహేశ్వర్.. మహాశివుడు వెలిసిన పవిత్ర పుణ్యక్షేత్రం. ఆయన వెలిసిన ప్రాంతం కాబట్టే దీనికి ‘మహేశ్వర్’ అనే పేరు వచ్చింది. ఎంతో పురాతనమైన ఈ ప్రదేశం.. ప్రాచీనకాలం నుంచి ప్రజలకు తీర్థయాత్రా ప్రదేశంగా వుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఖర్గోన్ జిల్లాలో నర్మదా నది ఒడ్డున వున్న ఈ అందమైన ప్రదేశం.. పూర్వ సంస్కృతికి ప్రతిబింబం. ప్రస్తుతం ప్రముఖ పర్యాటక నగరంగా పేర్కొనబడుతున్న ఈ ప్రదేశం.. చేనేత వస్త్రాలకు చాలా ప్రసిద్ధి చెందింది.

మహేశ్వర్ లో వున్న నర్మదా నదిలో స్నానం ఆచరిస్తే.. శుభఫలితాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. పురాతన కాలం నుంచి ఇలా స్నానం చేయడం ఆచారంగా వుంది. ఈ ప్రాంతంలో ఎన్నో ఆలయాలు వున్నాయి. ఇక్కడున్న ఈ ఆలయాలన్నింటినీ హోల్కర్‌ వంశ రాణి రాజమాత అహల్యా దేవిబాయి నిర్మించింది. అంతేకాదు.. మహేశ్వర్‌ లో కోటలతోపాటు భవంతులు, ధర్మసత్రాలను కూడా కట్టించింది. నర్మదా నది ఒడ్డున భక్తులు స్నానం చేసేందుకు వీలుగా పీష్వా, ఫాన్సే, అహల్యా ఘాట్లను రాణి అహల్యా ఏర్పాటుచేసింది. ఈ ప్రదేశంలో వున్న కొన్ని సుప్రసిద్ధ స్థలాల గురించి మాట్లాడుకుంటే..

* అహల్యా కోట : దీనినే ‘హోల్కర్ కోట’ లేదా మహేశ్వర్ కోట అని పిలుస్తారు. ఈ కోటను 18వ శతాబ్ధంలో నర్మదా నది ఒడ్డున వున్న కొండపై రాణి అహల్యా దేవి కాలంలో నిర్మించారు. ఈ పురాతన కోటలో శివుడి అవతారాలకు అంకితం చేయబడిన దేవాలయాలు ఉన్నాయి. వాస్తు పరంగా భిన్నంగా వుండే ఈ కోటలోని శిల్పాలు చాలా అందమైనవి.

* జలేశ్వర్ దేవాలయం : పరమశివుడికి అంకితమైన ముఖ్యమైన ఆలయం. ఈ ఆలయంలోని దేవతకు ‘నీటి దేవుడు’గా పూజలు జరుపుతారు. ఈ ఆలయంలోని శివలింగాలు కూడా చాలా కాలం నుంచి పూజలు అందుకుంటున్నాయి. ఈ ఆలయ నిర్మాణకళ మహోన్నత స్తంభాలతో నిస్సందేహంగా ఆదర్శప్రాయంగా నిలిచింది.

* కాశీ విశ్వనాధ్ ఆలయం : జ్యోతిర్లింగ రూపంలో ఉన్న శివునికి అంకితం చేయబడింది. ఇక్కడున్న జ్యోతిర్లింగాలని భక్తులు పూజించి, ప్రార్థనలు జరిపితే, వారికి కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. అందుకే ఈ ఆలయంలోని జ్యోతిర్లింగ దర్శనం చాలా పవిత్రమైనదిగా భావిస్తుంటారు. వందల కొద్ది ప్రజలు ప్రతిరోజూ దర్శిస్తుంటారు.

* మహేశ్వర్ ఘాట్స్ : నర్మదా నది తీరాన ఉన్న మహేశ్వర్ ఘాట్స్ ఎన్నడూ ఖాళీగా ఉండవు. ఈ ఘాట్స్ ఒడ్డున, అనేక శివాలయాలు ఉండటం వలన, ఇక్కడి వాతావరణం భక్తితో నిండి ఉంటుంది. ఈ ఘాట్స్ అనేక స్మారక చిహ్నాలను వర్ణిస్తున్న కొన్ని అసాధారణ రాతి శిల్పాలను కలిగి ఉన్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maheshwar  lord shiva temples  mythological stories  

Other Articles