సరిగ్గా శీతాకాలం.. అందులోనూ వెన్నులో వణుకు పుట్టించేంత చలి.. ఈ సమయంలో ఉదయం సూర్యుడు వచ్చినా.. దుప్పటిని వదలాలంటే ఎవరూ ఇష్టపడరు. కానీ పండు ముదుసలి నుంచి చిన్నారుల వరకు అందరూ వైకుంఠ ఏకాదశి రోజున అర్థరాత్రి స్నానాలను అచరించి వేకువ జామున మూడుగంటల లోపు వైష్ణవాలయాలకు చేరుకుని ధరున్మాస పూజల అనంతరం శ్రీవేంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా దర్శించుకుంటారు. ఇలా చేస్తే తమకు స్వామి వారి కృపాకటాక్షాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అయితే దీని వెనుకనున్న రహస్యమేమిటీ అంటే..?
ముక్కోటి ఏకాదశి పర్వదినం రోజున భక్తులు ఉత్తర ద్వారం ద్వారా ఆలయంలోకి అండాళ్ అమ్మవారిని దర్శనం చేసుకున్న తరువాత శ్రీవారి దర్శనం చేసుకుంటారు. ఇలా స్వామిని దర్శించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. దీని వెనుకా అనేకమైన కారణాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం మధుకైటభులనే రాక్షసులు స్వామి వారి అలయం నుంచి వేదాలను అపహరించుకుని పారిపోతుండగా గమనించిన స్వామివారు.. వేదాలను రక్షించేందుకు ఉత్తరద్వారం నుండి వెళ్లి వారిని సంహరించి.. తిరిగి ఉత్తర ద్వారం గుండానే వైకుంఠంలోనికి ప్రవేశిస్తాడని చెబుతారు. ఇక స్వామివారే ఇలా వెళ్లడంతో ముక్కోటి ఏకాదశి రోజున భక్తులు కూడా అదే మార్గంలో వెళ్లి స్వామివారిని దర్శంచుకోవడం పరిపాటిగా వస్తుంది. వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమహావిష్ణువును ఉత్తర ద్వారం నుంచి స్వామిని దర్శించుకుంటే పుణ్యమని భక్తులు విశ్వసిస్తారు.
వైకుంఠ ఏకాదశి ప్రాశస్త్యం:
సంవత్సరానికి పన్నెండు నెలలు. నెలకు రెండు పక్షాలు. పక్షానికి ఒక ఏకాదశి. వెరసి ఏడాదికి ఇరవైనాలుగు ఏకాదశులు. ఒక్కో ఏకాదశికీ ఒక్కో పేరుంది. కానీ, వాటిలో వైకుంఠ ఏకాదశి చేరలేదు. దానికి కారణం. ఇతర ఏకాదశులన్నీ చాంద్రమాన (చంద్ర గమనం) గణన ఆధారంగా ఏర్పడినవి. వాటికి భిన్నంగా సౌరమాన (సూర్య గమనం) గణన ఆధారంగా ఏర్పడిందీ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి ధనుర్మాసంలో వస్తుంది. ధనుర్మాసం సూర్య గమనాన్ని బట్టి ఏర్పడుతుంది. మార్గశిరం-పుష్యం ఈ రెండింట్లో ఏదో ఒక మాసంలో వస్తుంది. అదికూడా శుక్లపక్షంలో వచ్చే ఏకాదశినే వైకుంఠ ఏకాదశి అంటారు.
వైకుంఠ ఏకాదశిని ముక్కోటి ఏకాదశని, స్వర్గద్వార ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పేర్లు రావడం వెనుక వేర్వేరు కథనాలు పురాణాల్లో కనిపిస్తాయి. విష్ణువు కొలువై ఉన్న వైకుంఠ ద్వారాలు ఈ రోజు తెరుస్తారని వైకుంఠ ఏకాదశి అంటారు. దక్షిణాయణంలో యోగనిద్రలోకి వెళ్లిన మహావిష్ణువు ఈ రోజునే మేల్కొంటాడట. ఆ స్వామిని దర్శించుకోవడానికి ముక్కోటి దేవతలూ వైకుంఠానికి చేరుకుంటారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. దక్షిణాయణంలో చనిపోయిన పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించే అవకాశం కల్పిస్తారు కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని పిలుస్తారని పురాణ కథలు చెబుతు న్నాయి.
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more