స్నానాలు అచరించడం అంటే స్నానం చేయడమనే అర్థం వచ్చినా.. స్నానానికి ప్రాధాన్యత ఎంతో వుంది. స్నానాలు ఎలా చేయాలి, ఎంత సేపు చేయాలి, ఎప్పుడు చేయాలి.. ఏ నీళ్లతో చేయాలి.. ఎక్కడ స్నానాలు చేయడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయ్ అన్న అంశాలను అన్నింటినీ మన పూర్వికులు ముందుగానే సిద్దం చేసిపెట్టారు. ఇక ఏయే రోజుల్లో తలంటు స్నానాలు అచరించాలి.. ఏయే రోజుల్లో నువ్వుల నూనేను వంటికి పట్టించి నలుగుపిండితో స్నానాలు చేయాల్న అని వివరాలతో కూడిన సమస్త సమాచారాన్ని మన పూర్వికులు మనకు అందుబాటులో వుంచారు. తపోస్పంప్ననులైన రుషులు ఈ విషయాలను తమ శిష్యులకు అక్కడి నుంచి మన పూర్వికులకు చేరింది.
అసలు స్నానం ఎలా చేయాలి? అసలు స్నానాలు ఎన్ని రకాలు? ఎంత సేపు చేయాలి . . ? అన్న వివరాల్లోకి వెళ్తే ముందు స్నానమంటే హడావుడిగా నాలుగు చెంబుల నీళ్లు వంటిపై పోసుకొని వచ్చేయడం కాదు. ఇక మరి కొందరు శరీరం కూడా పూర్తిగా తడవకుండా స్నానం అయ్యిందనిపిస్తారు. కానీ స్నానవిధి అలా చేయకూడదు. స్నానం ముందుగా తలపై నీళ్లు పోసుకుని ఆ తరువాత వీపు, శరీరభాగం, కాళ్లు, చేతులు, ముఖం ఇలా అన్ని శరీర అంగాలు తడిసిన తరువాత.. శరీరాన్ని అదే క్రమపద్దతిలో సబ్బుతో రుద్దుకుని.. శరీరాన్ని బాగా చేతులతో రాసుకున్న తరువాత మళ్లీ నీళ్లను పోసుకుని సబ్బును కడిగేసుకోవాలి. ఇలా పూర్తిగా సబ్బు వదిలిన తరువాత కూడా మరో రెండు చెంబులు పోసుకుని మరీ రావాలి.
ఇక స్నానాలన్నింటిలోకెళ్లా సముద్రస్నానం ఆచరించడం శరీరానికి చాలా మంచిది. సముద్రనీళ్లలో వున్న లవణం.. స్నానం ద్వారా శరీరంపైనుండే మలినాలు పోగొడతాయి. అంతేకాదు నీళ్లు స్నానం సమయంలో ఒంట్లోకి వెళ్లినా మంచిదేనంటారు. శరీరంలోని రుగ్మతలను కూడా ఈ స్నానం దూరం చేస్తుందని పెద్దలు అంటారు.
తర్వాతది నదీ స్నానం. ఉదయాన్నే నదీ స్నానం చేస్తే అనేక చర్మ రోగాలు దూరమవుతాయి. నదీ జలాలు కొండల్లోనూ, కోనల్లోనూ, చెట్టు పుట్టలను తాకుతూ ప్రవహిస్తాయి. అలా ప్రవహించటం ద్వారా ఎన్నో వనమూలికల రసం నదీ జలాల్లో కలుస్తుంది. దాని వల్ల నదీ స్నానం ఎంతో ఉత్తమమైనది. ఆరోగ్యవంతమైనది. వీటిలో స్నానాలు అచరించడం వల్ల శరీరంలో వున్న రుగ్మతలకు ఔషదగుణాలున్న నీరు కడిగేస్తుంది.
ఆ తరువాత నుతి స్నానం అథమం అయినా మంచిదే. అయితే ఈ రోజుల్లో బావుల స్థానాలను బోర్లు అక్రమించేయడంతో బోరు నీటితోనే స్నానాలు అచరించవారి సంఖ్య అధికం. ఇద పూర్తిగా ఇంటి స్నానమే అయినా.. బోరు నీళ్లను అతిగా వేడి చేసుకుని ఆ నీటీతో గానీ, అతి చల్లని నీటితో గానీ స్నానం చేయరాదు. గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తే శరీరానికి, శరీరం లోపల అవయవాలకి ఎంతో సేద కలుగుతుంది. అనారోగ్యం ఉన్నవారు, చిన్నపిల్లలు తగురీతిలో వేడి లేదా చన్నీటితో స్నానం చేయాలి.
స్నానం ఒక పని కాదు. ఓ భోగం. సంతృప్తిగా అనుభవించాలి. కనీసం అరగంటైనా స్నానం చేస్తే మంచిది. 4 చెంబులతో శరీరాన్ని బాగా తడిపి, సున్ని పిండి లేదా సబ్బు తో శుభ్రంగా రుద్దుకొని, ఆపై 7-8 చెంబులతో శుభ్రపరచుకోవాలి. చక్కటి మెత్తటి టవల్ తో అద్దుకొని శరీరాన్ని తుడుచుకోవాలి. స్నానం తరువాత శరీరంలోని అవయవాలను శుభ్రంగా తుడుచుకోకపోవడం వల్ల అనేక రోగాలు వస్తాయి. ప్రాణాంతకమైన క్యాన్సర్ వంటివి వచ్చే అవకాశం ఉంది. మర్మాంగాల వద్ద సరైన గాలి తగలకపోవడం వల్ల ఆ ప్రదేశాల్లో సూక్ష్మజీవులు అభివృద్ధి చెందుతాయి. శుభ్రంగా స్నానం చేసి ఫ్యాన్ కింద ఓ నిమిషం నిల్చొని ఆపై దుస్తులు ధరించండి.
* స్త్రీలు వంటిమీద ఏమి లేకుండా స్నానం చేయాలి.
* మగవారు ఏదో ఒక గుడ్డ చుట్టుకొని స్నానం చేయాలి.
* తెల్లవారు జామున 4-5 మధ్య చేసే స్నానం ముని స్నానం. అనగా ఋషి స్నానం.
* ఉదయం 5-6 మధ్య చేసేది దైవ స్నానం.
* 6-7 ల మధ్య చేసేది మానవ స్నానం. ఆపై చేసేది రాక్షస స్నానం.
* చన్నీటితో స్నానం మంచిది. నదీ స్నానం ఉత్తమం. చెరువు స్నానం మద్యం. నూతి స్నానం అధమం.
* లక్షల ఆదయమోస్తున్నా మానుకొని సరైన సమయంలో సరైన స్నానం చేయటం మంచిది .
(And get your daily news straight to your inbox)
Mar 09 | యత్రయత్ర రఘునాథ కీర్తనం.. తత్ర తత్ర కృతమస్తకాంజలిమ్! భాష్పవారి పరిపూర్ణ లోచనం.. మారుతిం నమత రాక్షసాంతకమ్!! శ్రీరామ సంకీర్తన ఎక్కడ జరుగుతుందో అక్కడ ఆనంద భాష్పాలతో ప్రసన్నవదనంతో చిరంజీవి అయిన హనుమ ప్రత్యక్షమవుతాడని ప్రతీతి.... Read more
Jan 21 | సాధారణంగా రెండు కంటే ఎక్కువ భాషలు వచ్చినవారు చాలా తక్కువగా ఉంటారు. లేదంటే మహా అంటే మూడు బాషలు వచ్చిన వారుంటారు. అయితే అంగ్లం, హిందీ, మాతృభాషలతో పాటు మరో బాష వచ్చిన వారు... Read more
Nov 14 | పచ్చల ఛాయా సోమేశ్వరాలయం భారత దేశ హిందూ ఆలయాలలో ఒక పురాతన మైనది.. దీని చరిత్ర సుమారు 1000 సంవత్సరాలు నాటిది .. దైవాలు రెండక్షరాలు పదం పలకడానికి ఒక మాత్రా కాలం రాయడానికి... Read more
Mar 04 | చిన్నప్పుడు పెద్దలు పిల్లలకు కథలు చెప్పే క్రమంలో కాకులు దూరని కారడవి అని చెప్పేవారు. అలాంటిదే పురాణ ఐతిహ్యం వున్న పరమపవిత్ర పురాతన పుణ్యక్షేత్రం కూడా చరిత్రలో ఒకటుందని మీకు తెలుసా.? అది మరేదో... Read more
Jan 19 | ఓంకారం నామాన్ని జపిస్తే చాలు ముక్కోటి దేవాతామూర్తులను స్మరించుకున్నట్లేనని ఇతిహాసాలు చెబుతుంటాయి. అయితే అసలు ఓంకార నాదం తొలిసారిగా ప్రతిధ్వనించిన ప్రాంతం ఏదీ.? ఎక్కడ వుంది.? ఇప్పటికీ ఓంకారనాదం వినబడుతుందా.? ఓంకార నాధం ప్రతిధ్వనించే... Read more