అందాన్ని పెంపొందించుకోవడానికి రకరకాల పద్ధతులతోపాటు.. కొన్ని సహజసిద్ధమైన ప్రకృతి పదార్థాలు కూడా ఎంతగానో తోడ్పడుతాయి. ఇటువంటి పదార్థాలలో చర్మానికి సంబంధించిన పోషక విలువలు అధికంగా వుండడంతో.. అందంగా కనిపించేందుకు ఎంతో సహాయపడుతాయి. అందులో ముఖ్యమైంది తేనె.
తేనె చర్మానికి ఒక మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చడమే కాకుండా.. చర్మం మీద వుండే మచ్చలు, మొటిమలు, చారలను నిర్మూలించడంలో అద్భుతమైన పాత్రను పోషిస్తుంది. ఇది చర్మరంధ్రాలలో కూడా చొచ్చుకుని పోయి లోపల వున్న మురికిని, మలిన పదార్థాలను బయటకు పంపేసి, చర్మ రంధ్రాలను మూసేస్తుంది. తేనెలో వుండే యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు.. చర్మంపై వుండే మొటిమలను తొలగించి, చారలను నివారిస్తుంది. చర్మాన్ని ఎల్లప్పుడూ తేమగా వుంచడంలో ఇది ఎంతగానో దోహదపడుతుంది.
ఇటువంటి తేనెను రకరకాల పదార్థాలలో కలిపి కూడా చర్మానికి పట్టించుకోవచ్చు. ఆయా పదార్థాలలో వుండే పోషక విలువలు, తేనెలో వున్న పోషక విలువలతో కలిసి.. చర్మానికి ఒక కొత్త అనుభూతిని కలిగిస్తాయి. నిర్జీవంగా మారిపోయిన చర్మాన్ని తిరిగి మృదువుగా, సాఫ్ట్ గా మార్చడంలో సహాయపడుతాయి. పూర్వం మహిళలు కూడా తమ అందాన్ని పెంపొందించుకోవడానికి తేనెలో కొద్దివరకు పాలను కలుపుకుని శరీరానికి పట్టించుకునేవారు. దాంతో వారి అందం రెట్టింపు అయ్యేది. ఇలాగే తేనెను మరికొన్ని పదార్థాలలో మిక్స్ చేసి చర్మ సౌందర్యానికి రకరకాల స్కిన్ కేర్ ప్యాక్ ను తయారుచేసుకోవచ్చు. వీటితో అందం రెట్టింపు అవడమే కాకుండా.. చర్మం నిరంతరం ఆరోగ్యంగా వుంటుంది.
తేనె మిశ్రమ పదార్థాలు : అద్భుతమైన చర్మసౌందర్యాన్ని సొంతం చేసుకునే స్కిన్ కేర్ టిప్స్
1. తేనె - పాలు మిశ్రమం... అరకప్పు వరకు పాలును తీసుకుని అందులో ఒక చెంచా వరకు తేనెను పోసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలియబెట్టిన తరువాత రోజుకు రెండుసార్లు చొప్పున ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి ముఖానికి పట్టించుకోవాలి. కొద్దిసేపు తరువాత శుభ్రం చేసుకుంటే మంచి ఫలితాన్ని మీరు గమనించవచ్చు. ఇలా ప్రతిరోజు పాటిస్తే మీరు నిత్యం యవ్వనంగా వుండచ్చు.
2. తేనె - పెరుగు మిశ్రమం... పెరుగులో కొద్దివరకు తేనెను మిక్స్ చేసుకుని ఒక మిశ్రమాన్ని తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ఒక ప్యాక్ లా వేసుకోవాలి. ఇలా రోజుకు ఒకసారి చొప్పున ప్రతిరోజు పాటిస్తే.. ముఖం మీద వున్న మొటిమలు తొలగిపోయి, డ్రై స్కిన్ కనబడకుండా చేస్తుంది.
3. తేనె - గుడ్డు మిశ్రమం... గుడ్డులో వుండే తెల్ల పదార్థంలో మాత్రమే తేనెను మిక్స్ చేసి, బాగా కలియబెట్టుకోవాలి. దీనిని ముఖానికి ఒక మాస్క్ లా వేసుకుని కొద్దిసేపు వరకు అలాగే వుంచుకోవాలి. తరువాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజు చేస్తే.. ముఖం మీద వుండే చారలు, మొటిమలు తగ్గిపోయి.. ప్రకాశవంతమైన అందాన్ని సొంతం చేసుకోవచ్చు.
4. తేనె - నిమ్మరసం మిశ్రమం... నిమ్మరసంలో వుండే పోషకాలు చర్మానికి చల్లదనాన్ని చేకూర్చి.. తేమగా వుంచడంలో సహాయపడుతాయి. ఈ మిశ్రమాన్ని ముఖ్యంగా సూర్యరశ్మికి గురైన ప్రదేశాలలో పట్టిస్తే.. మంచి ఫలితాలు అందుతాయి. తాజాగా తీసుకున్న నిమ్మరసంలో కొద్దిగా తేనె ను వేసి మిక్స్ చేసుకోవాలి. ముఖానికి, సూర్యరశ్మికి గురైన ప్రదేశాలలో ఈ మిశ్రమాన్ని పట్టించి, మసాజ్ చేసుకోవాలి. ఇలా 20 నిముషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. క్రమం తప్పకుండా వారం రోజులవరకు పాటిస్తే.. కాంతివంతమైన చర్మాన్ని సొంతం చేసుకవచ్చు.
5. తేనె - టొమాటో మిశ్రమం... ముందుగా టొమాటోలను బాగా పిండుకుని ఒక రసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. అందులో కొద్దివరకు తేనెను వేసి మిక్స్ చేసుకోవాలి. ఈ పేస్ట్ ను ముఖానికి పట్టించి, 20 నిముషాల తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే.. చర్మం, చర్మరంధ్రాలలో వుండే మలినాలు, మురికి పూర్తిగా తొలగిపోయి.. ప్రకాశించే చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు.
6. తేనె - ఓట్స్ మిశ్రమం... రెండు చెంచాలవరకు ఓట్స్ తీసుకుని, బాగా దంచి, పొడిగా చేసుకోవాలి. అందులో రెండు చెంచాలవరకు తేనెను వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి మసాజ్ చేసుకోవాలి. ఇది చర్మంలో వుండే డెడ్ స్కిన్ సెల్స్ ను నివారించి.. చర్మాన్ని తేమగా, మృదువుగా వుండేటట్లు చేస్తుంది.
7. తేనె - ఆలివ్ ఆయిల్ మిశ్రమం... ఒక గ్లాసులో ఆలివ్ ఆయిల్ ను తీసుకుని, అందులో కొద్దిగా తేనెను వేసి మిక్స్ చేసుకోవాలి. దీనిని బాగా కలియబెట్టిన తరువాత ముఖానికి పట్టించుకుని, మసాజ్ చేసుకోవాలి. తరువాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ పద్ధతిని కనీసం రెండువారాలకి ఒకసారి పాటించాలి. ఇది ముఖం మీద వుండే మచ్చలను, మొటిమలను పూర్తిగా నిర్మూలించి.. మృదువైన చర్మాన్ని తిరిగి అందిస్తుంది.
ఇలా ఈ విధంగా తేనెను రకరకాల మిశ్రమాలలో కలుపుకుని.. యవ్వనాన్ని తిరిగి పొందవచ్చు. పైగా ఇవి ఎంతో ఆరోగ్యమైనవి కూడా!
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more