The healthy foods to prevent hair loss

healthy foods, healthy tips, healthy food to prevent hair loss, hair loss tips, hair gain tips, hair loss problems, healthy foods for hair, hair healthy foods

the healthy foods to prevent hair loss and also gave energy to body

జుట్టు రాలే సమస్యను నిరోధించే ఆహారాలు!

Posted: 09/25/2014 03:51 PM IST
The healthy foods to prevent hair loss

నేటి ఫాస్ట్ జనరేషన్ లో వున్న యువతీయువకుల మీద టెక్నాలజీ తన ప్రభావాన్ని ఎక్కువగా చూపించడం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలకు గురికావాల్సి వస్తోంది. ఇటువంటి వాటిల్లో జుట్టు రాలే సమస్య కూడా ఒకటి! ఇది ప్రారంభంలో వున్నప్పుడు అంతగా కనిపించదుగానీ.. రానురాను ఎక్కువ అయితే దీనిని అదుపు చేయడం చాలా కష్టం అవుతుంది. అప్పుడు ఎన్ని మందులు ఉపయోగించినా.. ఏ వైద్యుడు దగ్గరికి వెళ్లినా.. దీనికి పరిష్కారం మాత్రం దొరకదు. కాబట్టి.. జుట్టు రాలుతున్నట్టు మొదట్లో గమనిస్తే.. ఆహారంలో మార్పులు చేసుకొని అదుపు చేయొచ్చు. ముఖ్యంగా పోషక పదార్థాలు ఎక్కువగా వుండే ఆహారాలను తీసుకుంటే.. జుట్టు రాలే సమస్యను చాలా సులభంగా అరికట్టవచ్చు. మరి ఆ ఆహార పదార్థాలేంటో తెలుసుకుందాం...

1. చిలకడ దుంపలు : ఇవి శరీరంలో విటమిన్ ఏ, బీటా కెరోటిన్ ను ఉత్పత్తి చేస్తాయి. ఈ విటమిన్ చర్మం కోసం ముఖ్యమైన నూనెలను ఉత్పత్తి చేస్తుంది. ఈ నూనెలు తలమీద చర్మాన్ని రక్షించడానికి సహాయపడుతాయి. ఈ నూనెలు లేకపోతే తలమీద దురద, చికాకు వంటివి వస్తాయి. అప్పుడు జుట్టు రాలే సమస్య ఏర్పడుతుంది. మరి వాటిని అదుపు చేయాలంటే ఉడికించిన దుంపలు తీసుకుంటే మంచిది.

2. పాలకూర : శరీరంలో ఐరన్ మోతాదు తక్కువగా వున్నప్పుడు జుట్టు రాలడం మొదలవుతుంది. ఆ సమయంలో ఐరన్ ఎక్కువగా వుండే బీన్స్, పప్పు, చిక్సీస్ వంటి వాటిని తినాలి. ఐరన్ చర్మానికి ఆక్సిజన్, రక్తాన్ని అందించడంతోపాటు హిమోగ్లోబిన్ ఏర్పడటంలో సహాయపడుతుంది.

3. గుడ్లు : ఇందులో ప్రోటీన్లు సమృద్ధిగా వుంటాయి. ఇవి నెత్తిమీద కణజాలం నిర్మాణాన్ని, కోల్పోయిన జుట్టు స్థానంలో కొత్త జుట్టు వచ్చే బాధ్యతను తీసుకుంటాయి. జున్ను, కోడి, చేప, ఇతర మాంసాలలో కూడా ప్రోటీన్లు సమృద్ధిగా వుంటాయి.

4. వాల్నట్ : వీటిలో బోయోటిన్, ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్ E, రాగి వంటి ఆరోగ్యకరమైన పోషకాలు సమృద్దిగా ఉంటాయి. ఈ పోషకాలు జుట్టు నిర్వహించడానికి ఎంతో తోడ్పడుతాయి. జుట్టుకు సూర్యరశ్మి వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తాయి. అలాగే మీ జుట్టును నునుపుగా ఉంచటానికి, మంచి రంగులో ఉండటానికి సహాయపడతాయి.

5. బ్లూ బెర్రీలు : ఇందులో జుట్టుకు కావాల్సిన విటమిన్-సి పుష్కలంగా వుంటాయి. ఈ విటమిన్ లేకపోవడం వల్ల జుట్టు బలహీనం, పెళుసైన జుట్టు, చివరలల చిట్లుల, మధ్యమధ్యలో బ్రేక్ అవడం వంటివి జరుగుతుంది. అటువంటి సమస్యల నుంచి బయటపడాలంటే.. బ్లూ బెర్రీలు తీసుకుంటే చాలు.. ఇందులో అవసరమైన యాక్సిడెంట్లు సమృద్ధిగా వుంటాయి.

6. సోయా : ఇది హిమోగ్లోబిన్ ఏర్పడటానికి అవసరమైన ఐరన్ ను అందిస్తుంది. ఒకవేళ ఇది లేకపోతే జుట్టు పెళుసుగా మారి, రాలిపోతుంది. దానినుంచి బయటపడాలంటే సోయా తీసుకుంటే చాలు.

7. సాల్మన్ : ఇందులో విటమిన్ డీ, మాంసకృతులు, జుట్టు పెరుగుదలకు కావాల్సిన కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా వుంటాయి. అలాగే ఇందులో జింక్ కూడా సమృద్ధిగా వుంటుంది. ఈ ఆమ్లాలన్నీ జుట్టును చాలా సాఫ్ట్ గా వుంచడమే కాకుండా.. పొడిచర్మం, చుండ్రు, జుట్టు నష్టం నుంచి కాపాడుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : health tips  beauty tips  healthy foods  hair loss problems  hair gain tips  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more