కొంతమంది ఇతరులకంటే ఎక్కువగా అందంగా లేమని బాధపడుతుంటారు. ఆ సమయంలో మానసిక ఒత్తిడికి గురయి, ఆవేశంలో అందాన్ని పెంచుకోవడం కోసం ఎన్నో తప్పిదాలు చేస్తూ వుంటారు. అందం పెంచుకోవడం కోసం డబ్బులను సైతం లెక్క చేయకుండా బ్యూటీ పార్లకు వెళ్లడం, రకరకాల క్రీములను వాడటం చేస్తూ వుంటారు. ఇలా చేయడంవల్ల ఎక్కువ డబ్బులు నష్టపోవడమే కాకుండా, వాడిన క్రీముల్లో వుండే కొన్ని రసాయనాలు చర్మాన్ని హానీ కలిగిస్తాయి. ఏదైనా ఒక ప్రొడక్ట్ వాడితే అంతగా ప్రమాదం లేదు కానీ.. ఒకదానితర్వాత ఒకటి మార్చుకుంటూపోతే వున్న అందం కూడా దెబ్బతినే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి అందంగా లేమన్న బాధతో ఏవేవో చేయకుండా ప్రశాంతంగా కొన్ని ఆహారపదార్థాలతో పరిష్కారాన్ని పొందవచ్చు. మానవ శరీరానికి ఆరోగ్యంతోపాటు అందాన్ని రెట్టింపు చేసే ఆహారపదార్థాలు సహజంగానే చాలా లభిస్తాయి. వాటిని ప్రతిరోజూ తినడం అలవాటు చేసుకుంటే చాలు.. తక్కువ సమయంలోనే అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చు. ఆ ఆహారాలేంటో తెలుసుకుందాం...
1. ఆకుకూరలు : బచ్చలికూర, పాలకూర లాంటి ఆకుకూరల్లో కళ్లసంరక్షణకు అవసరమయ్యే కెరోటినాయిడ్స్ ల్యూటిన్, జియోక్సాంథిన్ అనే పోషకాలు పుష్కలంగా వుంటాయి. ఇవి రెండూ కలిసి కంటిలోని రెటీనా మధ్యభాగంలో ఉండే మాక్యులాను రక్షిస్తాయి. అలాగే కళ్ళ క్రింద వుండే నల్లటి వలయాలను తొలగించడానికి ఉపయోగపడుతాయి.
2. గుడ్డు: జుట్టు సంరక్షణకు అవరమయ్యే పోషకాలు ఇందులో వుంటాయి. ఇందులో వుండే ‘‘ఐరన్’’ వల్ల జుట్టు రాలే సమస్యను తగ్గిస్తే.. ‘‘సల్ఫర్’’ జుట్టు నిగనిగలాడేలా చేస్తుంది. ఒకవేళ గుడ్డు తినడం ఇష్టం లేకపోతే.. దాన్ని పగులగొట్టి అందులో ఉండే తెల్ల సొనను జుట్టుకు పెట్టుకొని గంట తర్వాత కడిగేస్తే మీ కురులు నిగనిగలాడుతూ ఉంటాయి.
3. అరటి: చర్మసంరక్షణకు అవసరమయ్యే ఉత్తమమైన పదార్థం. చర్మంలోని మలినాలను తొలగించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే ఇందులో ఉండే ఎ, బి, ఇ విటమిన్ల వల్ల చర్మం సాగే గుణాన్ని సంతరించుకుంటుంది.
4. జామపండు: ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి చర్మానికి హాని కలిగించే ఫ్రీరాడికల్స్ (చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు కనిపించేలా చేస్తాయి)ని సమూలంగా తొలగించడంలో కీలకపాత్ర పోషిస్తాయి. అంతే కాదు.. శరీరంలో విటమిన్ ‘సి' మోతాదును పెంచడంలో ఇది సహాయపడుతుంది.
5. దానిమ్మపండు: శరీరంలో వుండే ఫ్రీరాడికల్స్ తో పోరాడి... వయస్సు పైబడిన కొద్దీ వచ్చే ముడతల సమస్యను పరిష్కరిస్తుంది. అలాగే గుండెలో ఆక్సిజన్ లెవల్స్ ని సమన్వయం చేయడంలో కూడా తోడ్పడుతుంది.
6. గ్రీన్ బొప్పాయి : ఇందులో సహజసిద్దమైన ఎంజైమ్ లు, ఫైటోన్యూట్రియంట్లు అధికంగా వుంటాయి. అలాగే జీర్ణవ్యవస్థను చురుగ్గా వుంచడంలో దోహదపడే పొటాషియం, మెగ్నీషియంతోపాటు ఎ, బి, సి, ఇ విటమిన్లు పుష్కలంగా వుంటాయి. దీంతో పాటు చర్మాన్ని తిరిగి కాంతి వంతం చేస్తుంది.
7. ఉసిరి : చిన్నతనంలోనే తెల్లజుట్టు, చర్మం ముడుతలు పడటాన్ని నివారించడంలో ఇది ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. అంతేకాదు.. కాలేయం, ప్లీహం, గుండె, జీర్ణవ్యవస్థలను ఇది బలపరుస్తుంది. రక్తనాళాల గోడలు దళసరిగా మారేలా చేస్తుంది. ఎముకల్ని, దంతాల్ని కూడా ద్రుడపరచడంతోపాటు గోళ్ళు, జుట్టు పెరుగుదలకు ఉపయోపడతుంది.
8. బీట్ రూట్ : ఇందులో బీటైన్ అనే పదార్థం పుష్కలంగా వుంటుంది. ఇది కొవ్వును కరిగించే బయోయాక్టివ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. బీట్ రూట్ రసంలో ఉండే క్లోరిన్ జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ జ్యూస్ ని పరగడుపునే తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more