మహిళలు తమ అందాన్ని పెంపొందించుకోవడం కోసం బ్యూటీపార్లర్లకు వెళ్లడం, ఎక్కువ డబ్బులు వెచ్చించి క్రీములు కొనడంలాంటివి చేస్తుంటారు. అయితే వీటివల్ల చర్మ సమస్యలు తలెత్తే ప్రమాదముంది. అలాగే ఇవి సహజ సౌందర్యాన్ని అందించవు. పైగా వాటిని నిత్యం అమలు చేసుకోవాల్సి వుంటుంది. ఒక్కసారి వేసుకోకపోతే చర్మం మొత్తం పొడిబారిపోయినట్లుగానీ, మరకలు పడినట్లుగానీ కనిపిస్తుంది. కాబట్టి.. అటువంటి వాటికి దూరంగా వుండి పోషక విలువలు కలిగిన ఆహారపదార్థాల ద్వారా కొన్ని రెమెడీస్ తయారుచేసుకుని చర్మానికి పట్టిస్తే.. సహజసౌందర్యంతోపాటు ఆరోగ్యంగా వుండొచ్చు. అవి చర్మానికి కావల్సిన పోషకాలు అందిస్తాయి కాబట్టి.. చర్మం తిరిగి నిర్జీవంగా మారదు. అటువంటి ఆహారాల్లో నారింజ అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మానవ ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంతోపాటు సహజత్వంతో కూడిన అందాన్ని పెంపొదిస్తుంది. నారింజతో కొన్ని రెమెడీస్ ని తయారుచేసుకుని అప్లై చేసుకోవాలి. మరి అవేమిటో తెలుసుకుందాం...
1. ఆరెంజ్ ఫేస్ ప్యాక్ : తాజాగా వున్న ఒక నారింజపండును తీసుకుని.. అందులో వున్న గుజ్జును ముఖానికి రుద్దుకోవాలి. ఇలా చేసిన 5 నిముషాల తర్వాత చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే.. చర్మంలో వున్న ఆయిల్ తొలగిపోయి, మృదువుగా మారుతుంది. వృద్ధ్యాప్య లక్షణాలు కూడా దూరమవుతాయి. స్నానం చేసుకోవడానికి 10 నిముషాలముందు చేసుకుంటే మంచిది.
2. పాలు-ఆరెంజ్ జ్యూస్ : గాఢంగా వున్న పాలును ఒక గిన్నెలో తీసుకుని.. అందులో ఆరెంజ్ జ్యూస్ ను వేసి కలపాలి. ఈ గాఢ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి.. రెండు నిముషాలపాటు మసాజ్ చేయాలి. అనంతరం చల్లని నీటతో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. చర్మంలో చనిపోయిన కణాలు, దుమ్ముధూళి మొత్తం మాయమవుతాయి.
3. పెరుగు-నారింజ తొక్క : ముందుగా నారింజ తొక్కలకు ఎండలో బాగా ఎండబెట్టాలి. కొన్నిరోజుల తర్వాత ఎండిపోయిన తొక్కలకు దంచి, పౌడర్ గా చేసుకోవాలి. తర్వాత ఒక కప్పులో కాస్త పెరుగును తీసుకుని అందులో ఈ నారింజ తొక్క పౌడర్ ను కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకుని, కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. మొటిమలు, మచ్చలు పూర్తి మాయమవుతాయి.
4. నిమ్మ-పెరుగు-ఆరెంజ్ జ్యూస్ : ఒక గిన్నెలో పెరుగు తీసుకుని అందులో నిమ్మరసాన్ని వేసుకోవాలి. ఈ మిశ్రమంలో కాస్త ఆరెంజ్ జ్యూస్ ను మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసిన అనంతరం ఈ మిశ్రమాన్ని ముఖానికి ఒక ప్యాక్ లా వేసుకోవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. చర్మం తెల్లంగా, ప్రకాశవంతంగా మారి ఎంతో అందంగా కనిపిస్తారు.
5. వోట్స్-నారింజ తొక్క : నారింజ తొక్కలకు బాగా ఎండబెట్టి దానిని పౌడర్ లా చేసుకోవాలి. అలాగే వోట్స్ ను కూడా పౌడర్ లా చేసుకోవాలి. ఈ రెండింటిని కాస్త నీటిలో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, 10 నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. నల్లగా వున్న ప్రదేశాలు తెల్లగా మారుతాయి. చాలా ఫ్రెష్ గా కనిపిస్తారు. కాంతివంతమైన అందం మీ సొంతం.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more