చర్మసౌందర్యానికి అవసరమయ్యే ప్రోటీన్లు, పోషకాలు, ఇతర మూలకాలు బొప్పాయిలో పుష్కలంగా వుంటాయి. ఈ బొప్పాయితో కొన్ని బ్యూటీ ప్యాక్స్’ని తయారుచేసుకుని రెగ్యులర్’గా వాటిని అప్లై చేసుకుంటే.. నిగారింపైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చు. నిజానికి ఫేషియల్ క్రీములు, లోషన్లలో రసాయనాలు ఎక్కువగా వుంటాయి కాబట్టి దాంతో సహజత్వంతో కూడిన అందం సాధ్యంకాదు.
అదే పోషక విలువలున్న పదార్థాలతో కొన్ని ప్యాక్స్ తయారుచేసుకుని అప్లై చేసుకుంటే.. సహజ అందాన్ని పొందడంతోబాటు చర్మసమస్యల్ని శాశ్వతంగా నిర్మూలించుకోవచ్చు. అటువంటి వాటిల్లో బొప్పాయిపండు అందాన్ని, చర్మరక్షణను మెరుగుపర్చడంలో అద్భుతంగా పనిచేస్తుంది. అయితే కృత్రిమంగా తయారయ్యే బొప్పాయి కాకుండా.. సహజంగా పండేదానితోనే ఇది సాధ్యమవుతుంది. బొప్పాయితో ఫేషియల్ ప్యాక్స్ ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం...
1. ముందుగా మెత్తగా వుండే బొప్పాయి పండును ఎంపిక చేసుకోవాలి. దానిని బాగా పిండి ఒక గిన్నెలో మెత్తని గుజ్జులా తయారుచేసుకోవాలి. ఆ గుజ్జును మర్దన చేస్తూ ముఖమంతా రాసుకోవాలి. ఇలా దాదాపు 20 నుండి 30నిముషాల వరకూ సున్నితంగా మసాజ్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
2. మెత్తగా వున్న బొప్పాయిని గుజ్జుగా చేసుకోవాలి. అందులో కాస్త పచ్చిపాలను వేసి బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించుకోవాలి. కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రెగ్యులర్’గా చేస్తే.. చర్మం కాంతివంతంగా, తెల్లగా మారుతుంది.
3. ఒక గిన్నెలో బొప్పాయి గుజ్జు తీసుకుని అందులో గుడ్డు తెల్లసొన వేసి కలియబెట్టాలి. ఆ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్’లా ముఖానికి వేసుకొని అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. చర్మం బిగుతుగా, మృదువుగా తయారవుతుంది.
4. ఒక గిన్నెలో బొప్పాయి గుజ్జును తీసుకుని అందుకు తగిన పరిమాణంలో ఆలివ్ ఆయిల్’ని మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్’లా వేసుకొని, 15నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మానికి మంచి నిగారింపు వస్తుంది.
5. బొప్పాయి గుజ్జులో ఓట్ మీల్ పౌడర్ వేసి బాగా కలియబెట్టాలి. ఈ పేస్ట్’ను ముఖానికి పట్టించి అరగంట తర్వాత రుద్దుకోవాలి. అనంతరం శుభ్రంగా కడుక్కోవాలి. ఇదొక స్క్రబ్బింగ్’లా పనిచేస్తుంది. ఇలా చేయడంవల్ల డెడ్స్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.
6. బొప్పాయి గుజ్జులో నిమ్మరసం లేదా ఆరెంజ్ జ్యూస్ మిక్స్ చేసి కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి 15-20నిముషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే.. చర్మానికి మంచి నిగారింపు వస్తుంది. అలాగే ముఖంమీదుండే మొటిమలు, మచ్చలు మటుమాయమవుతాయి.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more