వేసవికాలం వచ్చిందంటే చాలు.. చర్మం పొడిగా మారడం, చర్మం మధ్య చీలికలు వచ్చినట్లుగా ఛారలు కనిపించడం, పేలిపోయిన మొహం వంటి లక్షణాలు ప్రతిఒక్కరిలోనూ కనిపిస్తాయి. ఇలాంటి సమయాల్లో బ్యూటీ ప్రొడక్ట్స్ కాకుండా అలోవెరాతో ఫేస్ ప్యాక్ తయారుచేసుకుని ముఖానికి పట్టిస్తే.. మెరిసే సౌందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ అలోవెరాలో సౌందర్యాన్ని పెంపొందించే పోషకాలు అధిక మోతాదులో నిల్వవుంటాయి కాబట్టి.. అవి చర్మాన్ని మెరుగ్గా చేస్తాయి.
అలోవెర ఫేస్ ప్యాక్ చేసే విధానం :
- ఒక గిన్నె తీసుకుని అందులో తేనె, పసుపు, పాలు తగిన మోతాదులో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలో సరైన క్రమంలో అలోవెరా వేసి మరోసారి మొత్తాన్ని బాగా కలియబెట్టాలి. ఈ విధంగా కలిపిన ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకోవాలి. కొద్దిసేపటి తర్వాత గోరువెచ్చని నీరుతో శుభ్రం చేసుకోవాలి. ఇలా ప్రతిరోజూ చేస్తే.. చర్మం మృదువుగా తయారవుతుంది.
- ఒక పాత్ర తీసుకుని అందులో సరైన పరిమాణంలో నిమ్మరసం, ఖర్జూరం వేసి మిక్స్ చేయాలి. ఇందులో అలోవెరా కొద్దిగా మిక్స్ చేసి ప్యాక్ లా బాగా కలియబెట్టాలి. ఈ విధంగా చేసిన ఈ మిశ్రమాన్ని ముఖంపై అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు ఈ ప్యాక్ వేసుకుంటే.. డ్రై స్కిన్ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.
- ఈ అలోవెరా సన్ టాన్, బ్లాక్ హెడ్స్ నివారించడంలోనూ కీలకపాత్ర వహిస్తుంది. ఒక పాత్రలో కొద్దిగా టమోటో జ్యూస్, అలోవెరా జెల్ వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, కొద్దిసేపు అలాగే వుంచుకోవాలి. అనంతరం గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. అంతే.. ఇలా వారానికి మూడుసార్లు చేస్తే.. సన్ టాన్ ని నివారించుకోవచ్చు.
- ఇక చర్మఛాయను మెరుగుపర్చడంలో, ఏజ్ సాట్స్, మొటిమల మచ్చలు, పిగ్మెంటేషన్ మార్క్స్, బర్న్స్, గాయాలకు మార్క్స్‌ను నివారించడంలోనూ ఈ అలోవెరా సహాయపడుతుంది. అలోవెరా జెల్, రోజ్ వాటర్ ను ఒక పాత్రలో వేసి బాగా కలియబెట్టాలి. దీన్ని ముఖంపై ఓ ప్యాక్ లా వేసుకుని, కాసేపు తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజుకోసారి చేస్తే ఫలితం గమనించవచ్చు.
- సున్నితమైన చర్మం కలిగినవారు.. కీరదోసకాయ రసంలో అలోవెరా, రోజ్ వాటర్ వేసి మిక్స్ చేయాలి. దీన్ని ఫేస్ వాష్ గా ఉపయోగించుకుంటే.. మొటిమలు, బ్లాక్ హెడ్స్ వంటివి పూర్తిగా తొలిగిపోవడంతోపాటు మెరుగైన చర్మం పొందవచ్చునని బ్యూటీషియన్లు అంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more