oil skin face pack | beauty home remedies

Oil skin face packs beauty tips

oil skin tips, oil skin beauty tips, oil skin home remedies, oil skin face packs, oil skin tips telugu, multani matti facepack

oil skin face packs beauty tips : The Homemade facepacks which help to get rid from oil skin.

ఆయిల్ స్కిన్ కు చెక్ పెట్టే ఫేస్ ప్యాక్స్

Posted: 04/04/2015 03:22 PM IST
Oil skin face packs beauty tips

ఆయిల్ స్కిన్ వున్నవారు దాన్నుంచి ఉపశమనం పొందేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా.. అంతగా ఫలితం లభించదు. బ్యూటీ ప్రోడక్ట్స్ కొద్దిసేపటి వరకు దాన్నుంచి విముక్తి కలిగించినప్పటికీ.. తిరిగి చర్మం యథాస్థానానికి చేరుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో దీని నుంచి రిలీఫ్ పొంది, మెరుగైన సౌందర్యం పొందాలంటే అందుకు కొన్ని ఫేస్ ప్యాక్స్ వున్నాయి. వీటిని ముఖానికి పట్టించినప్పుడు ఎంతో సమర్థవంతంగా పనిచేసి, చర్మసౌందర్యాన్ని పెంచుతాయి. మరి.. ఆ ఫేస్ ప్యాక్స్ ఏంటో తెలుసుకుందామా..

1. ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ : ముల్తాని మట్టికి కొద్దిగా రోజ్ వాటర్ మిక్స్ చేసి, పేస్టులా తయారుచేసుకోవాలి. ఈ పేస్టును ముఖానికి పట్టించి 20 నిముషాల వరకు అలాగే వుంచుకోవాలి. అనంతరం గోరువెచ్చని నీరుతో శుభ్రం చేసుకోవాలి. ఈ ఫేస్ ప్యాక్ ను వారానికి రెండుసార్లు ముఖానికి పట్టిస్తే.. అది చర్మంలోని ఎక్సెస్ ఆయిల్‌ను గ్రహించి చర్మాన్ని కాంతివంతంగా మార్చుతుంది. అలాగే చర్మ రంద్రాలను శుభ్రం చేసి, బ్లాక్ హెడ్స్‌ను నివారిస్తుంది. తద్వారా ముఖంలో మంచి గ్లో వస్తుంది.

2. పసుపు-శెనగపిండి ప్యాక్ : పసుపు, శెనగపిండిని రెండింటిని కొద్దికొద్దిగా ఒక బౌల్లో వేసి మిక్స్ చేయాలి. అనంతరం అందులో కొద్దిగా పాలు పోసి పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి మాస్క్‌లా వేసుకని, కొద్దిసేపటివరకు అలాగే వుంచుకోవాలి. అనంతరం నీటితో శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేస్తే.. ఈ ప్యాక్ చర్మంలోని ఎక్సెస్ ఆయిల్‌ను నివారించడంతో పాటు, డెడ్ స్కిన్ సెల్స్‌ను నివారిస్తుంది.
 
3. విటమిన్ సి కలిగిన పండ్లతో ప్యాక్ : ఆరెంజ్, స్ట్రాబెర్రీ, పైనాపిల్, టమోటోలతోపాటు అన్ని రకాల పండ్లలోనూ విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ విటమిన్ కలిగివున్న ఏదైనా ఓ పండును తీసుకుని.. దాన్ని మెత్తని పేస్టులా చేసుకోవాలి. ఆ పేస్టును ముఖానికి పట్టించి, కొద్దిసేపటి తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇది చర్మంలోని ఎక్సెస్ ఆయిల్‌ను తొలగిస్తుందని బ్యూటీషన్లు సూచిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : oil skin beauty tips  face health tips  beauty products  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more