సూర్యతాపం ప్రభావానికి చర్మసౌందర్యం క్షీణిస్తుంది. ముందుగా చెమటలు రావడంతో ముఖం జిడ్డుగా మారుతుంది. ఆ తర్వాత దుమ్ము, ధూళి చేరిపోవడంతో ముఖం మరింత వికారంగా కనిపిస్తుంది. అప్పుడు మొటిమలు, నల్లని ఛాయలు వంటి రావడం, చర్మం పొడిబారిపోవడం, ముసలితనం వచ్చినట్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ చర్మ సమస్యల నుంచి ఉపశమనం పొంది, సౌందర్యాన్ని మరింత మెరుగుపర్చుకోవాలంటే అందుకు అనుగుణంగా కొన్ని బ్యూటీ ప్యాక్స్ అందుబాటులో వున్నాయి. అటువంటి వాటిలో ఖర్బూజ-స్ట్రాబెర్రీ ప్యాక్, ఖర్భూజ-శెనగపిండి ప్యాక్ లు వున్నాయి. వీటిని నిత్యం చర్మానికి పట్టిస్తే.. త్వరలోనే ఫలితాన్ని గమనించవచ్చు.
ఖర్బూజ-స్ట్రాబెర్రీ ప్యాక్ : ఒక పాత్ర తీసుకుని అందులో మస్క్ మెలోన్ ముక్కలు, స్ట్రాబెర్రీ 3 వేసి బాగా కలుపుకోవాలి. అనంతరం అందులో ఒక చెంచా ఓట్ మీల్, ఒక చెంచా తేనె వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని శరీరం, ముఖం, మెడకు అప్లై చేసి స్ర్కబ్ చేయాలి. 15నిముషాల తర్వాత మంచి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేసుకుంటే... చర్మం తేమగా, మృదువుగా, ప్రకాశవంతంగా మారుతుంది.
ఖర్భూజ-శెనగపిండి ప్యాక్ : ఒక గిన్నెలో ఒక కప్పు మస్క్ మెలోన్ జ్యూస్ తీసుకొని అందులో శెనగపిండి వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని పేస్టులా వచ్చేంతవరకు మిక్స్ చేయాలి. అనంతరం బాడీ మొత్తం స్క్రబ్ చేయాలి. ఇలా చేసిన 15 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా ఈ ప్యాక్ పట్టించడం వల్ల చర్మం అందంగా.. ఆకర్షణీయంగా మారుతుంది. దీన్ని వారానికోసారి ట్రై చేయాలి.
(And get your daily news straight to your inbox)
Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more
Oct 23 | నేటి కాలంలో మన జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more
Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more
Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more
May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more