pumpkin honey face pack beauty benefits | skin problems

Pumpkin honey face pack beauty benefits skin problems

pumpkin honey beauty tips, pumpkin honey facepack, pumpkin honey beauty benefits, pumpkin beauty benefits, Pumpkin Honey beauty health, health tips, beauty tips, beauty tips telugu, beauty face packs

pumpkin honey face pack beauty benefits skin problems : The Beauty and Skin benefits from pumpkin honey face pack. It increase the glow and smoothness of skin as well as reduce the skin heat problem.

చర్మ ముడతలను నివారించే గుమ్మడి-తేనె ఫేస్ ప్యాక్

Posted: 04/11/2015 02:52 PM IST
Pumpkin honey face pack beauty benefits skin problems

వాతావరణ పరిస్థితుల్లో వచ్చే మార్పుల కారణంగానూ, వయస్సు పైబడటం వల్లగానూ చర్మం ముడతలు పడుతుంటుంది. తద్వారా చర్మసౌందర్యం పూర్తిగా తగ్గిపోవడంతో కాలక్రమంలో అందవిహీనంగా కనిపిస్తారు. ఆ తర్వాత మొటిమలు, నల్లని ఛాయలు, ఇంకా ఇతరత్ర చర్మ సమస్యలు వచ్చే అవకాశం వుంది. కాబట్టి.. ముందుగా చర్మం ముడతలు పడకుండా జాగ్రత్త పడితే.. ఈ చర్మ సమస్యల నుంచి విముక్తి పొందడంతోపాటు సౌందర్యం మెరుగుపడుతుంది. అయితే.. చర్మం ముడతలు పడకుండా వుండాటానికి  బ్యూటీ ప్రోడక్ట్స్ వాడడం కంటే కొన్ని హోమ్ రెమెడీస్ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తాయి. అలాంటి వాటిల్లో గుమ్మడి-తేనె ఫేస్ ప్యాక్ ని ఒకటిగా చెప్పుకోవచ్చు.

ఎందుకంటే.. ఈ ఫేస్ ప్యాక్ చర్మసౌందర్యాన్ని మెరుగుపరచడంతోపాటు ఎన్నోరకాల చర్మసమస్యల నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా ఈ రెండింటిలో ఒకటైన గుమ్మడిలో ఎన్నో పోషకాలు వుంటాయి. తద్వారా దాని నుంచి ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. అవేమిటంటే.. ఈ గుమ్మడి ముడతలను నివారిస్తుంది.. హైడ్రేషన్ అందిస్తుంది.. గుమ్మడి జ్యూస్‌లో క్యాల్షియం, ప్రోటన్స్, పొటాషియం అధికంగా ఉండటం వల్ల అవి చర్మంలోని మచ్చలను, పిగ్మెంటేషన్ లతోపాటు ఇతర సమస్యలను నివారిస్తాయి. అలాగే గుమ్మడిలో వుండే జింక్, విటమిన్ సి వంటి పోషకాలు కాలిన గాయాలను మాన్పడంలో సమర్థవంతంగా పనిచేస్తాయి. అంతేకాదు.. ఏవైనా కీటకాలు కుట్టినప్పుడు కలిగే మంటను నివారించడంలో గుమ్మడి జ్యూస్ ఎంతో సహకరిస్తుంది. చర్మ ఇన్ఫెక్షన్‌ను తగ్గిస్తుంది. ఇన్ని పోషకాలు కలిగిన గుమ్మడిలో కాస్త తేనె కలుపుకుంటే.. మరిన్ని బెనిఫిట్స్ పొందవచ్చు.

గుమ్మడి - తేనె ఫేస్ ప్యాక్ :

1. ఒక చిన్న పాత్ర తీసుకుని అందులో కొద్దిగా గుమ్మడి జ్యూస్ తీసుకోవాలి. అనంతరం అందులో కొద్దికొద్దిగా తేనె, పెరుగు, నిమ్మరసం తదితర పదార్థాలను మిక్స్ చేసి.. చిక్కటి పేస్ట్‌గా తయారుచేసుకోవాలి. ఈ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్‌లా వేసుకోవాలి. కాసేపు తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేసుకుంటే.. ముడతల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. ఫలితంగా చర్మం మృదువుగా, సౌందర్యవంతంగా మారుతుంది. ఇంకో విషయం ఏమిటంటే.. ఈ ఫేస్ ప్యాక్ స్కిన్ మాయిశ్చరైజ్ గా కూడా పని చేస్తుంది.
 
2. ఒక పాత్ర తీసుకుని అందులో కొద్దిగా గుమ్మడి జ్యూస్, కొద్దిగా తేనె వేసి బాగా కలియబెట్టాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చర్మం తేలికగా మారి, మచ్చలు లేకుండా పోతాయి. అలాగే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pumpkin Honey facepack  beauty tips  beauty home remedies  

Other Articles

  • Telugu content

    ఇంటా కలబంద.. ఆరోగ్యం మీ చెంత..

    Oct 24 | నేటి జీవనక్రమంలో కాలుష్య బారిన పడకుండా ఉండడం గమనార్హం.. అలా అని కాలుష్య బారిన పడి ఇటు చర్మాన్ని పాడు చేస్కోలేము.. ముఖం పై మచ్చలు,పొడిబరడం ఈ కాలుష్య జీవనానికి అందుకుంటున్న ముప్పు..వీటిని అరికట్టడం... Read more

  • Benefits of badam

    బాదంతో అందం - ఆరోగ్యం

    Oct 23 | నేటి  కాలంలో  మన  జీవన శైలిలో అందం - ఆరోగ్యం రెండు ఎంతో కీలకమైన భూమికను వహిస్తున్నాయి. రెండిట్లో దేని నిర్లక్ష్యం  చెయ్యలేని పరిస్థితి.. రెండిటిని బ్యాలన్స్ చెయ్యడం ఎలా అని ఆలోచించే వారందరికీ... Read more

  • Oninon and lemon are very good for face

    ఉల్లిపాయతో సౌందర్యం..

    Jun 09 | అందమైన ముఖానికి మరింత అందాన్నిచ్చే టిప్స్ ఒక్కోసారి మనకి అందుబాటులో ఉన్నా కూడ వాటిని పెద్దగా పట్టించుకోము. లేనిపోని రంగులతో ముఖాన్ని అందంగా మలచుకుంటుంటాము. ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్నవాటితోనే మన ఫేస్ ని... Read more

  • Fat reduce drinks beauty tips

    మార్నింగ్ డ్రింక్స్ తో మెరుగైన రూపం..!

    Jun 04 | 'చక్కనమ్మా చిక్కినా అందమే' అంటారు. ఎందుకంటే బొద్దుగా, చబ్బీగా ఉండేవాళ్లు కొంచెం చిక్కితే ఆరోగ్యానికి ఆరోగ్యం, అందానికి అందం అని. అయితే ఇటీవల కాలంలో అనేక కారణాలవల్ల చాలామందికి ఊబకాయం వస్తోంది. ఆడవాళ్ల కంటే,... Read more

  • Get glamour with rice cleaning water

    భియ్యం కడిగిన నీళ్లతో అందం

    May 23 | బియ్యం కడిగే నీల్లాను అసలు మనం పట్టించుకోము.వాటిని పడేయడమో,లేక మొక్కలకు  వేయడమో చేస్తాము.అయితే ఈ బయ్యం కడిగే నీళ్ళు మొక్కలకే కాదు మనకి కూడా ఉపయోగాపడతుంది.మనకి అవసమైన గాలినిచ్చే మొక్కలకే ఉపయోగపడే ఆ నళ్లు... Read more